జనరేటర్ రూం పాక్షిక తొలగింపు
Published Mon, Aug 8 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్) : ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యారేజికి అనుసంధానంగా ఉన్న జనరేటర్ రూమ్‌ను పాక్షికంగా తొలగించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది సోమవారం చర్చించుకున్న అనంతరం జనరేటర్ ఉన్న రూమ్‌ను తొలగించకుండా, దానికి అనుసంధానంగా ఉన్న వాటిని అన్నింటినీ తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. జనరేటర్ రూమ్ సిబ్బంది ఒక్కరోజు వ్యవధిలో తాము తొలగిస్తామన్నా, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మునిసిపల్ అధికారులు జనరేటర్ రూమ్‌కు అనుసంధానంగా ఉన్న సామాన్లు భద్రపరిచే గదులను, సిబ్బంది సేదతీరే హాల్‌ను, స్క్రాప్S రూమ్‌ను తొలగిస్తున్నారు. వీఐపీలకు కృష్ణానది ఆప్రాన్‌పై ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement