Generator
-
నాడు ‘చిన్న సినిమాల శ్రీదేవి’... నేడు ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’...
ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు. సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి.. 1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది. వెబ్ సిరీస్‌లో బిజీ.. 2019లో పలు ఓటీటీ ప్లాట్ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె నటించిన ఎల్ఎల్డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా? -
కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..
కారు నడవాలంటే పెట్రోలో, డీజిలో కొట్టించాలి.. లేదంటే ఎల్పీజీ, సీఎన్జీ నింపుకోవాలి.. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ కాసిన్ని కర్ర ముక్కలను ట్యాంక్‌లో పడేసి కారు నడిపేయగలిగితే.. భలేగా ఉంటుంది కదా! ఇదేదో భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ కాదు.. ఎప్పుడో వందేళ్ల కిందటిదే. దానితో కార్లే కాదు.. బైకులు, బస్సులు కూడా నడిపేశారు. అసలు కర్ర ముక్కలతో కారు నడపడం ఏమిటి? ఎలా నడిచేవి? మరి ఇప్పుడెందుకు వాడటం లేదో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ 18వ శతాబ్దం తొలినాళ్ల నాటికే యూరప్ అంతటా పారిశ్రామికీకరణ పెరిగింది. కానీ కరెంటు వినియోగం ఇంకా విస్తృతం కాలేదు. బొగ్గు, పెట్రోల్‌తో పాటు సహజ వాయువు (సీఎన్జీ)ను వినియోగించేవారు. వీధి దీపాలకూ సీఎన్జీని వాడేవారు. వాటి ధర ఎక్కువ. కొరత కూడా. అందుకే బొగ్గు, కలప, బయోమాస్ వంటివాటిని వినియోగించి సింథటిక్ గ్యాస్ (సిన్‌గ్యాస్)ను తయారు చేసి.. పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం వినియోగించడం మొదలుపెట్టారు. అయితే 19వ శతాబ్దం మొదలయ్యే సరికి.. ఈ సాంకేతికత జనానికి అందుబాటులోకి వచ్చింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చాయి. పెట్రోల్, సీఎన్జీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానికితోడు మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావంతో పెట్రోల్, సీఎన్జీ కొరత మొదలైంది. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కార్లు, బైకులు, ఇతర వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనం అవసరమైంది. అప్పుడే ‘ఉడ్ గ్యాస్ జనరేటర్’ తెరపైకి వచ్చింది. ఏమిటీ ‘సిన్ గ్యాస్’? గాలి చొరబడకుండా మూసేసిన కంటెయినర్లలో కలప, బొగ్గును వేసి, బయటి నుంచి వేడి చేస్తారు. దీనివల్ల బొగ్గు, కలప మండిపోకుండానే.. వాటి నుంచి నైట్రోజన్, హైడ్రోజన్, మిథేన్, కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఉన్న గ్యాస్ విడుదలవుతుంది. సాధారణ వంట గ్యాస్ (ఎల్పీజీ) లాగానే ఈ గ్యాస్‌కు మండే లక్షణం ఉంటుంది. దానిని పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం, ఇళ్లలో వంట కోసం వినియోగించేవారు. 1807లోనే లండన్‌లో తొలిసారిగా ‘సిన్ గ్యాస్’ ద్వారా వీధి దీపాన్ని వెలిగించారు. అలా మొదలై 19వ శతాబ్దం మొదలయ్యే నాటికి ఈ గ్యాస్‌ను వాడకం బాగా పెరిగింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ గ్యాస్‌తోనే పరిశ్రమలు నడిచాయి. ఫ్రెంచ్ ఇంజనీర్ ఆవిష్కరణతో.. పెట్రోల్, సీఎన్జీకి బదులు సిన్‌గ్యాస్‌ను వాడొచ్చని గుర్తించిన ఫ్రెంచ్ ఇంజనీర్ జార్జెస్ ఇంబర్ట్.. 1920లో మొబైల్ ఉడ్ గ్యాస్ జనరేటర్‌ను రూపొందించారు. కర్ర ముక్కలతో సిన్ గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేశారు. అందుకే దాన్ని‘ఉడ్ గ్యాస్’గా పిలిచారు. వాహనాల ఇంజన్లో మార్పులు చేసి ‘ఉడ్ గ్యాస్’తో నడిచేలా మార్చారు. అప్పటికి పెట్రోల్, సీఎన్జీ ఉండటంతో దీనికి డిమాండ్ రాలేదు. 1930 చివరికి 9 వేల వాహనాలు ఇంబర్ట్ జనరేటర్లతో నడిచేవి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ప్రభావంతో మళ్లీ పెట్రోల్, సీఎన్జీల కొరత మొదలైంది. ధరలూ పెరగడంతో..‘ఇంబర్ట్ జనరేటర్లకు డిమాండ్ పెరిగింది. 1940–42 నాటికి ఒక్క జర్మనీలోనే 5 లక్షల వాహనాలు ‘ఉడ్ గ్యాస్’తో నడిచినట్టు అంచనా. కర్ర ముక్కల కోసం 3 వేలకుపైగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ సహా యూరప్ దేశాల్లో ‘ఉడ్ గ్యాస్’ వాడారు. ‘ఉడ్ గ్యాస్’ వాడటం ఆపేశారెందుకు? ►పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వంటివాటితో పోలిస్తే.. ఉడ్ గ్యాస్‌లో వాయువులకు మండే సామర్థ్యం తక్కువ. దాని నుంచి విడుదలయ్యే శక్తి కూడా తక్కువ. కొద్దికిలోమీటర్లు ప్రయాణించాలంటే కిలోల కొద్దీ కలప కావాల్సి వచ్చేవి. పైగా మెల్లగా వెళ్లాల్సి వచ్చేది. ►ఉడ్గ్యాస్ జనరేటర్, ఇతర పరికరాల బరువు వందల కిలోలు ఉంటుంది. జనరేటర్‌ను కార్లు, బస్సులు, ఇతర వాహనాల వెనుక అదనపు టైర్లతో అమర్చుకోవాలి, దాని నుంచి వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేసే ట్యాంకు, కూలింగ్ యూనిట్‌కు పైపులతో అమర్చాలి. నిర్ణీత దూరం తర్వాత వాహనం ఆపి.. జనరేటర్లో కర్ర ముక్కలను నింపాలి. వాహనం కూడా మెల్లగా గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి వచ్చేది. ►బైకుల కోసం చిన్న జనరేటర్లు వచ్చినా.. కొద్దిదూరమే ప్రయాణించగలిగేవారు. ►ఉడ్ గ్యాస్ వాహనాన్ని ఎప్పుడంటే అప్పుడు వెంటనే స్టార్ట్ చేయడానికి కుదరదు. జనరేటర్ వేడెక్కి తగిన స్థాయిలో గ్యాస్ వెలువడేందుకు 15 నిమిషాలైనా పడుతుంది. అప్పటిదాకా ఆగాల్సిందే. ►ఈ గ్యాస్‌లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ విషపూరిత వాయువు. అందుకే జనరేటర్ నుంచి పైపును కారు బయటిభాగం నుంచే ఇంజన్‌కు అనుసంధానించేవారు. ►రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ పె ట్రోల్, సీఎన్జీ ఇంధనాలు సులువుగా దొరకడం, ఎక్కువ మైలేజీ ఇచ్చే టెక్నాలజీలు వచ్చాయి. దీంతో ‘ఉడ్ గ్యాస్’ జనరేటర్లు మూలకుపడ్డాయి. -
పొద్దున్నే వస్తానంటివి కదా నాయనా..
► నలుగురిని మింగిన జనరేటర్ పొగ ► ప్రాణం తీసిన గాఢనిద్ర లింగసూగూరు ► ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు రాత్రి లేటైంది. అక్కడే పడుకుని పొద్దున్నే వస్తానంటివి కదా నాయనా.. అంటూ జనరేటర్ పొగతో ఊపిరాడక మృతి చెందిన నలుగురు యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో లింగసూగూరు ఆస్పత్రి దద్దరిల్లింది. చేతికి వచ్చిన కొడుకులు మలివయస్సులో తమకు అండగా ఉంటారని ఆశించిన ఆ తల్లిదండ్రులు నిచ్చేతన స్థితిలో పడి ఉన్న తమ తనయుల మృతదేహాల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. లింగసూగూరు: పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున నలుగురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కరడకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన నలుగురు యువకుల తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతులు నలుగురూ వారి తల్లిదండ్రులకు ఒక్కరే మగ సంతానం కావడం మరింత బాధాకరం. ఘటన జరిగిందిలా.. కరడకల్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు స్థానిక తపాలా కార్యాలయం ఎదుట ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లోని సెల్లార్లో ఉన్న చేతన్ సౌండ్ సర్వీస్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో విద్యుత్ సరఫరా స్తంభించింది. శుక్రవారం ఆనెహసూరు గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ యువకులు గురువారం రాత్రి అక్కడికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని 12 గంటల సమయంలో అంగడి వద్దకు చేరుకున్నారు. వారికి అంగడి యజమాని ప్రకాష్ భోజనాలు చేయించి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి కావడంతో యువకులు అంగడిలోనే నిద్రించాలనుకున్నారు. ఆరుగురిలో బసవరాజ్ అనే యువకుడు కరెంట్ లేకపోవడంతో తనకు గదిలో నిద్రరాదని, తాను బయటే పడుకుంటానని చెప్పి అంగడి బయట మెట్లపై నిద్రించాడు. మిగతా ఐదుగురు అంగడిలో పడుకొని అక్కడే ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసుకుని ఫ్యాన్ వేసుకుని నిద్రించారు. కొంతసేపటి తర్వాత జనరేటర్ శబ్దానికి నిద్ర రావడం లేదని మెట్లపై పడుకొన్న బసవరాజ్ జనరేటర్‌ను ఆఫ్ చేస్తుండటంతో లోపల పడుకొన్న ఓ యువకుడు జనరేటర్‌ను లోపలకు పెట్టుకుని షటర్ వేసుకున్నాడు. దీంతో జనరేటర్ నుంచి వెలువడే పొగ బయటకు వెళ్లే మార్గం లేక గదిలోనే నిండిపోయింది. గాఢనిద్రలో ఉన్న యువకులు ఊపిరాడక మృతిచెందారు. ఉదయాన్నే సంస్థ నిర్వాహకుడు ప్రకాష్ యువకులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పక్కనే మెట్ల వద్ద నిద్రించిన బసవరాజ్‌ను లేపడంతో ఇద్దరు కలిసి లోపలి వారిని లేపేందుకు ప్రయత్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో షట్టర్‌ను పైకెత్తి చూడగా, లోపల ఉన్న ఐదుగురూ ఎంతకీ లేవకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నలుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. వారిలో విషమంగా ఉన్న సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం బాగలకోటె ఆస్పత్రికి తరలించారు. -
జనరేటర్ రూం పాక్షిక తొలగింపు
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్) : ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యారేజికి అనుసంధానంగా ఉన్న జనరేటర్ రూమ్‌ను పాక్షికంగా తొలగించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది సోమవారం చర్చించుకున్న అనంతరం జనరేటర్ ఉన్న రూమ్‌ను తొలగించకుండా, దానికి అనుసంధానంగా ఉన్న వాటిని అన్నింటినీ తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. జనరేటర్ రూమ్ సిబ్బంది ఒక్కరోజు వ్యవధిలో తాము తొలగిస్తామన్నా, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మునిసిపల్ అధికారులు జనరేటర్ రూమ్‌కు అనుసంధానంగా ఉన్న సామాన్లు భద్రపరిచే గదులను, సిబ్బంది సేదతీరే హాల్‌ను, స్క్రాప్S రూమ్‌ను తొలగిస్తున్నారు. వీఐపీలకు కృష్ణానది ఆప్రాన్పై ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. -
ఆరు జనరేటర్లతో కొనసాగుతున్న విద్యుదుత్పాదన
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో మొత్తం ఆరు జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5 జనరేటర్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్‌తో విద్యుత్ ఉత్పాదన చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు 28,319 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 47.5230 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 828 అడుగులకు చేరుకుంది. -
గాలి నుండి నీరు!
సమ్‌థింగ్ స్పెషల్ ఎండాకాలం వచ్చిందంటే ఒక్క బిందె నీటి కోసం మహిళలు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పేద ప్రజలకు వేసవి కాలంలో ఇదో తప్పని అగ్నిపరీక్ష. అయితే ఈ ఏడాది మాత్రం ఆ కష్టం ఉండబోదంటే నమ్ముతారా? నమ్మాలి మరి. ఎందుకంటే మన ఇంటికి కావలసిన నీటిని మనమే తయారు చేసుకోవచ్చు. డ్రైనేజీ వాటర్తోనో, లేక ఇతర వాటర్ ఫిల్టర్లతోనో కాదు ఎయిర్ వాటర్ జనరేటర్‌తో! దేశంలోనే మొదటిసారిగా గాలిలోని తేమతో నీటిని తయారుచేసే యంత్రాన్ని తయారు చేశారు ఐఐటీ ఇంజనీర్ అయిన అనిత్ అస్తాన. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఎలక్ట్రో వాటర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘‘థానేలోని ఓ ప్రాంతంలో నీటికోసం కిలోమీటర్లు నడిచి వేసవి వేడికి తాళలేక వడదెబ్బ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని దాహార్తిని తీర్చేందుకు సరైన ప్రత్యామ్నాయం ఉండాలన్న ఆలోచనతోనే ఈ యంత్రాన్ని రూపొందించా. దేశంలోని అన్ని రకాల ప్రాంతాల్లోనూ ఈ యంత్రాన్ని పరీక్షించాం. ఈ సరికొత్త నీటి తయారీ యంత్రం ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానుంది. మొదటి దఫాలో 15000 యూనిట్లు అమ్మాలని నిర్ణయించాం. గాలిలోని తేమను బట్టి రోజుకి 9 నుంచి 30 లీటర్ల వరకు ఈ జనరేటర్లు నీటిని ఉత్పత్తి చేస్తాయి. రెండు రకాల మోడళ్లతో ఈ వాటర్ జనరేటర్ మార్కెట్లోకి వస్తోంది’’ అని అనిత్ అస్తాన తెలిపారు. ఇండియాలో ఎయిర్ వాటర్ జనరేటర్ కొత్తదే అయినా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌తో పాటు మరి కొన్ని దేశాల్లో ఇప్పటికే గాలిలోని తేమతో నీటిని తయారుచేసే యంత్రాలను వినియోగిస్తున్నారు. అయితే ఆ యంత్రాలన్నీ గాలిలో తేమ 50 నుంచి 60 శాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. భౌగోళిక వైవిధ్యం ఉన్న ఇండియా లాంటి దేశాల్లో గాలిలోని తేమ అన్ని చోట్లా ఒకేలా ఉండదు. అందుకే రాజస్థాన్ నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు రాష్ట్రాలన్నింటిలోనూ అతి తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో ఈ ఎయిర్ వాటర్ జనరేటర్‌ను పరీక్షించారు. నిపుణుల పరీక్షలన్నీ పూర్తయ్యాక తుది మెరుగులు దిద్దుకుని అందుబాటు ధరలో అతి తొంద ర్లోనే ఎయిర్ వాటర్ జనరేటర్ మార్కెట్లోకి రానుంది. - శ్రావణ్‌జయ -
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు.. రూ. లక్షలు విలువ చేసే జనరేటర్‌తో పాటు ఏసీని మాయం చేశారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్మన్‌ను కోరుతున్నారు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో చైర్మన్ తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని గురువయ్యతోటలో నివాసం ఉంటున్న శివనాగప్రసాదరెడ్డి ఇంటిపై (26/284-25) రిలయన్స్ సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008లో ఇందుకు సంబంధించి రిజిష్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అప్పట్లో చుట్టుపక్కల వారు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనుమతి లేకుండా ఎలా టవర్ నిర్మిస్తారని మున్సిపల్ అధికారులు టవర్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్తోపాటు ఎయిర్ కండీషన్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అంచనా. అప్పటి నుంచి ఇవి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే ఉండేవి. అప్పటి కౌన్సిలర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, ప్రస్తుత కౌన్సిలర్ మార్కాపురం గణేష్‌బాబు వీటిని క్రేన్ సహాయంతో మున్సిపల్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. కొత్తగా పాలకవర్గం ఏర్పాటు కావడంతో తన సమస్యను శివనాగప్రసాదరెడ్డి సతీమణి రాజేశ్వరి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల ద్వారా విన్నవించారు. శివనాగప్రసాదరెడ్డి తనకు సహచరుడు కావడంతో 32వ వార్డు కౌన్సిలర్ కోనేటి సునంద భర్త భాస్కర్‌రెడ్డి కొద్ది రోజుల కిందట మున్సిపల్ అధికారులను కలిసి జనరేటర్, ఏసీ మిషన్లను అప్పగించాలని కోరారు. అందుకు సంబంధించిన పత్రాలు వెతికి అప్పజెప్పుతామని టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లోని నాగేంద్ర తెలిపారు. ఈ విషయంపై ఈనెల 2వ తేదీన రాజేశ్వరి మున్సిపల్ చైర్మన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను నాన్చుతుండటంతో భాస్కర్‌రెడ్డి స్వయంగా చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కార్యాలయ ఆవరణంలో ఉన్న జనరేటర్, ఏసీ మిషన్లు కన్పించడంలేదని సిబ్బంది చైర్మన్‌కు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా చైర్మన్‌కు విన్నవించారు. నేడో రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని వివరణ కోరగా జనరేటర్, ఏసీ మిషన్లు కనిపించని మాట వాస్తవమేనన్నారు. -
తీరంలో హైఅలెర్ట్
అచ్యుతాపురం : హుదూద్ తుపాను పట్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ సూచించారు. శుక్రవారం పూడిమడకను సంద ర్శించారు. మత్స్యకారులు, గ్రామనాయకులు, అధికారులతో చర్చించారు. శనివారం తీరప్రాంత ప్రజల్ని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైస్కూల్, తుపాను షెల్టర్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. వాటిల్లో తాగునీరు, విద్యుత్, జనరేటర్, భోజన సౌకర్యాలను ఏర్పాటుచేయాలన్నారు. విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 30వేల మంది తీరప్రాంత ప్రజల్ని 40 పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. తుపాను తీవ్రత జిల్లాకు ఎక్కువగా ఉన్నందున తీరప్రాంతంలో హైఅలెర్ట్‌ను ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశామన్నారు. పలుమార్లు దండోరావేసి మత్స్యకారులను అప్రమత్తంచేయాలని సూచించారు. గంటకు150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. పూరిగుడెసెలు, శిథిల భవనాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. ఒక్కరోజులో 24సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. పడవలు, వేటసామగ్రిని భద్రపరుచుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ, ఎస్ఐ సన్యాసినాయుడు ఉన్నారు. -
విద్యుదుత్పత్తికి అంతరాయం
ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరో నంబర్ జనరేటర్లో సాంకేతిక లోపంతో 23 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇక్కడ 74 మెగావాట్లకు విద్యుదుత్పత్తి పడిపోయింది. ఇక్కడి ఆరు జనరేటర్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. అయిదో నంబర్ జనరేటర్ ఆరు నెలల క్రితం మూలకు చేరింది. నాటి నుంచి 1,2,3,4,6 నంబర్ల జనరేటర్లతో 97 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరో నంబర్ జనరేటర్‌కు సంబంధించిన గవర్నర్‌లో సాంకేతిక లోపం తలేత్తడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనిని వినియోగంలోకి తేవడానికి సిబ్బంది ఆది, సోమవారాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం 1,2,3,4 నంబర్ల జనరేటర్లతో 74 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. -
సమాచార వ్యవస్థపై మావోల పంజా
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: సమాచార వ్యవస్థపై మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కంపెనీ సెల్ టవర్ క్యాబిన్, జనరేటర్, ఏసీ రూంలను దగ్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లిలో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్టెల్ కంపెనీ వారు సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ టవరకు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మావోయిస్టులు నిప్పంటించారు. మావోయిస్టు వెంకటాపురం ఏరియా కార్యదర్శి రాజు, శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్, దుమ్ముగూడెం ఇన్చార్జ్ సంతు ఆదేశాల మేరకు 10 మంది మిలీషియా సభ్యులు సైకిళ్లపై ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి మండలంలోని కొమ్మనాపల్లి మీదుగా కొత్తపల్లి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న వరిగడి, తాటాకులను ఉపయోగించి పెట్రోల్ సహాయంతో సెల్ టవర్ క్యాబిన్, ఏసీ రూం, జనరేటర్లకు నిప్పంటించారు. ఈ సమయంలో కొంత మంది మిలీషియా సభ్యులు రహదారికి ఇరువైపులా కాపలా ఉండగా మిగిలిన సభ్యులు పని పూర్తి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వారు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లినట్లు తెలిసింది. సంఘటన జరిగిన సమయంలో టవర్ సెక్యూరిటీ గార్డు, ఆపరేటర్ ఆ ప్రాంతంలో లేనట్లు తెలిసింది. బుధవారం ఉదయం సెక్యూరిటీ గార్డు కనుగట్టు శ్రీనివాస్ ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 28లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లో చినబండిరేవులోని బీఎస్ఎన్ఎల్ టవర్‌ను, 2014 ఫిబ్రవరిలో ఆర్లగూడెంలో ఎయిర్టెల్ టవర్‌ను దగ్ధం చేసి సమాచార వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు మావోయిస్టులు యత్నించిన విషయం విదితమే. సంఘటన స్థలంలో పోస్టర్లు... అనంతరం మావోయిస్టులు సంఘటన స్థలంలో మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ, శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వదిలి వెళ్లారు. ఆదివాసీ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే ఆదివాసీ యువకులకు పోలీసులు డబ్బు ఆశ చూపి ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ ఏరియాలో మావోయిస్టులను అణచివేసేందుకు పోలీసులు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రంగనాథ్, కొత్తగూడెం ఓఎస్డీలు ఆదివాసీలపై కేసులు బనాయించడంతో పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థను నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ విరమించుకోకపోతే తర్వాత వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను బుధవారం ఉదయమే పోలీసులు తొలగించారు. -
బొట్టు.. దొరికితే ఒట్టు !
భానుడి వేడి ముదరకముందే నల్లమలలో నీటిసమస్య జఠిలమవుతోంది.. మారుమూల గ్రామాల జనం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. కడివెడు నీటికోసం కోటికష్టాలు పడుతున్నారు. చెలిమ నీటికోసం క్యూ కడుతున్నారు. ప్రధాన తాగునీటి పథకాలేవీ గ్రామీణుల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. ఎప్పుడొస్తదో..ఎప్పుడుపోతదో తెలియని కరెంట్‌తో ట్యాంకులు నిండటం లేదు. మరమ్మతులకు నోచుకోని చేతిపంపుల వైపు కన్నెత్తిచూసేవారు లేరు. ఆర్డ బ్ల్యూఎస్లో నిధులు పుష్కలంగా ఉన్నా..