sun in law
-
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడతారని ఓ అత్తను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నివాసి 84 ఏళ్ల పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగి.. న్యూజెర్సీలో ఉంటున్న తన అల్లుడిపై కేసు నమోదుకు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న పిటిషనర్ కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడు. గతంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలోకి చొరబడి తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. ‘ఆమె అమెరికాలో అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. భారత పౌరురాలిగా జాతీయ మహిళా కమిషన్‌తో పాటు ఇతర మార్గాల్లో రక్షణ పొందే హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు’ అని బదులిచ్చారు. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.చదవండి: అమెరికాలో భారతీయులకు సరికొత్త ‘అతిథి’ మర్యాదలు -
అత్తగారిఇంటిలో 'అత్త'ను చంపిన అల్లుడి..!
మంచిర్యాల: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్లసింగారంలో గురువారం జరిగిన కాల్పుల ఘటన మంచిర్యాల జిల్లాలోనూ కలకలం రేపింది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్ పోలీసు సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసాద్ తన అత్త కమలాదేవి(58)కు రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతని కాపురంలోనూ విభేదాలు వచ్చాయి. వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్ అత్తతోపాటు భార్య, బావమరిదిని టార్గెట్ చేశాడు. అత్తను చంపిన తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ తన రివాల్వర్ని క్లీన్‌చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తరువాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు. గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రివాల్వర్ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించి రివాల్వర్‌ను ప్రసాద్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సమాచారం. కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వెళ్లి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడం, కుటుంబ సభ్యులు రావడం.. అతనిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. తూటా శబ్దంతో కలకలం కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి గేటు నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు. కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్ భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు. ఓ వైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతని తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు. ఆధారాల సేకరణ.. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్ షెల్ కోసం దాదాపు గంటరన్నపాటు వెతికినా లభ్యం కాలేదు. కొంతకాలంగా వేర్వేరుగా.. ప్రసాద్, రమాదేవిలు కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్ అవమానకరకంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికి భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సమగ్ర దర్యాప్తు – ఎంఏ బారి, డీసీపీ హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్‌పై విచారణ కోటపల్లి పోలీసుస్టేషన్లో గన్ మిస్సింగ్‌పై రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం విచారణ చేపట్టారు. మంచిర్యాల డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్ స్టేషన్‌కు చేరుకుని సుమారు ఆరు గంటలపాటు విచారణ జరిపారు. నిందితుడు ఉపయోగించింది సర్వీస్ గన్ కావడంతో పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆయుధం అతడి చేతికెలా వచ్చింది..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రసాద్ షార్ట్ వెపన్ తీసుకెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన డీసీపీ పలువురి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదుడే.. ప్రసాద్ వైఖరి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో హోంగార్డుగా పని చేసిన ప్రసాద్ 2012–13 కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో పెద్దపల్లి జిల్లాలో పని చేశాడు. మద్యానికి బానిసై విధుల్లో నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులతో గొడవ పడేవాడని సమాచారం. మూడు నెలల క్రితమే పెద్దపల్లి జిల్లా నుంచి మారుమూల ప్రాంతమైన కోటపల్లి పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యాడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కువగా విధులకు డుమ్మా కొట్టడం, తోటి సిబ్బందితో అమర్యాదగా వ్యవహరించడంతో సిబ్బంది అతడికి దూరంగా ఉండేవారని తెలిసింది. దొంగతనం కేసు కానిస్టేబుల్ ప్రసాద్‌పై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సురేష్‌కుమార్ తెలిపారు. స్టేషన్‌లోని ఆయుధ కారాగారంలో ఉంచిన పిస్టల్‌ను అపహరించుకుపోయాడని పేర్కొన్నారు. -
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్’ మూర్తి అల్లుడు
లండన్: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్ ఎంపీ రిషి సునక్(39) భారీ ప్రమోషన్ కొట్టేశారు. బ్రిటన్ కేబినెట్లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్ చీఫ్ స్పెషల్ అడ్వైజర్ డొమినిక్ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది. వీరితోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ(52)కు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్(39)ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని ‘దేశి కేబినెట్ ఇన్ యూకే హిస్టరీ’గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని రిషి అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. -
వచ్చే నెలలో విజేత
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్ కథనాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్లో కాలేజ్‌లో జరిగే ఇంటర్వ్యూల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాటలు మినహా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. సినిమాను జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. చిరంజీవిగారి అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. రాకేశ్ శశి బాగా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని పేర్కొంది చిత్రబృందం. తనికెళ్ల భరణి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
అత్తింట్లో చోరీ..అల్లుడే దొంగ..!
ఖమ్మం: అత్తింటికే ఆ అల్లుడు కన్నం వేశాడు. ఆపై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వైనం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్య లచ్చా జీసీసీ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె, అల్లుడు కూడా స్థానికంగానే ఉంటున్నారు. అయితే, అల్లుడు లకావత్ శ్రీను మామ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. అందులో భాగంగానే ఆ ఇంటికి సంబంధించి మారు తాళం చెవి తయారు చేయించి సిద్ధంగా ఉంచుకున్నాడు. కాగా, అత్తింటి కుటుంబసభ్యులంతా కలసి తిరుపతి బయలుదేరగా అతడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అదేరోజు ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. భూక్య లచ్చా కుటుంబసభ్యులు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వేసిన తాళం వేసినట్లుగానే ఉండగా బీరువాలో ఉన్న రూ.7 లక్షల విలువైన 27 తులాల బంగారు ఆభరణాలు, రూ.24 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహన తనిఖీలు చేస్తుండగా లకావత్ శ్రీను నగలు విక్రయించేందుకు వెళ్తూ దొరికిపోయాడు. విచారణలో అతను దొంగతనం నేరాన్ని అంగీకరించాడు. -
వాగులో పడి మామాఅల్లుళ్ల మృతి
ఆదిలాబాద్: ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్కంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దస్రుపటేల్గూడ గ్రామానికి చెందిన చిక్రమ్ కిషన్, రాంబాయిల కుమారుడు పవన్(9), పవన్‌కు వరసకు మామ అయిన సిడాం సూర్యభాన్ (40) జైతుపటేల్గూడ గ్రామంలో పెళ్లికి వెళ్తున్నారు. రెండు గ్రామాల మధ్య ఉన్న చిక్మన్ ప్రాజెక్టును నాటు పడవ సాయంతో దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, లక్కంపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించిన మామఅల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అంటున్నారు.