Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Reacts Raptadu BC Party Worker Kuruba Lingamaiah Incident1
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు

గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్‌ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం

Cell Phone Lokesh Babu Chandrababu Naidu2
ఫోన్‌లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని బాబుగారికి చెబితే పోలా..!

‘‘ఈరోజు ప్రపంచం ఇలా ఉందంటే అందుకు కారణం నేనే.. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే అందుకు కారణం కూడా నేనే. సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని క్షణాల్లో వీక్షించి వస్తున్నామంటే అందుకు కారణమూ నేనే’’ ఈ తరహా గప్పాలు కొట్టుకోవడం మన బాబుగారికి బాగా అలవాటు. ఏదైనా మంచి విషయం వెలుగులోకి వస్తే చాలు అందుకు ఆద్యుడిని తానే అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి చెప్పుకోవడం అలవాటు. ఇది కేవలం బాబుగారికి మాత్రమే చెల్లిన అలవాటు. పొరపాటున కూడా ఆ అలవాటు మార్చుకోరు మన బాబు గారు. లోకేష్‌కు సెల్‌ఫోన్‌ భయం..మరి ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కు సెల్ ఫోన్ ను చూస్తే భయవేస్తోందట. ఎవరి చేతుల్లోనైనా సెల్ ఫోన్ చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మన చినబాబు. అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు(సోమవారం) లోకేష్ సమావేశమయ్యారు. వారికి ముందుగా ఒకే ఆజ్ఞ చేశారు చినబాబు. ‘సెల్ ఫోన్ లలో ఏమీ రికార్డు చేయొద్దమ్మా’ అంటూ తన స్టైల్ లో ఆదేశాలిచ్చారు లోకేష్. ఇదంతా ఎందుకంటే తనను ఎవరైనా నిలదీసి అది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితి ఏమటనే కోణంలోనే లోకేష్ ముందుగా జాగ్రత్తలు పడ్డారు. ఈ భేటీలో సూపర్ సిక్స్ హామీలపై ఎవరైనా నిలదీసి అది సోషల్ మీడియా వరకూ చేరితే ట్రోలింగ్ గురి కావాల్సి వస్తుందని ముందే గ్రహించిన లోకేష్ దీన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రికార్డింగ్ చేస్తే సెల్ ఫోన్స్ అమ్మి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన లోకేష్ బాబు ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవడం అక్కడకు వచ్చిన కార్యకర్తల వంతైంది.లోకేష్‌ వ్యాఖ్యలను వినడానికి ఫోటోపై క్లిక్‌ చేయండి..మరి నాన్నగారైన చంద్రబాబు సెల్ ఫోన్ కు రావడానికి కారణం తానేనని, ఆరోజు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సెల్ ఫోన్ వచ్చిందని బాబుగారు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. మామూలుగా ఫోన్ చేసుకోవడానికే కాదు.. డబ్బులు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్ అవసరం ఎంతో ఉంది. అదొక నిత్యావసర వస్తువంటూ 2023లో ఓ సందర్భంలో కామెంట్స్ చేశారు చంద్రబాబు. భార్య లేకపోతే భర్త ఉంటాడని, భర్త లేకపోతే భార్య ఉంటుందని, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండరంటూ బాబుగారు తన గొప్పను గొప్పగానే చెప్పుకున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాబుగారు సెల్‌ ఫోన్‌ కు ఎక్కువ ప్రమోషన్‌ ఇస్తూ.. తనను కూడా ప్రమోట్‌ చేసుకుంటూ ఉంటారు.కొసమెరుపు: మరి ఇప్పుడు అదే సెల్ ఫోన్ చూసి లోకేష్ భయపడుతున్నారంటే ఏమనాలి. ఇక నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని ఇప్పుడు బాబుగారికి చెబితే బాగుంటుందేమో మరి.

