Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం | A Powerful Earthquake Shakes Northern Chile: Updates - Sakshi
Sakshi News home page

వీడియో: కుదిపేసిన భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన చిలీ

Published Thu, Sep 7 2023 8:39 AM | Last Updated on Thu, Sep 7 2023 10:15 AM

Powerful Quake Shakes Northern Chile Updates - Sakshi

శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. 

దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు.   

ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement