12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విక్రాంత్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఐఏఎస్‌గా ఎదిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇటీవల విక్రాంత్ మాస్సే నటించిన చిత్రం సబర్మతి రిపోర్ట్. బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు.
జీ5లో స్ట్రీమింగ్..
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 10న నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్న తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు.
సబర్మతి రిపోర్ట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..
ఈ చిత్రాన్ని మన ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పన్ను రహితంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
సిబ్బందితో పాటు హాజరయ్యారు.
రిటైర్‌మెంట్ అంటూ రూమర్స్..
అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత విక్రాంత్ మాస్సే నటనకు విరామం ప్రకటించారని వార్తలొచ్చాయి. కానీ కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన కొందరు పర్మినెంట్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పారని కథనాలు రాసుకొచ్చారు. ఆ తర్వాత దీనిపై విక్రాంత్ మాస్సే క్లారిటీ కూడా ఇచ్చారు.
తన కుమారుడు వర్దన్‌తో సహా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రొమాంటిక్ కామెడీ చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్‌లో షానాయ కపూర్ సరసన కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.
విక్రాంత్ మాస్సే సినీ కెరీర్..
బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.
పర్సనల్ లైఫ్
విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు.
The nation’s biggest cover-up unravels, revealing the truth—only on #ZEE5. 📰
Watch #TheSabarmatiReport premiering on 10th Jan, only on #ZEE5!#TheSabarmatiReportOnZEE5@VikrantMassey #RaashiiKhanna @iRidhiDogra @balajimotionpic @VikirFilms @ZeeMusicCompany @ZeeStudios… pic.twitter.com/4QggdFUSDT— ZEE5 (@ZEE5India) January 8, 2025
Comments
Please login to add a commentAdd a comment