బొట్టు.. దొరికితే ఒట్టు ! | Blob .. If you scum! | Sakshi
Sakshi News home page

బొట్టు.. దొరికితే ఒట్టు !

Published Tue, Apr 1 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

బొట్టు..  దొరికితే ఒట్టు !

బొట్టు.. దొరికితే ఒట్టు !

భానుడి వేడి ముదరకముందే నల్లమలలో నీటిసమస్య జఠిలమవుతోంది.. మారుమూల గ్రామాల జనం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. కడివెడు నీటికోసం కోటికష్టాలు పడుతున్నారు. చెలిమ నీటికోసం క్యూ కడుతున్నారు. ప్రధాన తాగునీటి పథకాలేవీ గ్రామీణుల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. ఎప్పుడొస్తదో..ఎప్పుడుపోతదో తెలియని కరెంట్‌తో ట్యాంకులు నిండటం లేదు. మరమ్మతులకు నోచుకోని చేతిపంపుల వైపు కన్నెత్తిచూసేవారు లేరు. ఆర్‌డ బ్ల్యూఎస్‌లో నిధులు పుష్కలంగా ఉన్నా..అధికారులు శాశ్వతచర్యలు చేపట్టలేకపోతున్నారు.. ఈ పరిస్థితుల్లో ఓటు కోసం వచ్చేవారిని నిలదీసేందుకు పల్లెజనం సిద్ధమవుతున్నారు.
 
 అతీగతి లేదు. తె ల్కపల్లి మండలం గౌరెడ్డిపల్లి వద్ద సంపు నిర్మాణం, లింగాల మండలం రాంపూర్ గేట్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకును ని ర్మించినా నిరుపయోగంగానే మారింది.గట్టుతుమ్మెన్ సంపు నుంచి చెన్నారం మీదుగా బల్మూ ర్, కొండనాగుల వరకు పైపులైన్ వేయాల్సి ఉండగా, పనులు మొదలుకాలేదు. ఇందుకోసం రూ.కోటి నిధులతో రామన్‌పా డు, గట్టుతుమ్మెన్ సంపు వద్ద రెండు మోటార్లను ఏర్పాటు చే శా రు. రాంపూర్ ట్యాంకు నుంచి లింగాల, కోమటికుంటలకు పై పులైన్ వేసేందుకు వరల్డ్‌బ్యాంకు నుంచి రూ.1.50కోట్లు, గట్టుతుమ్మన్ సంప్‌హౌస్ వద్ద జనరేటర్‌ను అమర్చడం కోసం రూ. 50లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.
 
ఉప్పునుంతల మండలంలోని ఈరట్వానిపల్లిలో కిలోమీటర్ దూరంలో ఉన్న చేతిపంపు నీరే ఆధారం. ఇటీవల అక్కడ బోరువేసినా మోటారు, పైప్‌లైన్‌ను అమర్చలేదు. లింగాల  మండలం ధారారం, పాత ధారారం, కొత్తచెర్వుతండా, క్యాంపు రాయవరం, రాంపూర్, దత్తారం గ్రామాల్లో వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి వెతలు తీవ్రరూపం దాల్చుతాయి.
 
అమ్రాబాద్ మండలం పదర గ్రామంలో ట్యాంకులకు నీళ్లందించే బావిలో నీళ్లు అడుగంటిపోవడంతో స్థానికులు కిలోమీటరు దూరంలో ఉన్న పెద్దమ్మగుడి వద్ద ఉన్న చేతిపంపు వద్దకు వెళ్లి మోసుకొస్తున్నారు. తిర్మలాపూర్(బీకే)ఎస్సీ కాలనీ, చిట్లంకుంట బీసీ కాలనీల్లో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లితండా, రంగాపూర్, కోనాపూర్‌లో, చారకొండ బీసీ కాలనీలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది.

  నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్‌తో పాటు రుద్రారం, టేకుల్‌కోడ్, టేకుల్‌కోడ్ తండా, ధర్మాపూర్ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అంగడిరాయిచూర్  పంచాయతీ అనుబంధ గ్రామం ధర్మాపూర్‌లో అక్కడి ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమల్లో ఊరిన నీటితోనే పూట గడుపుతున్నారు. మహిళలు, పిల్లలు, పురుషులు సైతం తెల్లవారుజాము నుంచే బిందెలు తీసుకుని చెలిమల దారి పడుతున్నారు. ఎవరు ముందు వెళితే వారికే నీరు దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా..పట్టించుకునేవారు లేదు. వేసవికాలంలో ఆ చెలిమి ఎండిపోతే స్థానికుల నీటికష్టాలు వర్ణణాతీతం.ఈ నేపథ్యంలో గ్రామ యువకులకు అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. అలాగే టేకుల్‌కోడ్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. సుమారు రెండువేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో కేవలం రెండు చేతిపంపులు, ఒక చేదురురు బావి మాత్రమే ఆధారం. గతంతో నిర్మించిన ఓవర్‌హెడ్ వృథాగా ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement