నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)
2002లో గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.
టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!
(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!)
Comments
Please login to add a commentAdd a comment