How Alice Walton world Richest Woman Spendings3
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు

ప్రముఖ రిటైల్‌ కార్పొరేషన్‌ వాల్‌మార్ట్‌కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్‌మార్ట్‌ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్‌ వాల్టన్‌ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్‌లో నిలిచారు. వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్‌ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.వాల్టన్‌కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్‌ పెయింటింగ్‌ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్‌లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్‌లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్‌ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్‌ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్‌ విక్టరీ ఫండ్‌కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Jasprit Bumrah starts bowling at NCA, Good News for Mumbai Indians4
ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన బుమ్రా

ఐపీఎల్‌-2025లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మవుతున్న ముంబై ఇండియ‌న్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌, టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ద‌మవుతున్నాడు. వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్న బుమ్రా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పున‌రావ‌సం పొందుతున్నాడు.ఈ క్ర‌మంలో జ‌స్ప్రీత్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆఖ‌రి టెస్టులో గాయ‌ప‌డిన బుమ్రా.. అప్ప‌టి నుంచి ఆట‌కు దూరంగా ఉంటున్నాడు.ఈ క్ర‌మంలోనే ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూర‌మ‌య్యాడు. అయితే బుమ్రా రీ ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. బుమ్రా ఫిట్‌నెస్‌పై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా తన రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ స్పీడ్ స్టార్ కోలుకుంటాడని ఆశిస్తున్నాము. ఎప్పుడొస్తాడు అనేది మాత్రం చెప్పలేము" అని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్యబృందం బుమ్రాకు ఈ వారంలో ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టును బుమ్రా క్లియర్ చేసినట్లైతే త్వరలోనే ముంబై జట్టులో బుమ్రా చేరే అవకాశముంది. బుమ్రా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో బుమ్రాదే కీలక పాత్ర. ఆ తర్వాత బీజీటీని భారత్ కోల్పోయినప్పటికి బుమ్రా మాత్రం 32 వికెట్లతో లీడిగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడికి 2024 ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.చ‌ద‌వండి: RR VS CSK: చివరి ఓవర్‌లో ధోని ఔట్‌.. సీఎస్‌కే ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ చూడండి..!Bumrah has started bowling in NCA. Don't know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025

Telangana Govt React On HCU Land Issue5
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు. ఆ భూమి య‌జ‌మాని తామేన‌ని న్యాయ‌స్థానం ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థ‌కు 21 ఏళ్ల క్రితం కేటాయించిన‌ భూమిని న్యాయ‌పోరాటం ద్వారా ప్ర‌భుత్వం ద‌క్కించుకుంది. వేలం.. అభివృద్ధి ప‌నులు అక్క‌డ ఉన్న రాళ్లను దెబ్బ‌తీయ‌వు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్‌) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, ‍విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. సెంట్రల్‌ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్‌ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్‌ కుమార్‌, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్‌ యాక్ట్‌ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు.

Shiv Sena Sanjay Raut Satires Modi Nagpur RSS Visit6
మోదీ రిటైర్మెంట్‌.. మాకు ఆ అవసరమే లేదు!

ముంబై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని(RSS Headquarters) సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంతో.. మోదీ రాజకీయ నిష్క్రమణపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్‌ మోదీని తప్పించి వారసుడ్ని ఎంపిక చేసే పనిలో ఉందని.. అందుకే ఆయన నాగ్‌పూర్‌కి రావాల్సి వచ్చిందని శివసేన(థాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ‘తండ్రి’ వ్యాఖ్యలతో గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ ఏడాదిలో మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారని.. ఆ విషయాన్ని తెలియజేసేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలిశారంటూ ముంబైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో రౌత్‌ అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దరఖాస్తును సమర్పించేందుకే ఆయన ఆరెస్సెస్‌ నాగ్‌పూర్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. గత 10 ఏళ్లలో ఆయన ఏనాడూ అక్కడికి వెళ్లలేదు. కేవలం ఆరెస్సెస్‌ చీఫ్‌కు వీడ్కోలు చెప్పేందుకే ఇప్పుడు వెళ్లారు అంటూ సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ సమయం ముగిసిపోయింది. ఈ సెప్టెంబర్‌తో ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆ వయసు, దానిని మించినవాళ్లు పదవుల్లో కొనసాగవద్దని ఆ పార్టీ(BJP)లో అప్రకటిత నిబంధన ఉంది. దేశ నాయకత్వాన్ని మార్చాలని సంఘ్‌ పరివార్‌ బలంగా అనుకుంటోందని, బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ త్వరలో మార్పులు ఉండబోతున్నాయని అన్నారాయన. ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో ప్రధాని హోదాలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి(Atal bihari Vajpayee) సందర్శించగా.. మళ్లీ ఇప్పుడు మోదీ ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి చేశారు. అయితే మోదీ వారసుడిని ఆరెస్సెస్‌ ఈ సెప్టెంబర్‌లో ఎంపిక చేయబోతుందన్న రౌత్‌ వ్యాఖ్యలకు బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌(Devendra Fadnavis) కౌంటర్‌ ఇచ్చారు. తండ్రి ఉండగా వారసుడు అనేవాడి అవసరమే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ నాయకత్వాన్ని మార్చడమా?. మాకు ఆ అవసరమే లేదు. మోదీకి వారసుడిని వెతకాల్సిన అవసరమూ లేదు. మోదీజీనే మా నేత. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం. 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని చర్చించడం కూడా తగదు. బీజేపీలో వయసు దాటితే రిటైర్‌మెంట్‌లాంటి నిబంధనేదీ బీజేపీలో లేదన్న ఫడ్నవిస్‌.. 80 ఏళ్ల వయసులో మంతత్రి పదవి చేపట్టిన బీహార్‌ నేత జితన్‌ రామ్‌ మాంజీ పేరును ప్రస్తావించారు. ఈ టర్మ్‌లోనే కాదు.. వచ్చే టర్మ్‌లోనూ ఆయన మా నాయకుడు. మోదీ రాజకీయాలను వీడతారని వ్యాఖ్యానించేవాళ్లది మొఘలుల ఆలోచన ధోరణిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మన సంప్రదాయంలో తండడ్రి బతికి ఉండగా.. వారసత్వం అనే ప్రస్తావనే ఉండదు. ఇలాంటివి మొఘలుల సంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి. వన్‌ షాట్‌.. టూ బర్డ్స్‌లాగా ఔరంగజేబ్‌ సమాధి వివాదం నడుస్తున్న వేళ.. ఫడ్నవిస్‌ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కిందటి ఏడాది స్వార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ రాజకీయ రిటైర్‌మెంట్‌ గురించి చర్చ నడిచింది. ఆ టైంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. మోదీ స్థానంలో అమిత్‌ షా ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.

We Are Ready Shiv Sena style Welcome: To Kunal Kamra Rahool Kanal7
‘అప్పుడు నీకు మామూలు ‘‘వెల్‌కమ్‌’’ ఉండదు’

