పితోర్‌ఘడ్: ఉత్తరాదిలో వరుస భూ ప్రకంపనల ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో గత అర్ధరాత్రి కొన్నిసెకన్ల పాటు భూమి కంపించింది. అయితే.. బుధవారం వేకువ జామున ఉత్తరాఖండ్‌లోనూ భూకంపం సంభవించింది.
నేపాల్‌లో భూకంప ప్రభావంతో.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోనూ భూమి కంపించింది. ఈ క్రమంలో.. ఉత్తరాఖండ్ పితోర్‌ఘడ్ కేంద్రంగా భూమి కంపించింది. ఉదయం ఆరున్నర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు భారత జాతీయ భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించింది.
ఇక నేపాల్‌లో 6.3 తీవ్రత, 1.7 తీవ్రతతో వరుసగా స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. నేపాల్ దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి.. ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: ‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ
Comments
Please login to add a commentAdd a comment