Ring of Fire
-
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్‌పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్‌కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్‌గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనువిందు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం సంభవించిన సూర్యగ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రజలను కనువిందు చేసింది. గ్రహణం ఆదివారం ఉదయం 9.16 గంటలు మొదలుకొని దశల వారీగా మధ్యాహ్నం 3.04 గంటల వరకు కనిపించింది. చాలా మంది గ్రహణా న్ని ఆన్లైన్లో తిలకించగా కొందరు ఔత్సాహికులు కోవిడ్ దృష్ట్యా రక్షణ మాస్కులు ధరించి, భవనాల పైకి చేరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే గ్రహణం కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు సరిగ్గా చూడలేకపోయారు. కోవిడ్–19 కారణంగా అమల్లో ఉన్న భౌతిక దూరం నిబంధనలు కూడా వీక్షకులను బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా అవరోధం కలిగించాయి. -
వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!
న్యూఢిల్లీ: ఆకాశంలో ఆదివారం అద్భుత ఖగోళ సంఘటన కనువిందు చేసింది. భారత్‌వ్యాప్తంగా పలు చోట్ల పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన గ్రహణం మూడు గంటల వరకు కొనసాగింది. ఈఏడాది ఇది మూడో గ్రహణం కావడం విశేషం. ఇప్పటికే జనవరి, జూన్ మాసాల్లో రెండు చంద్రగ్రహణాలు కనిపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.05 నిముషాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి రావడంతో.. అగ్నివలయంగా సూర్యుడు దర్శనమిచ్చాడు. గుజరాత్లో సూర్యగ్రహణం ఈ శతాబ్దానికి ఇదే ‘లోతైన’ వలయాకార సూర్యగ్రహణమని జ్యోతిష్కులు, నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ దశాబ్దానికి ఇది చివరి వలయాకార సూర్యగ్రహణమని పేర్కొన్నారు. దాంతోపాటు నేటి సంపూర్ణ, వలయాకార సూర్యగ్రహణం ఖగోళ చరిత్రలో నాలుగో అత్యుత్తమైందని అంటున్నారు. కాగా, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కత, లక్నో, ముంబై, పట్నా, షిల్లాంగ్, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్, హిందూ మహాసముద్రాల ప్రాంతాల్లో, యూరప్, ఆస్ట్రేలియాలోనూ గ్రహణం కనిపించింది. (చదవండి: అగ్ని వలయంలో బీజేపీ ఎంపీ యోగా) పంజాబ్‌లో పాక్షిక సూర్యగ్రహణం -
సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందా?
సాక్షి, హైదరాబాద్ : ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం ప్రారంభమైంది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా, డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగియనుంది. అయితే తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం వుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉండనుంది. (సూర్యగ్రహణం నేడే) సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది.. కాగా భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెప్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెప్తుంటారు. గ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ చేసి మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. 0.001 శాతం మాత్రమే వైరస్ అంతం.. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు హరిస్తాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. -
సూర్యగ్రహణం నేడే
న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. ► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. ► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్ ఆఫ్ ఫైర్ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. ► సెంట్రల్ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు. – రఘునందన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా -
21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’
కోల్‌కతా: ఈనెల 21న∙సూర్యగ్రహణం సంభవించనుంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా కనిపిస్తాడు. గ్రహణంవేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు కనిపించడమే రింగ్ ఆఫ్ ఫైర్. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణమే ఉంటుంది. రాజస్తాన్‌లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై.. 11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50 గంటలకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ వెల్లడించారు. రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని కురుక్షేత్ర, సిర్సా, రథియా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, చంబా, చమోలీ, జోషిమఠ్ల్లో ఆ నిమిషం పాటు ఆ రింగ్ ఆఫ్ ఫైర్‌ను వీక్షించవచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 26న కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించదని దురై తెలిపారు. ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.48 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10.22 గంటల నుంచి మధ్యాహ్నం 1.41 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 10.13 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. -
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహాలు చేస్తున్న వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత్‌లో గురువారంనాడు ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం దక్షిణాది రాష్ట్రాల్లో కనువిందు చేసింది. కర్ణాటక, తమిళనాడులో వేలాదిగా బయటకు వచ్చిన ప్రజలు అంతరిక్ష అద్భుతం చూసి ఎంజాయ్ చేశారు. చెన్నై, తిరుచిరాపల్లి, మదురైలో సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో సూర్యుడు మబ్బుల చాటుకి చేరడంతో సూర్యగ్రహణాన్ని వీక్షించాలన్న ప్రజల ఉత్సాహం ఆవిరైపోయింది. కేరళలో చెర్వతూర్లో మొదట సూర్యగ్రహణం కనిపించింది. తర్వాత కోజికోడ్, కన్నూర్‌లో కనువిందు చేసింది. వాయనాడ్‌లో చాలా మంది ప్రజలు ఆరుబయటకి వచ్చి గ్రహణ దృశ్యాల్ని వీక్షించాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మబ్బులు కమ్మేయడంతో గ్రహణం కనిపించలేదు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పూర్తి స్థాయికి చేరుకున్న సమయంలో మబ్బులు పట్టేశాయి. ఉదయం దాదాపుగా 8 గంటలకు మొదలైన గ్రహణం 11 గంటల 15 నిమిషాలకు ముగిసింది. శబరిమలై ఆలయం, పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ ఆలయాలను గ్రహణం సందర్భంగా మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాన్ని శుద్ధి చేశాక భక్తుల్ని అనుమతించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తే ఒమన్‌లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో తొలుత సూర్యగ్రహణం కనిపించింది. అరబ్ దేశాలు, సింగపూర్, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది. రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు అంతటా కనిపించలేదంటే... ఖగోళ అద్భుతాన్ని వీక్షించి 2019 సంవత్సరానికి గుడ్ బై కొట్టాలన్న చాలా మంది ఆశలు ఆవిరయ్యాయి. రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందని అంచనా వేశారు కానీ చాలాచోట్ల కనిపించలేదు. దీనికి గల కారణాలను తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ ఎస్. సౌందరరాజపెరుమాళ్ వివరించారు. ‘ఈసారి గ్రహణం సమయంలో చంద్రుడు భూమికి 3.85 లక్షల కి.మీ. దూరంలో ప్రయాణిస్తున్నాడు. శీతాకాలం కావడంతో సూర్యుడికి అత్యంత సమీపంలోకి భూమి వచ్చింది. దీంతో సూర్యుడి పరిమాణం ప్రజలకి చాలా పెద్దదిగా కనిపించింది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పటికీ పూర్తిగా సూర్యుడి ఉపరితలానికి అడ్డుగా రాలేకపోవడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించలేదు’అని వెల్లడించారు. ప్రధానికీ నిరాశే! సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలనే ప్రధాని మోదీ కోరిక తీరలేదు. ‘భారతీయుల్లాగే నేను కూడా ఏడాది చివర్లో వచ్చిన సూర్యగ్రహణాన్ని వీక్షించాలని ఉత్సాహం చూపించాను. దురదృష్టవశాత్తూ మబ్బులు అడ్డం రావడంతో చూడలేకపోయాను. అయితే కోజికోడ్, ఇతర ప్రాంతాల్లో సూర్యగ్రహణ దృశ్యాలను లైవ్‌లో చూశాను. ఈ సందర్భంగా కొంతమంది నిపుణులతో మాట్లాడి గ్రహణంపై అవగాహన పెంచుకున్నాను’’అని మోదీ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఎన్నో ఫోటోలను షేర్ చేశారు. మోదీ కళ్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని సూర్యుడ్ని వీక్షిస్తున్న ఫొటోను ఒక ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెల్సి ప్రధాని చాలా కూల్‌గా ‘ఎంజాయ్’ అంటూ బదులిచ్చారు. అహ్మదాబాద్‌లో ఫిల్టర్ అద్దాలతో గ్రహణాన్ని చూస్తున్న యువతి -
నేడే సూర్యగ్రహణం
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గుడ్‌బై కొట్టేస్తూ 2020 కొత్త సంవత్సరానికి స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో సూర్యగ్రహణం సంభవించడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. గురువారం నాడు సంభవించే వార్షిక సూర్యగ్రహణం ఈ సారి భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. దక్షిణ భారత దేశంలో ఈ సారి సూర్యగ్రహణం అధికంగా కనిపించనుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ. అయితే ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాదు. ఆకాశంలో సూర్యుడు ఒక ఉంగరంలా మారే అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఫైర్ ఆవిష్కృతం కానుంది. భూమికి చంద్రుడు చాలా దూరంగా ఉండడం వల్ల ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఏర్పడుతోంది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. ► ఈ సారి సూర్యగ్రహణం భారత్‌లో 3 గంటల 12 నిమిషాల సేపు కొనసాగుతుంది. ► భారత కాలమాన ప్రకారం ఉదయం 8:04గంటలకు ప్రారంభమవుతుంది ► ఉచ్ఛస్థితికి ఉదయం 9:27కి చేరుకుంటుంది. ► ఉదయం 11:05గంటలకు ముగుస్తుంది. భారత్‌లో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించే ప్రాంతాలు ► ఊటీ, మంగళూరు, కోయంబత్తూర్, శివగంగ, తిరుచిరాపల్లి, కసరాగాడ్ భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఎక్కడెక్కడ? ఢిల్లీ, పుణె, జైపూర్, లక్నో, కాన్పూర్, నాగపూర్, ఇండోర్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, భోపాల్, విశాఖపట్నం, లూథియానా, ఆగ్రా నేరుగా చూడొద్దు ► కంటితో నేరుగా సూర్యగ్రహణం చూడడం అత్యంత ప్రమాదం. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ఎంత మాత్రమూ మంచిది కాదు. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కంటి రెటినాపై ప్రభావం చూపుతుంది. ► నల్ల కళ్లద్దాలు, మార్కెట్లో లభించే ఇతర సోలార్ ఫిల్టర్స్‌తో సూర్యగ్రహణం చూడకూడదు. ► కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్స్ ఇతర పరికరాలతో చూడొద్దు. ► మార్కెట్లో ప్రత్యేకంగా సూర్యగ్రహణం చూడడానికి తయారు చేసే సోలార్ ఫిల్టర్స్ ద్వారా మాత్రమే చూడాలి. ► వెల్డర్స్ గ్లాస్ నెంబర్ 14 సూర్యగ్రహణం చూడడానికి అత్యుత్తమమైనది. ఇది కంటికి అత్యంత రక్షణ కల్పిస్తుందని మధ్యప్రదేశ్‌లో బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్త దేబిప్రసాద్ దౌరి చెప్పారు. ఏయే దేశాల్లో భారత్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, ఖతర్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్ , తూర్పు రష్యా, ఆస్ట్రేలియా -
దూసుకొస్తున్న మహా ప్రళయం..!
సాక్షి, వెబ్ డెస్క్ : రింగ్ ఆఫ్ ఫైర్ తీరంలో వరుస భూ ప్రకంపనలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతంలో ఆవరించిన ఉన్న ‘రింగ్ ఆఫ్ఫైర్ జోన్’లో కదలిక వల్ల జపాన్, గ్వామ్, తైవాన్, అలస్కా, ఫిలిప్పీన్స్‌లో భూ కంపాలు విలయతాండవం సృష్టించాయి. అన్నిటి కన్నా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. అతి త్వరలో భారీ భూకంపాలు మరోసారి పసిఫిక్ తీర ప్రాంత దేశాలపై విరుచుకుపడబోతున్నాయని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తైవాన్‌లో సంభవించిన భూ కంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.4గా నమోదు కాగా, గ్వామ్లో 5.7, 5.6, 5.4, 4.9 తీవ్రతలతో పలుమార్లు భూమి కంపించింది. ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటివరకూ జపాన్ తీర ప్రాంతంలో మూడు సార్లు భూమి తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఆదివారం కూడా 4.8 తీవ్రతతో తైవాన్‌లో తీరప్రాంతంలో భూమి కంపించింది. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఎప్పటినుంచో గాఢ నిద్రలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ నేపథ్యంలో రింగ్ ఆఫ్ ఫైర్‌లో మొదలైన కదలికలు మానవాళిని అతలాకుతలం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్‌లో వస్తున్న కదలికలు సాధారణమైనవేనని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న భూకంపాల్లో 90 శాతం రింగ్ ఆఫ్ ఫైర్ ఆవరించిన ప్రాంతంలోనే వస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అగ్ని పర్వతాల్లో నాలుగింట మూడో వంతు రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఉన్నాయి. భూమి ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏంటి? రింగ్ ఆఫ్ ఫైర్ అనేది గుర్రపు నాడ ఆకృతిలో ఉంటే ఓ డిజాస్టర్ జోన్. రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ ప్రాంతంలో 450కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. టెక్టోనిక్ ప్లేట్స్ తరచూ కదులుతూ ఈ అగ్నిపర్వతాల విస్ఫోటనానికి కారణం అవుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ భూమి క్రెస్ట్కు కనెక్ట్ అయి ఉండటం వల్ల భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే నష్ట తీవ్రత ఊహించలేనంతగా ఉంటుంది. న్యూజిలాండ్ ద్వీపం నుంచి ఆసియా, అమెరికా తీర ప్రాంతాలను తాకుతూ దక్షిణ అమెరికాలోని చిలీ వరకూ రింగ్ ఆఫ్ ఫైర్ విస్తరించి ఉంది. అంటే 40 వేల కిలోమీటర్ల దూరం పాటు భారీ భూకంప వలయం భూమిపై ఉందన్నమాట. రింగ్ ఆఫ్ ఫైర్‌లో కొన్ని చోట్ల సబ్డక్షన్ జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై మరొకటి అమర్చి ఉన్నాయి. ఈ కారణంగానే సముద్ర గర్భంలో భూ కంపాలు సంభవించినప్పుడు భారీ సునామీలు మానవాళిపై విరుచుకుపడుతున్నాయి.