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శివసేన ఆగ్రహానికి గురైన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాసు హైకోర్టు మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కునాల్ కమ్రా షోలు చేసే స్టూడియో కూల్చివేసిన ఘటనలో అరెస్టై బెయిల్ పై విడుదలైన శివసేన పార్టీ యువసేన జనరల్ సెక్రటరీ నేత రాహుల్ కనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కునాల్ కమ్రా బెయిల్ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే.. కునాల్‌ కమ్రా మహారాష్ట్రకు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు శివసేన సిద్ధంగా ఉందంటూ ప్రతీకార చర్య వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రాహుల్ కనాల్.. ‘ కునాల్ కమ్రాకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కునాల్ కు ఊరట లభించింది. ఇది కేవల ఏప్రిల్ 7 వరకు మాత్రమే. ఆ తర్వాత కునాల్ చట్టపరమైన సమస్యలు తప్పవు. ఈ క్రమంలో ముంబైకి రాక తప్పదు. అప్పుడు నేను కునాల్ గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేస్తా.. అది కూడా శివ సేన స్టైల్ లోనే ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కునాల్ కు అక్కడ ఎవరు రక్షణ కల్పిస్తున్నారన్నది అనవసరం. షిండే పై చేసిన వ్యాఖ్యలకు గాను ముంబైకు కునాల్ తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడు అతని మామూలు ‘ వెల్ కమ్’ ఉండదు’ అంటూ కామెంట్స్ చేశారు.అంతకుముందు తాను విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలని ముంబై పోలీసుల్ని కునాల్ కమ్రా కోరగా దాన్ని వారు నిరాకరించారు. అయితే తనకు ప్రాణ హాని ఉందంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు కునాల్ కమ్రా. ఈ కేసులో కునాల్ కమ్రాకు గత శుక్రవారం మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ముంబైలోని హాబిటాట్ స్టూడియో(ల జరిగిన ఈవెంట్‌లో కునాల్‌ కమ్రా ఓ షో చేస్తూ ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్‌ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో రాహుల్ కనాల్ తో పాటు 11 మందిని అరెస్టు చేయగా, వారికి బెయిల్ కూడా లభించింది.

Director Sanoj Mishra Arrested Who Offered Chance To Monalisa8
మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉ‍న్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)

US Woman Explains Why She Prefers Raising Her Children In India9
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్‌ తల్లి పోస్ట్‌

అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్‌ డ్రీమ్‌. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్‌ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్‌ అమ్మ మాత్రం సింపుల్‌గా అసలైన ఆనందం భారత్‌లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్‌ సంపాదన పరంగా అమెరికా బెస్ట్‌ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్‌లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..! గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్‌ మహిళ క్రిస్టెన్‌ ఫిషర్‌ తన పిల్లలు యునైటెడ్‌ స్టేట్స్‌ వద్దని భారత్‌లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్‌ చేసుకుంది. స్కైఫిష్‌ డెవలప్‌మెంట్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అయిన క్రిస్టెన్‌ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే.. భావోద్వేగాలను హ్యాండిల్‌ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది. స్ట్రాంగ్‌ రిలేషన్స్‌: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు. గ్లోబల్ నెట్‌వర్క్‌ కనెక్షన్‌: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్‌కు నిర్మించుకోవడానికి హెల్ప్‌ అవుతాయి. ఇలా ఆ ఆమెరికన్‌ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పి‍స్తుంది.పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్‌. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్‌లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్‌ చేశారామె. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: స్ట్రోక్‌ బారినపడిన జెరోధా సీఈవో నితిన్‌ కామత్‌..ఏకంగా 14 నెలలు..!)

Encounter In Chhattisgarh, Women Maoist Renuka Died10
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. అగ్ర నేత రేణుక మృతి

రాయ్‌పూర్‌ : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రెస్‌ టీమ్‌ ఇన్‌ఛార్జ్‌ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక మరణించారు. దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌ తుపాకుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మరణించినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ అధికారికంగా ప్రకటించారు. రేణుక తెలంగాణలోని వరంగల్ జిల్లా జనగామ నివాసి. ఆమె తలపై రూ.25లక్షల రివార్డ్‌ ఉన్నట్లు చెప్పారు. కాల్పుల అనంతరం, ఆటోమెటిక్‌ ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 135మంది మావోయిస్టులు మృతి చెందగా.. గతేడాది 219మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. #WATCH | Chhattisgarh | Kamlochan Kashyap, DIG South Bastar, congratulates the security forces for a successful anti-naxal operation, an encounter in which security forces neutralised a female Naxalite identified as Renuka, a Dandakaranya Special Zonal Committee (DKSZC) member… pic.twitter.com/BfyzLaaZzJ— ANI (@ANI) March 31, 2025ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement