టికెట్ ధరల పెంపునకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్ తేజ్ కలయికలో ఈనెల 10న విడుదల కానున్న ‘గేమ్‌చేంజర్’ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇటీవల పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో నెలకొన్న ఘటనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపునకు మాత్రం ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఈనెల 10వ తేదీన 6 షోలు ప్రదర్శించుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు.
ఈ తొమ్మిది రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్స్ జారీ చేసే అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment