వచ్చే నెలలో విజేత | kalyan dev vijetha movie released on july | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో విజేత

Published Fri, Jun 1 2018 1:14 AM | Last Updated on Fri, Jun 1 2018 1:14 AM

kalyan dev vijetha movie released on july - Sakshi

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రాకేశ్‌ శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్‌ కథనాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో కాలేజ్‌లో జరిగే ఇంటర్వ్యూల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.

పాటలు మినహా ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. సినిమాను జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. చిరంజీవిగారి అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. రాకేశ్‌ శశి బాగా తీస్తున్నారు.  సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ హైలైట్‌’’ అని పేర్కొంది చిత్రబృందం. తనికెళ్ల భరణి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement