The Sabarmati Report Movie
-
ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్టు’(The Sabarmati Report) సినిమా సడెన్‌గా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ.. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో విక్రాంత్ మాస్సే(Vikrant Massey), రిథి దిగ్రా, రాశిల్ ఖన్నా(Raashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్నా దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.తెలుగులో స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో ‘ది సబర్మతి రిపోర్టు’ మూవీ జనవరి 10 నుంచే హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు జీ5 ఒక పోస్టర్‌ను కూడా పంచుకుంది. 12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్రాంత్ మాస్సే.. ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.మోదీ మెచ్చిన చిత్రంగుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో వీక్షించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూశారు. ఆపై చిత్ర యూనిట్‌ను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీ ప్రకటించాయి. గోద్రా రైలు దహనకాండపై.. ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఆగివున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22ఏళ్లుగా చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని సినిమా విడుదల సమయంలో చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్టు’ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక) -
ఓటీటీకి వచ్చేస్తోన్న ప్రధాని మెచ్చిన సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విక్రాంత్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఐఏఎస్‌గా ఎదిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల విక్రాంత్ మాస్సే నటించిన చిత్రం సబర్మతి రిపోర్ట్. బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు.జీ5లో స్ట్రీమింగ్..తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 10న నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్న తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు.సబర్మతి రిపోర్ట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఈ చిత్రాన్ని మన ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పన్ను రహితంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.సిబ్బందితో పాటు హాజరయ్యారు.రిటైర్మెంట్ అంటూ రూమర్స్..అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత విక్రాంత్ మాస్సే నటనకు విరామం ప్రకటించారని వార్తలొచ్చాయి. కానీ కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన కొందరు పర్మినెంట్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పారని కథనాలు రాసుకొచ్చారు. ఆ తర్వాత దీనిపై విక్రాంత్ మాస్సే క్లారిటీ కూడా ఇచ్చారు.తన కుమారుడు వర్దన్‌తో సహా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రొమాంటిక్ కామెడీ చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్లో షానాయ కపూర్ సరసన కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. విక్రాంత్ మాస్సే సినీ కెరీర్..బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. The nation’s biggest cover-up unravels, revealing the truth—only on #ZEE5. 📰Watch #TheSabarmatiReport premiering on 10th Jan, only on #ZEE5!#TheSabarmatiReportOnZEE5@VikrantMassey #RaashiiKhanna @iRidhiDogra @balajimotionpic @VikirFilms @ZeeMusicCompany @ZeeStudios… pic.twitter.com/4QggdFUSDT— ZEE5 (@ZEE5India) January 8, 2025 -
ది సబర్మతి రిపోర్ట్ సినిమాను వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
గోద్రా అల్లర్లపై సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?
నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)2002లో గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!)