పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లోని ఓ ట్యాంక్ నుంచి రేడియోధార్మికత నీరు లీక్ అవుతుండటంతో టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (టీఈపీసీఓ) అప్రమత్తమైంది. పుకోషిమా ప్లాంట్ ప్రాంగణంలో దాదాపు మూడు వందల రేడియోధార్మికత నీరు ట్యాంక్లు ఉన్నాయి. వాటికి ఏమైన లీకులు ఏర్పడ్డాయేమోనని గురువారం పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ఉద్యోగుల చేత తనిఖీలు నిర్వహించినట్లు ఆ ప్లాంట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఆ ప్లాంట్కు ఎటువంటి లీకేజీలు లేవని అధికారుల స్పష్టం చేశారు. ఓ వేళ ట్యాంక్లకు లీకులు ఏర్పడినట్లు అయితే తీసుకోవలసిన చర్యలను వారు వివరించారు.
గత నాలుగు రోజుల క్రితం ప్లాంట్లోని ఓ ట్యాంక్ నుంచి రేడియోధార్మికత నీరు లీక్ కావడంతో ప్లాంట్ ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఆ ట్యాంక్లోని ఆ నీటిని ప్లాంట్ పక్కనే ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోకి డ్రైనేజ్ ద్వారా వదిలివేసిన సంగతి తెసిందే. అ ప్రక్రియ పూర్తి అయిందని అయితే ఆ డ్రైనేజ్ ద్వారా ఆ నీరు ప్రవహించడం వల్ల ఆ పరిసర ప్రాంతాలు, మట్టిలో రేడియోధార్మికత ప్రసరించే ప్రమాదం ఉందని ప్లాంట్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
దాంతో ఆ పరిసర ప్రాంతాలను రేడియోధార్మికతను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2011, మే మాసంలో జపాన్లో సంభవించిన సునామీ, భూకంపం వల్ల పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లో చోటు చేసుకున్న దుర్ఘటన వల్ల ఎంతో మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.