అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా? | Telangana high court rejects petition on america son-in-law | Sakshi
Sakshi News home page

అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?

Published Sat, Jan 4 2025 12:06 PM | Last Updated on Sun, Jan 5 2025 4:08 PM

Telangana high court rejects petition on america son-in-law

పోలీసులకు ఆదేశాలివ్వలేమన్న తెలంగాణ హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడతారని ఓ అత్తను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ నివాసి 84 ఏళ్ల పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగి.. న్యూజెర్సీలో ఉంటున్న తన అల్లుడిపై కేసు నమోదుకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న పిటిషనర్‌ కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడు. గతంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలోకి చొరబడి తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. 

‘ఆమె అమెరికాలో అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. భారత పౌరురాలిగా జాతీయ మహిళా కమిషన్‌తో పాటు ఇతర మార్గాల్లో రక్షణ పొందే హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు’ అని బదులిచ్చారు. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్‌ లేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

చ‌ద‌వండి: అమెరికాలో భారతీయులకు సరికొత్త ‘అతిథి’ మర్యాదలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement