సింగపూర్ : ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ వార్తలు అంతలేదు. గోరోన్తొలోఫ్రావిన్స్‌కు దక్షిణాన 280 కిలోమీటర్ల దూరంలో 343 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనలతో అక్కడ నివసించే వారు భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా గత ఏడాది ఇండోనేషియా ఘోరమైన విపత్తును ఎదుర్కొంది. సులావెసీ ద్వీపంలో ఏర్పడ్డ రెండు భూకంపాలు, సునామీ కారణంగా 2700మంది మృతి చెందగా, సుమారు పదివేల మందికి పైగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment