Top Stories
ప్రధాన వార్తలు
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాతి్మక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేశారు. క్యూ లైన్లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్ ఇమేజ్ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్: తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్ దగ్గర సింగిల్ లైన్ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్ వద్ద ఒకే వ్యక్తి టోకెన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్ విచారం సాక్షి, హైదరాబాద్: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే..8వ తేదీ బుధవారం ఉ.5 గంటలకు..⇒ తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభం⇒ ఉ.7.30కు 60 శాతం భక్తులతో నిండిన క్యూలైన్లు⇒ ఉ.8.30కు క్యూలైన్ల వద్దకు చేరుకున్న పోలీసులు⇒ ఉ.9.30కు పూర్తిస్థాయిలో క్యూలైన్లు నిండి ప్రవేశద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన భక్తులు⇒ ఉ.10.30కు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు.⇒ ఉ.11.30కు భక్తులు టాయిలెట్స్ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు.⇒ మ.12.30కు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేరుకున్న భక్తులు⇒ మ.1.30కు భక్తుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది.⇒ మ.2.30 అవుతున్నా కౌంటర్ కేంద్రాల వద్ద భక్తులను అప్రమత్తం చేయని అధికారులు⇒ మ.3.30కు క్యూలైన్లో వేచి ఉండలేక.. టికెట్లు ఎప్పుడిస్తారంటూ భక్తుల నిలదీత.. ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు⇒ సా.4.30కు శ్రీనివాసం, బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్స్ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటన⇒ సా.5.30కు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్ వద్దకు చేరిక.⇒ సా.6.30కు కౌంటర్ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండడంతో టోకెట్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం.⇒ రాత్రి 7.30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళా క్యూలైన్లో కిందపడిపోయింది.⇒ రాత్రి 7.45కు కిందపడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.⇒ రాత్రి 8 గంటలకు మరో పదిమందిæ భక్తులు కింది పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా, స్విమ్స్ అస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు.⇒ రాత్రి 8.30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆస్పత్రికి వెళ్లే మార్గంమధ్యలోనే మృతిచెందింది. అదే సమయంలో బైరాగిపట్టిడి రామానాయుడు స్కూల్ వద్ద తోపులాటలో 40 మంది కిందపడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.⇒ రాత్రి 9.10కు కిందిపడిపోయిన భక్తులను రుయా అస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గుర్తించారు.⇒ 9.20కు అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్ల జారీని కొనసాగించే పనిలో పడ్డారు.
తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఒకే ఒరలో రెండు కత్తులు!
అమెరికా రిపబ్లికన్ పార్టీలో టెక్ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్ ప్రపంచాన్ని జయించాలని టెక్ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్ దగ్గర టెక్ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్ రోజు అమెరికా సోషల్ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను డోనాల్డ్ ట్రంప్ తన ఏఐ–పాలసీ సీనియర్ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్ ట్రోలింగ్ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్’ ఉద్యమానికి ట్రంప్ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్ కృష్ణన్ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్ సిద్ధాంతం. హెచ్–1బి వీసా విధానానికి మస్క్ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్ టీమ్ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్ పొసొబిక్ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ రంగంలోకి దిగాడు. హెచ్–1బి వీసాలు పెద్ద స్కామ్ అనీ, వాటిని సమర్థించి మస్క్ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఒక ఉదాహరణ. పీటర్ థియల్ అనే మితవాద టెక్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్ హెచ్–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత టెక్ రైట్–నేషనలిస్ట్ రైట్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్–డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్ క్యాబినెట్లో చోటు లభించనుంది.ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్ వ్యాసకర్త సీనియర్ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్’ సౌజన్యంతో)
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.
జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు...ప్రతీ ఇంటికీ వెళ్లి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం.జగనే కరెక్ట్ అంటున్నారు..బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రతీనెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతీనెలా ఏదో పథకం వచ్చేది. ఐదేళ్ల పాటు షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. బాబు బాదుడు..కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. మనం చెప్పినవి చేసి చూపించాం. అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. అధికారం కోసం ఏ గడ్డైనా మనం తినలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేల మీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదు. మనం ప్రతీ మూడు నెలలకూ విద్యా దీవెన కింద డబ్బులు చెల్లించాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కానీ, ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగమే..రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతీ గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి. కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి.నెలఖారు నుంచి ప్రజలతోనే..నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతీ వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతీ రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.సోషల్ మీడియా వినియోగించుకోవాలి..గ్రామస్థాయిలో ఉన్న ప్రతీ కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. చంద్రబాబుని నిలదీసే కార్యక్రమం చేయాలి. దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు కట్ అయిపోయాయి. ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.
రేవంత్ ఒక లొట్టపీసు సీఎం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై పెట్టిన కేసు లొట్టపీసు (డొల్ల) అని, రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన తాను రేవంత్ సర్కారు పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయం నాటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరుల త్యాగాలతో పోలిస్తే తాను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘నాపై పెట్టిన కేసును రేవంత్ తీర్చుకుంటున్న ప్రతీకారమని ప్రజలు అనుకుంటున్నారు. తమ భూముల కోసం లగచర్ల గిరిజనులు 40 రోజులపాటు జైలులో గడిపిన దానితో పోలిస్తే నేను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదు. అక్రమ కేసులపై చట్ట ప్రకారం పోరాడుతా. కేసుల గురించి ఆలోచించకుండా రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ మోసగిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలి. కొత్త సంవత్సరంలో తెలంగాణ కోసం కలిసి నడుస్తూ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఏడాది కాలంలో పార్టీకి కొత్త కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి’అని కేటీఆర్ వెల్లడించారు.కేటీఆర్‌కు ఆపద వస్తే అండగా నిలుస్తాం: మాజీమంత్రి హరీశ్రావుప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో రోజురోజుకూ రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుండటంతో అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచిన తరహాలో కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు. రేవంత్ ఏడాది పాలన కోతలు, ఎగవేతలు, కేసులు అన్నట్టుగా తయారైందన్నారు. రేవంత్ ప్రభుత్వం హామీలు ఎగవేస్తున్న తీరును ప్రశ్నించిన తనపై మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. లగచర్ల, అల్లు అర్జున్, టీఎస్ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ రాజముద్ర మార్పు వంటి దృష్టి మళ్లింపు కార్యక్రమాలు మినహా ప్రభుత్వం ఏడాదిలో చేసిందేమీ లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బు లు లేవని చెబుతున్న సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల భూముల కోసం కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రహదారిని వేసుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం రాగా, కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించారు.
హెచ్ఐఎల్తో ఆర్థిక స్థిరత్వం
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని... దీని వల్ల యువ ఆటగాళ్లు హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మక్కువ చూపుతారని భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా అభిప్రాయపడింది. ఈ నెల 12 నుంచి 26 వరకు మహిళల కోసం తొలిసారి హెచ్ఐఎల్ నిర్వహిస్తుండగా... దీని వల్ల ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని సవిత ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సవిత... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించింది.కెరీర్ విశేషాలు, భవిష్యత్తు లక్ష్యాలు, దేశంలో హాకీ భవిష్యత్తుపై సవిత తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రతి ప్లేయర్‌కు ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. హాకీ ఇండియా లీగ్ వల్ల అది సాధ్యమవుతుంది. క్రీడా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కూడా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి వస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అదే జూనియర్ స్థాయిలో ఆడేవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్లకు హెచ్ఐఎల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. » ఆర్థిక ఇబ్బందులు లేననప్పుడే ప్లేయర్లు తమ లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. సీనియర్ ప్లేయర్‌గా జూనియర్లకు ఎప్పుడూ లక్ష్యాన్ని వదలొద్దనే చెబుతా. హాకీ అనే కాదు ఏ క్రీడలోనైనా అంతే. » హాకీని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటే గతంలో తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కనీసం వాళ్లు సంతోషిస్తారు. పిల్లలు మంచి ప్రదర్శన చేస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అయితే వస్తుంది. » 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా. అప్పటి వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించను. నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కాదనలేదు. పెళ్లి తర్వాత భర్త కూడా నన్ను అర్థం చేసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది. » ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలపైనే ప్రధానంగా దృష్టి పెట్టా. ఆటను ఆస్వాదిస్తున్నా. » మహిళల హాకీలో హెచ్ఐఎల్ పెను మార్పులు తీసుకువస్తుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు దక్కడం ఖాయం. ఎందరో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. వారి అనుభవాల నుంచి భారత యువ క్రీడాకారిణులు పాఠాలు నేర్చుకుంటారు. » భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా నా బాధ్యతలేంటో తెలుసు. యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంతో పాటు... గోల్ కీపర్‌గా ఆటను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జపోరిఝియా ప్రాంతంలోని పట్టణంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ దాడిలో 13 మంది ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయాలపాలయ్యారని రీజనల్ గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలిపారు. రక్తమోడుతున్న పౌరులను నగర వీధిలో రోడ్డుపైనే ప్రథమ చికిత్సనందిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన టెలిగ్రామ్ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘కేవలం సాధారణ పౌరులున్న సిటీపై దాడి చేస్తే అమాయకులు చనిపోతారని తెలిసీ రష్యా దారుణాలకు ఒడిగడుతోంది’’అని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా తరచూ రష్యా గగనతల దాడులతో ఉక్రేనియన్ల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లో అతిపెద్ద సంక్షోభంగా మారిన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు.
న్యాయవాది వెళ్లొచ్చు.. అయితే ఎలాంటి జోక్యం చేసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఏసీబీ విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం పాక్షికంగా అనుమతించింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచందర్‌రావు విచారణకు వెళ్లవచ్చని, కానీ కేటీఆర్ పక్కన కూర్చోవద్దని పేర్కొంది. పక్కనే ఉన్న మరో గదిలో నుంచి న్యాయవాది వీక్షించవచ్చని స్పష్టం చేసింది. పిటిషనర్ (కేటీఆర్)కు తన న్యాయవాది కనిపించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఏసీబీ అధికారుల దర్యాప్తును ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరగా.. దీనికి న్యాయస్థానం నిరాకరించింది. తనతోపాటు న్యాయవాదిని కూర్చోనివ్వాలంటూ.. గురువారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో... దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనతోపాటు కూర్చొనేందుకు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోహన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న తాను విచారణకు హాజరయ్యేందుకు వెళ్లగా.. వెంట న్యాయవాదిని అనుమతించలేదని వివరించారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యాహ్నం 2.15 సమయంలో విచారణ చేపట్టారు. న్యాయవాదిని అనుమతించేందుకు సర్కార్‌కు ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డిని అడిగారు. వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ విచారణను సాయంత్రం 4.15కు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి విచారణ చేపట్టారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని, విచారించే సమయంలో ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. న్యాయవాది లైబ్రరీ గది నుంచి వీక్షించొచ్చు.. వాదనలు విన్న న్యాయమూర్తి.. అత్యంత క్లిష్టమైన క్రిమినల్ నేరాల విచారణలో మాత్రమే ఆడియా, వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొన్నారు. అయితే న్యాయవాదిని అనుమతించవద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. విచారణలో జోక్యం చేసుకోనప్పుడు న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో పిటిషనర్ (కేటీఆర్), దర్యాప్తు అధికారి మాత్రమే గదిలో ఉండాలని స్పష్టం చేశారు. విచారించే సమయంలో న్యాయవాదికి కనబడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఏసీబీ ఆఫీస్ దర్యాప్తు గదిని ఆనుకుని ఉన్న లైబ్రరీ గది కిటికీ నుంచి విచారణను వీక్షించే వీలు ఉందని ఏఏజీ వివరించారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. ఆ లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చొని కిటికీలోంచి వీక్షించవచ్చని తెలిపారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు పిటిషనర్ వెంట విచారణకు ఎవరు హాజరవుతారో ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా పిటిషనర్ (కేటీఆర్) ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వగా.. అందులో రామచందర్‌రావు ఏసీబీ ఆఫీసులోకి వెళ్లవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే సదరు న్యాయవాది ఆ విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ సమయంలో విచారణాధికారులు వ్యవహరించే తీరును బట్టి మళ్లీ హైకోర్టుకు రావచ్చని తెలిపారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.
శాకాహారానికే జై!
రైతుల సేవలో కేవీకే
కేఎఫ్ బీర్లు బంద్
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు నిరాకరణ
వృద్ధుడైనా వణకలేదు!
రేవంత్ ఒక లొట్టపీసు సీఎం
మంచు పులులు
త్వరలో ‘సౌర’ టెండర్ల ఖరారు!
తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు
తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
శాకాహారానికే జై!
రైతుల సేవలో కేవీకే
కేఎఫ్ బీర్లు బంద్
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు నిరాకరణ
వృద్ధుడైనా వణకలేదు!
రేవంత్ ఒక లొట్టపీసు సీఎం
మంచు పులులు
త్వరలో ‘సౌర’ టెండర్ల ఖరారు!
తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు
తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
సినిమా
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
ఓటీటీకి వచ్చేస్తోన్న ప్రధాని మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విక్రాంత్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఐఏఎస్‌గా ఎదిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల విక్రాంత్ మాస్సే నటించిన చిత్రం సబర్మతి రిపోర్ట్. బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు.జీ5లో స్ట్రీమింగ్..తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 10న నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్న తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు.సబర్మతి రిపోర్ట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఈ చిత్రాన్ని మన ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పన్ను రహితంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.సిబ్బందితో పాటు హాజరయ్యారు.రిటైర్మెంట్ అంటూ రూమర్స్..అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత విక్రాంత్ మాస్సే నటనకు విరామం ప్రకటించారని వార్తలొచ్చాయి. కానీ కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన కొందరు పర్మినెంట్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పారని కథనాలు రాసుకొచ్చారు. ఆ తర్వాత దీనిపై విక్రాంత్ మాస్సే క్లారిటీ కూడా ఇచ్చారు.తన కుమారుడు వర్దన్‌తో సహా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రొమాంటిక్ కామెడీ చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్లో షానాయ కపూర్ సరసన కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. విక్రాంత్ మాస్సే సినీ కెరీర్..బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. The nation’s biggest cover-up unravels, revealing the truth—only on #ZEE5. 📰Watch #TheSabarmatiReport premiering on 10th Jan, only on #ZEE5!#TheSabarmatiReportOnZEE5@VikrantMassey #RaashiiKhanna @iRidhiDogra @balajimotionpic @VikirFilms @ZeeMusicCompany @ZeeStudios… pic.twitter.com/4QggdFUSDT— ZEE5 (@ZEE5India) January 8, 2025
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
సోషల్‌మీడియా వేదికగా మలయాళ నటి హనీరోజ్‌ను (Honey Rose) ఇబ్బందులకు గురిచేసిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కొంత కాలంగా ఒక వ్యాపారవేత్త ఇబ్బంది పెడుతున్నాడని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తి వివరాలను తాజాగా పోలీసులు ప్రకటించారు.హనీరోజ్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ( Boby Chemmanur) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు. అతనిని అరెస్ట్ చేయడం తనకెంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) వద్దకు తీసుకెళ్లానని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మాట ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు)ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. కానీ, తనపై ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తానని ఆమె పేర్కొన్నారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్ కూడా తీసుకుంటానన్నారు. తనపై వచ్చిన కొన్ని మీమ్స్ కూడా సరదాగేనే ఉంటాయని అన్నారు. ఇలాంటివి తనను బాధించవని కూడా తెలిపారు. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని దానిని దాటి ఇలా అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించనని హనీరోజ్ హెచ్చరించారు.ఎవరీ బంగారు బాబీ..?భారత్‌లో బంగారు వ్యాపారంలో బాబీ చెమనూరు ప్రముఖులుగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. అలా ఆయన పేరు అందరికీ పరిచయమే. వ్యాపారంలో భాగంగా నటి హనీరోజ్‌ను అతను ఆహ్వానించినా పలు కారణాలతో ఆమె వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్ చె లు–టాంగ్ కాయ్ వె (చైనీస్ తైపీ)లపై గెలుపొందారు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్–చిరాగ్ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రణయ్ 21–12, 17–21, 21–15తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్ షి ఫెంగ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మాళవిక 21–15, 21–16తో గో జిన్ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.
విరాట్ కోహ్లికి అవమానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు. ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు.
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
జనవరి 9 నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా వేదికగా SA20-2025 లీగ్ (మూడో ఎడిషన్) మొదలవుతుంది. 30 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన ఈ లీగ్ ఆరు వేదికల్లో (గెబెర్హా, డర్బన్, పార్ల్, జొహనెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్) జరుగనుంది. ఈ లీగ్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) ఫిబ్రవరి 4న మొదలవుతాయి. ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో (2023, 2024) విజేతగా నిలిచింది.ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్) పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో గత ఎడిషన్లలోలాగే ఒక్కో జట్టు 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ లీగ్‌లో డే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. నైట్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ లీగ్‌లోని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్‌తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది.జట్ల వివరాలు..డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసెన్, జోన్-జాన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే కింగ్ (రూకీ).జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వీస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).ఎంఐ కేప్ టౌన్: రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రీవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్ , డెలానో పోట్గీటర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌవ్, ఈథన్ బాష్, వేన్ పార్నెల్, సెనూరన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్, డారిన్ డుపావిల్లోన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫార్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలియం, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరియాస్ (రూకీ).సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే (ఇంగ్లాండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హర్మన్, ప్యాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిల్ సిమెలన్, డేవిడ్ బెడింగ్హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ).
రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర వీరుడు
న్యూజిలాండ్ ప్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 367 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. తన జట్టు తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన గప్తిల్ కెరీర్లో ఓవరాల్‌గా 23 సెంచరీలు చేశాడు.2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గప్తిల్ 47 టెస్ట్‌లు, 198 వన్డేలు, 122 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 29.4 సగటున 2586 పరుగులు చేసిన గప్తిల్.. ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. గప్తిల్ తన మూడు టెస్ట్ సెంచరీలను బంగ్లాదేశ్ (189), జింబాబ్వే (109), శ్రీలంకపై (156) చేశాడు. గప్తిల్ తన చివరి టెస్ట్‌ను 2016లో ఆడాడు.వన్డేల విషయానికొస్తే.. గప్తిల్ ఈ ఫార్మాట్లో 41.7 సగటున, 87.3 స్ట్రయిక్‌రేట్‌తో 7346 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో గప్తిల్ ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. 2015లో గప్తిల్ వెస్టిండీస్‌పై 237 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గప్తిల్ మాత్రమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) పేరిట ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గప్తిల్‌కు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే గప్తిల్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2009లోనే వన్డే అరంగేట్రం చేసిన గప్తిల్.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు గప్తిలే.టీ20ల విషయానికొస్తే.. 135 స్ట్రయిక్‌రేట్‌తో 31.8 సగటున 3531 పరుగులు చేసిన గప్తిల్ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కెరీర్‌ను ముగించాడు. టీ20ల్లో గప్తిల్ 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన గప్తిల్ న్యూజిలాండ్ తరఫున అండర్-19 స్థాయి నుంచి ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన సందర్భంగా గప్తిల్ తన సహచరులకు , కోచింగ్ స్టాఫ్‌కు, కుటంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గప్తిల్ చెప్పుకొచ్చాడు.
బిజినెస్
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్‌ప్లస్ నార్డ్ 4వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4వన్‌ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది.
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్‌లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్‌తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్‌ఫోన్‌లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్‌పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు.
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్: ధర అన్ని కోట్లా?
ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ ఒకరు.గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్‌ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన వాచ్‌లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్‌లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్‌తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.వాచ్‌ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్‌బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్‌ల ప్రస్తావన వచ్చింది. జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్అనంత్ అంబానీ వాచ్ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్‌షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్‌నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్‌యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది.
ఫ్యామిలీ
మిద్దె తోట : షేడ్‌నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..)
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది.
గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సెస్, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 25 నుంచి 49 ఏళ్ల మధ్య వ్యవసాయ కూలీలుగా ఉన్న గ్రామీణ మహిళల్లో 32 శాతం గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ...Hysterectomy) శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని, ఈ శస్త్ర చికిత్సలు ప్రభుత్వ బీమా పథకాల ద్వారానే జరుగు తున్నాయని వెల్లడైంది. గర్భసంచి(Uterus) తొలగింపు శస్త్ర చికిత్సలవైపు గ్రామీణ మహిళలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?! ఏ అంశాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి?! గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?! అవగాహన అవసరం...దేశంలో బిహార్, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాల్లోని గ్రామాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు స్త్రీ వైద్య నిపుణులు. వారు చెబుతున్న విషయాలేంటంటే..ఖర్చుకు భయపడి...వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత శుభ్రత తక్కువ. దీనివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, రుతు సమయంలో వచ్చే నొప్పులను ఇంటిలో పనుల కారణంగా భరిస్తున్నారు. అయితే గర్భసంచి వాపు, సిస్టులు అనగానే క్యాన్సర్ అని భయపడుతున్నారు.సమస్య తీవ్రం అయినప్పుడు హాస్పిటల్‌కు రావడం, త్వరగా నయం కాకపోవడంతో పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసి వస్తుందని, దీనివల్ల ఇంటి పనులు, కూలి పనులకు ఇబ్బందులు వస్తాయని, తమ వెంట వచ్చేవారి పని కూడా పోతుందని, టెస్టులకు, మందులకు అదనపు ఖర్చు అని.. ‘గర్భసంచి తొలగించు కుంటే’ ఈ చికాకులన్నీ పోతాయనే ఆలోచనకు వస్తున్నారు. శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాల కోసం వెతుకుతున్నారు.గర్భసంచి సమస్యలను వాయిదా వేసుకుంటూ కూలి పనులు ఎక్కువ ఉండని వేసవి కాలాన్ని ఆపరేషన్‌కు కేటాయించుకుంటున్నారు. త్వరగా పెళ్ళిళ్లు అవడం, పిల్లలు పుట్టడం, త్వరగా గర్భసంచి తొలగించుకోవడం అనేది గ్రామాల్లో కూలి పనులకు వెళ్లే వారిలో తరచూ కనిపిస్తోంది.అత్యవసర అవగాహనశుభ్రతకు సంబంధించిన అవగాహన అత్యవసరం. అధిక రక్తస్రావం సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. హార్మోన్లకు, బలానికి వాడే మందులను అందజేయాలి.తప్పనిసరై గర్భసంచి తొలగించుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మధుమేహం, బలహీనత, ఎముకల సమస్యలు... వీటన్నింటి పైనా అవగాహన కల్పించాలి.ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా ఉండటమూ దేశ భవిష్యత్తుకు కొలమానమే. వ్యవసాయ కార్మికులుగా ఉన్న మహిళలు తరచూ పురుగు మందులకు గురి కావడం వల్ల కూడా అధిక రుతుస్రావాలు, ఫైబ్రాయిడ్లు, గర్భాసంచి లోపాలు, జననేంద్రియ సమస్యలకు కూడా గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్ట్గర్భసంచి తొలగించడం వల్ల అండాలు విడుదల కాక హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకలపై ప్రభావం పడి, త్వరగా కీళ్ల సమస్యలు వస్తాయి. చాలా మందిలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల గర్భసంచి వాపు వస్తుంది. ఫైబ్రాయిడ్స్, సిస్టులు వస్తుంటాయి. అయితే అవగాహన లేక క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో గర్భసంచి తీసేయమని కోరుతున్నారు.పాప్‌స్మియర్ స్క్రీనింగ్‌తో గర్భసంచి సమస్య ఏంటో ముందే తెలుసుకోవచ్చు. దానికి తగిన మందులు వాడితే సరిపోతుంది. 40 ఏళ్ల లోపు మహిళలకు గర్భసంచి తొలగించకపోవడమే మంచిది. హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్టులు, కుటుంబం మొత్తానికి స్త్రీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. – డాక్టర్ భానుప్రియ, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నిజామాబాద్అడ్డంకిగా భావిస్తున్నారుగ్రామీణ మహిళలు ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం మందులు వాడటం, పదే పదే వైద్యులను సంప్రదించడం వారికి కష్టంగా మారుతుంది. అందుకు గర్భసంచి తొలగించుకోవడం మేలేమో అనే ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. సర్జికల్‌గా వచ్చే మెనోపాజ్ వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, చిరాకు, హాట్ ప్లషెస్.. అన్నీ ముప్పైల్లోనే కనిపిస్తాయి. – డాక్టర్ మనోరమ, మధిర, ఖమ్మం జిల్లా – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు
International View all
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి.
Viral: హిజాబ్ ధరించమన్నందుకు ఏం చేసిందంటే..
వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్య
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించాడు.
కార్చిచ్చు గుప్పిట్లో లాస్ ఏంజెలెస్
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో కార్చిచ్
‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది?
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది.
National View all
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలప
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్
పిడుగులాంటి వార్త..ఇలా అయితే కష్టమే..!
ప్రస్తుత జీవన విధానం, కాలుష్యం కారణంగా తొందరగా జుట్టు నెరిసిపోవడం, ఊడ
తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక
NRI View all
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
క్రైమ్
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.
ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!
సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్ రెండో లేఅవుట్లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది. అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
యువకుడి దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): స్వల్ప వివాదం పెద్దదిగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెంలో జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. కొండాయపాళేనికి చెందిన గంట ఉదయ్ కుమార్, అభిషేక్ (23)లు అన్నదమ్ములు. అదే ప్రాంతానికి చెందిన దాసు వారికి దూరపు బంధువు. దాసు మద్యానికి బానిసయ్యాడు. మత్తులో ఇష్టానుసారం ప్రవర్తించేవాడు. అసభ్యకర పదజాలంతో దూషించేవాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాసు తన ఇంటికి సమీపంలో గట్టిగా కేకలు వేస్తుండటంతో ఉదయ్ వారించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉదయ్ అతడిపై చేయి చేసుకోవడంతో దాసు వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని పడారుపల్లిలో ఉంటున్న తన భార్య, అత్త, బావమరుదులు శ్రీకాంత్, శ్రీనివాసులు, స్నేహితుడు సూర్యకు చెప్పాడు. అందరూ కలిసి సోమవారం తెల్లవారుజామున కొండాయపాళేనికి చేరుకుని ఉదయ్‌తో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న అభిషేక్, ఉదయ్ స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ చింటూ అడ్డుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన వారు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా ఈ ముగ్గురిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో అభిషేక్‌కు తీవ్రగాయాలై మృతిచెందగా, ఉదయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. మృతుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.