
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఉత్తర భారతం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకొని సతమతమవుతున్న ఢిల్లీవాసులను ఈభూకంపం భయకంపితులను చేసింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 5.5గా నమోదైంది.
ఉత్తరాఖండ్‌లోని రద్రప్రయాగలో 30కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా తూర్పు డెహ్రాడూన్‌కు 121 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపక కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment