వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్టు’(The Sabarmati Report) సినిమా సడెన్‌గా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ.. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో విక్రాంత్ మాస్సే(Vikrant Massey), రిథి దిగ్రా, రాశిల్ ఖన్నా(Raashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్నా దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.
తెలుగులో స్ట్రీమింగ్
జీ5 ఓటీటీలో ‘ది సబర్మతి రిపోర్టు’ మూవీ జనవరి 10 నుంచే హిందీ వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు జీ5 ఒక పోస్టర్‌ను కూడా పంచుకుంది. 12th ఫెయిల్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్రాంత్ మాస్సే.. ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.
మోదీ మెచ్చిన చిత్రం
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో వీక్షించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూశారు. ఆపై చిత్ర యూనిట్‌ను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీ ప్రకటించాయి.
గోద్రా రైలు దహనకాండపై..
ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోద్రా రైల్వేస్టేషన్‌లో ఆగివున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22ఏళ్లుగా చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని సినిమా విడుదల సమయంలో చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్టు’ సినిమాని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక)
Comments
Please login to add a commentAdd a comment