టర్కీ aka తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. శనివారం ఉదయం గోక్సన్ జిల్లాలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ ప్రకంపనలతో భీతిల్లిన జనం వీధుల వెంట పరుగులు తీశారు.
గోక్సన్ జిల్లాకు నైరుతి వైపున ఆరు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రకంపనలు వాటిల్లినట్లు తెలుస్తోంది.
ప్రకంపనల ధాటికి నష్టం ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పట్లో కోలుకోలేని విధంగా టర్కీ నష్టపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియా సైతం భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. ఇదిలా ఉండగా.. టర్కీ భూకంప బాధితుల సహాయార్థం కేరళ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 10 కోట్లు మంజూరు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ కోణం!
Comments
Please login to add a commentAdd a comment