
రాజస్థాన్‌లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.