
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.
ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది.