slightly
-
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. -
కొద్దిగా చల్లబడిన రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, ముంబై: రీటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగా చల్లారింది. డిసెంబరునాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరిలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది.అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆహార, ఇంధర ధరల పెరుగుదలను దీన్ని ప్రభావితం చేసింది. మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కొలమానం, సిపిఐ ఇండెక్స్ జనవరి నెలలో 5.07 శాతానికి పెరిగింది. డిసెంబరులో 5.21 శాతం నుంచి 5.14 శాతానికి తగ్గనుందని రాయిటర్స్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇంధనం, ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.90 శాతంతో పోలిస్తే తాజాగా 7.58 శాతంగా నమోదైంది. గృహ ద్రవ్యోల్బణం గత నెలలో 8.25 శాతం నుంచి 8.33 శాతానికి పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరింది. అక్టోబరు-డిసెంబరులో 4.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ..ఫిబ్రవరి నెలలో బడ్జెట్లో ప్రకటించిన అధిక దిగుమతి పన్నుల ధరల ఒత్తిడి కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. -
జనరేటర్ రూం పాక్షిక తొలగింపు
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్) : ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యారేజికి అనుసంధానంగా ఉన్న జనరేటర్ రూమ్‌ను పాక్షికంగా తొలగించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది సోమవారం చర్చించుకున్న అనంతరం జనరేటర్ ఉన్న రూమ్‌ను తొలగించకుండా, దానికి అనుసంధానంగా ఉన్న వాటిని అన్నింటినీ తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. జనరేటర్ రూమ్ సిబ్బంది ఒక్కరోజు వ్యవధిలో తాము తొలగిస్తామన్నా, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మునిసిపల్ అధికారులు జనరేటర్ రూమ్‌కు అనుసంధానంగా ఉన్న సామాన్లు భద్రపరిచే గదులను, సిబ్బంది సేదతీరే హాల్‌ను, స్క్రాప్S రూమ్‌ను తొలగిస్తున్నారు. వీఐపీలకు కృష్ణానది ఆప్రాన్పై ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.