
తైవాన్‌లో కనిపించిన సూర్య గ్రహణం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం సంభవించిన సూర్యగ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రజలను కనువిందు చేసింది. గ్రహణం ఆదివారం ఉదయం 9.16 గంటలు మొదలుకొని దశల వారీగా మధ్యాహ్నం 3.04 గంటల వరకు కనిపించింది. చాలా మంది గ్రహణా న్ని ఆన్‌లైన్‌లో తిలకించగా కొందరు ఔత్సాహికులు కోవిడ్ దృష్ట్యా రక్షణ మాస్కులు ధరించి, భవనాల పైకి చేరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే గ్రహణం కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు సరిగ్గా చూడలేకపోయారు. కోవిడ్–19 కారణంగా అమల్లో ఉన్న భౌతిక దూరం నిబంధనలు కూడా వీక్షకులను బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా అవరోధం కలిగించాయి.