అధికారులు శాశ్వతచర్యలు చేపట్టలేకపోతున్నారు.. ఈ పరిస్థితుల్లో ఓటు కోసం వచ్చేవారిని నిలదీసేందుకు పల్లెజనం సిద్ధమవుతున్నారు. అతీగతి లేదు. తె ల్కపల్లి మండలం గౌరెడ్డిపల్లి వద్ద సంపు నిర్మాణం, లింగాల మండలం రాంపూర్ గేట్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకును ని ర్మించినా నిరుపయోగంగానే మారింది.గట్టుతుమ్మెన్ సంపు నుంచి చెన్నారం మీదుగా బల్మూ ర్, కొండనాగుల వరకు పైపులైన్ వేయాల్సి ఉండగా, పనులు మొదలుకాలేదు. ఇందుకోసం రూ.కోటి నిధులతో రామన్పా డు, గట్టుతుమ్మెన్ సంపు వద్ద రెండు మోటార్లను ఏర్పాటు చే శా రు. రాంపూర్ ట్యాంకు నుంచి లింగాల, కోమటికుంటలకు పై పులైన్ వేసేందుకు వరల్డ్‌బ్యాంకు నుంచి రూ.1.50కోట్లు, గట్టుతుమ్మన్ సంప్‌హౌస్ వద్ద జనరేటర్‌ను అమర్చడం కోసం రూ. 50లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఉప్పునుంతల మండలంలోని ఈరట్వానిపల్లిలో కిలోమీటర్ దూరంలో ఉన్న చేతిపంపు నీరే ఆధారం. ఇటీవల అక్కడ బోరువేసినా మోటారు, పైప్‌లైన్‌ను అమర్చలేదు. లింగాల మండలం ధారారం, పాత ధారారం, కొత్తచెర్వుతండా, క్యాంపు రాయవరం, రాంపూర్, దత్తారం గ్రామాల్లో వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి వెతలు తీవ్రరూపం దాల్చుతాయి. అమ్రాబాద్ మండలం పదర గ్రామంలో ట్యాంకులకు నీళ్లందించే బావిలో నీళ్లు అడుగంటిపోవడంతో స్థానికులు కిలోమీటరు దూరంలో ఉన్న పెద్దమ్మగుడి వద్ద ఉన్న చేతిపంపు వద్దకు వెళ్లి మోసుకొస్తున్నారు. తిర్మలాపూర్(బీకే)ఎస్సీ కాలనీ, చిట్లంకుంట బీసీ కాలనీల్లో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లితండా, రంగాపూర్, కోనాపూర్‌లో, చారకొండ బీసీ కాలనీలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్‌తో పాటు రుద్రారం, టేకుల్‌కోడ్, టేకుల్‌కోడ్ తండా, ధర్మాపూర్ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అంగడిరాయిచూర్ పంచాయతీ అనుబంధ గ్రామం ధర్మాపూర్‌లో అక్కడి ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమల్లో ఊరిన నీటితోనే పూట గడుపుతున్నారు. మహిళలు, పిల్లలు, పురుషులు సైతం తెల్లవారుజాము నుంచే బిందెలు తీసుకుని చెలిమల దారి పడుతున్నారు. ఎవరు ముందు వెళితే వారికే నీరు దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా..పట్టించుకునేవారు లేదు. వేసవికాలంలో ఆ చెలిమి ఎండిపోతే స్థానికుల నీటికష్టాలు వర్ణణాతీతం.ఈ నేపథ్యంలో గ్రామ యువకులకు అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. అలాగే టేకుల్‌కోడ్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. సుమారు రెండువేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో కేవలం రెండు చేతిపంపులు, ఒక చేదురురు బావి మాత్రమే ఆధారం. గతంతో నిర్మించిన ఓవర్‌హెడ్ వృథాగా ఉంది. -
గ్యాస్ కోసం పడిగాపులు
కావలిఅర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక జెండాచెట్టు సమీపంలో ఉన్న శ్రీభవాని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు దీరారు. గ్యాస్ కోసం వచ్చిన వృద్ధులు, చంటి బిడ్డలను తీసుకు వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ కోసం ఉదయం ఏజెన్సీ వద్దకు వచ్చిన వినియోగదారులు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఏజెన్సీలో విద్యుత్ లేని కారణంగా కంప్యూటర్లు పని చేయకపోవడంతో సిలిండర్లను పంపిణీకి అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన సిలిండర్ల పంపిణీ సాయంత్రం వరకు సాగింది.