28 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్‌స్క్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్‌లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు.
అదేవిధంగా, లుహాన్‌స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment