తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.
ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.
(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ )
అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment