ఉక్రెయిన్‌లో 13 మంది పౌరుల మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జపోరిఝియా ప్రాంతంలోని పట్టణంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ దాడిలో 13 మంది ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయాలపాలయ్యారని రీజనల్ గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలిపారు. రక్తమోడుతున్న పౌరులను నగర వీధిలో రోడ్డుపైనే ప్రథమ చికిత్సనందిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన టెలిగ్రామ్ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌చేశారు.
‘‘కేవలం సాధారణ పౌరులున్న సిటీపై దాడి చేస్తే అమాయకులు చనిపోతారని తెలిసీ రష్యా దారుణాలకు ఒడిగడుతోంది’’అని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా తరచూ రష్యా గగనతల దాడులతో ఉక్రేనియన్ల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లో అతిపెద్ద సంక్షోభంగా మారిన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment