jolts
-
రాజస్థాన్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
రాజస్థాన్‌లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. -
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
Indonesia Earthquake: జావాను కుదిపేసిన భూకంపం
జకార్తా: భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఉత్తర ప్రాంతం వైపుగా జావా ద్వీపాన్ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం భారీ ప్రకంపనలు జావా చుట్టుపక్కల కుదిపేశాయి. అయితే.. భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతం కావడంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. సురబయ, టుబాన్, డెన్‌పాసర్, సెమరాంగ్‌లలో ప్రకంపనల తీవ్రత స్పష్టంగా కనిపించిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నష్టంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే.. USGS భూకం తీవ్రత 7గా నమోదు చేయగా.. మరోవైపు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మో లాజికల్ సెంటర్ (EMSC) భూకంపం 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది. -
టర్కీలో మరోసారి భూకంపం
టర్కీ aka తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. శనివారం ఉదయం గోక్సన్ జిల్లాలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ ప్రకంపనలతో భీతిల్లిన జనం వీధుల వెంట పరుగులు తీశారు. గోక్సన్ జిల్లాకు నైరుతి వైపున ఆరు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రకంపనలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి నష్టం ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పట్లో కోలుకోలేని విధంగా టర్కీ నష్టపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియా సైతం భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. ఇదిలా ఉండగా.. టర్కీ భూకంప బాధితుల సహాయార్థం కేరళ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 10 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ కోణం! -
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో బుధావరం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత 15 నిమిషాల్లోనే 31వేల మంది తాము ఉన్న చోట్ల భూమి కంపించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే భూకంపం కారణంగా ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు. A 6.2 magnitude earthquake has struck near the city of Wellington in New Zealand. #earthquake #NewZealand #Wellington #earthquakes pic.twitter.com/GQ2esClqa4 — Dp Rathi (@rathi_dp) February 15, 2023 న్యూజిలాండ్‌లో ఇప్పటికే సైక్లోన్ గేబ్రిల్లే విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో10,500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో భూకంపం రూపంలో మరో ఉపద్రవం రావడం న్యూజిలాండ్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. #NewZealand Now 6.1 magnitude #earthquake in New Zealand , people in shock@IsraelinNZ @nytimes @nytimesworld @BBCWorld @CNN #ValentinesDay #joker2 #SUGA_AgustD_TOUR #ChampionsLeague #BabarAzam𓃵 #บิวเป็นพีทที่สมบูรณ์แบบ #14february #mha380 #AgustD #หวานใจมิวกลัฟ #Quantumania pic.twitter.com/6WbDovUPbY — Journalist Amit kumar 'देव' (@AmitKum995) February 15, 2023 A state of emergency has been declared in New Zealand as 'unprecedented' storm lashes North Island. Read more: https://t.co/zt61o4VdId pic.twitter.com/ETJiaE738Z — SBS News (@SBSNews) February 14, 2023 New Zealand has declared a state of national emergency in the wake of Cyclone Gabrielle. Take a look at the extent of the flooding in Hawke's Bay, NZ:pic.twitter.com/KXAt9hs3lC — Steve Hanke (@steve_hanke) February 14, 2023 New Zealand declared a state of emergency for only the third time in its history after Cyclone Gabrielle flooded parts of the country. The cyclone cut power to 225,000 residents, stranded people on rooftops and swept at least one sailor out to sea. https://t.co/fLzWhOlL7Q pic.twitter.com/581xvHSHCk — The New York Times (@nytimes) February 15, 2023 చదవండి: లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..! -
Earthquake: పంజాబ్‌లో భూకంపం
న్యూఢిల్లీ: ఉత్తర భారతం మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. పంజాబ్‌లో సోమవారం వేకువ ఝామున భూమి కంపించింది. కొన్నిసెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అమృత్సర్ సమీపంలో రాత్రి 3గం.42నిమిషాల ప్రాంతంలో 120 కిలోమీటర్ల భూకేంద్రంగా భూమి కంపించిందని తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రాత్రంతా రోడ్ల మీద జాగం చేశారు. ఇదిలా ఉంటే.. గత వారంలో ఇలా ఉత్తర భారతాన్ని భూమి వణికించడం ఇది మూడోసారి. Earthquake of Magnitude:4.1, Occurred on 14-11-2022, 03:42:27 IST, Lat: 31.95 & Long: 73.38, Depth: 120 Km ,Location: 145km WNW of Amritsar, Punjab, India for more information Download the BhooKamp App https://t.co/xlln0b95oC@Indiametdept @ndmaindia pic.twitter.com/WvOa72HgIo — National Center for Seismology (@NCS_Earthquake) November 13, 2022 తాజాగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బుధ, శనివారాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంప ప్రభావంతో(6.3 తీవ్రత) నవంబర్ 9న ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఇంకా పలు చోట్ల భూమి కంపించగా.. నవంబర్ 12వ తేదీన నేపాల్ భూకంప ప్రభావం(5.4 తీవ్రత) మరోసారి ఉత్తర భారతంలో చూపించింది. అయితే తక్కువ తీవ్రతతో నమోదు అవుతున్న వరుస ప్రకంపనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. -
Earthquake: ఉత్తరాఖండ్‌లోనూ భూకంపం
పితోర్ఘడ్: ఉత్తరాదిలో వరుస భూ ప్రకంపనల ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో గత అర్ధరాత్రి కొన్నిసెకన్ల పాటు భూమి కంపించింది. అయితే.. బుధవారం వేకువ జామున ఉత్తరాఖండ్‌లోనూ భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప ప్రభావంతో.. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోనూ భూమి కంపించింది. ఈ క్రమంలో.. ఉత్తరాఖండ్ పితోర్ఘడ్ కేంద్రంగా భూమి కంపించింది. ఉదయం ఆరున్నర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు భారత జాతీయ భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించింది. ఇక నేపాల్‌లో 6.3 తీవ్రత, 1.7 తీవ్రతతో వరుసగా స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. నేపాల్ దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి.. ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: ‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ -
మళ్లీ అదే తేదీ.. ఊగిపోయి కుప్పకూలిన బిల్డింగులు
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి. En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn — Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022 విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్మెంట్స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ. ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు.. -
Earthquake: ఇరాన్లో భారీ భూకంపం
టెహ్రాన్: భారీ భూకంపంతో ఇరాన్ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవాం అర్ధరాత్రి నుంచి శనివారం తిరిగి తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో పలుమార్లు భూమి కంపించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ ఝామున వరకు చాలాసార్లు ప్రకంపనలు సంభవించాయి ఈ ప్రాంతంలో. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 4.6, 4.4, ఆపై 6.0, 6.3గా నమోదు అయ్యింది. ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. pic.twitter.com/31x4FeDAEL — المركز الوطني للأرصاد (@NCMS_media) July 1, 2022 #BREAKING #IRAN 🔴 IRAN :#VIDEO AFTERMATH OF STRONG EARTHQUAKES MAGNITUDE 6.1 AND 6.3 WHICH HIT SOUTHERN IRAN, Sayeh-Khosh village, the hardest-hit area in #Hormozgan. All the village have been ruined by the earthquakes & there are casualties.#BreakingNews #Earthquake #Sismo pic.twitter.com/AtPcJVzqSN — loveworld (@LoveWorld_Peopl) July 2, 2022 టెక్టోనిక్ ప్లేట్ల అంచున వివిధ ఫాల్ట్ లైన్లను దాటుతున్న ఇరాన్.. బలమైన భూకంపాలకు నెలవుగా మారింది. తాజా భూకంప తీవ్రత 10కిలోమీటర్ల ప్రభావం చూపెట్టింది. ఇక 1990లో రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఉత్తర ఇరాన్ ప్రాంతంలో 40,000 మందిని పొట్టనబెట్టుకుంది. యూఏఈలోనూ ప్రకంపనలు యూఏఈలో, ఏడు ఎమిరేట్స్‌లోనూ స్వల్పప్రకంపనలు సంభవించాయని యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ తెలిపింది. అయితే ప్రభావం ఎలాంటి నష్టం చూపించలేదని యూఏఈ తెలిపింది. షార్జాలో ప్రకంపనలతో రోడ్ల మీదకు చేరిన జనం -
జపాన్ లో భూకంపం
టోక్యో: జపాన్ లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఫసిఫిక్ మహా సముద్రానికి సరిహద్దుల్లో ఉన్న ఇబార్కి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. జపాన్ రాజధాని టోక్యో నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో నేటి ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.