ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు.
సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది.
మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి..
1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..
భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది.
వెబ్ సిరీస్‌లో బిజీ..
2019లో పలు ఓటీటీ ప్లాట్‌ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్‌ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్‌ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్‌గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఆమె నటించిన ఎల్‌ఎల్‌డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు.
ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా?
Comments
Please login to add a commentAdd a comment