ఫిజీలో భూకంపం
వెల్లింగ్టన్: ఫిజీలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు అయిందని యూఎస్ భూకంప పరిశోధకులు వెల్లడించారు. అయితే సునామి వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం..ఉదయం 9.28 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఫిజీలోని ఎండోయి ఐలాండ్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తన వెబ్ సైట్లో వెల్లడించింది.