Bomb attack
-
అది భూకంపం కాదు.. బాంబు దాడే!
నియంత పాలకుడి పీడ విరగడైందన్న సిరియా ప్రజల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓపక్క ప్రభుత్వ ఏర్పాటునకు తిరుగుబాటు దళాలు కొర్రీలు పెడుతున్న వేళ.. మరోవైపు మిలిటరీ స్థావరాలు, ఆయుధ కారాగార ధ్వంసం పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా..తాజాగా.. టార్టస్ రీజియన్‌లో భూమి కంపించినంత పనైంది. రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రత నమోదైంది. అది భూకంపం అని భావించినవారందరికీ.. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ షాకిచ్చింది. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడి అని ప్రకటించింది.వైమానిక దాడుల్లో భాగంగా.. స్థావరాలపై బాంబులు ప్రయోగించాయి ఇజ్రాయెల్ బలగాలు. ఆ ప్రభావంతో.. అగ్ని గోళం తరహాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భూమి కంపించినంత పనైంది. 2012 నుంచి ఇప్పటిదాకా సిరియా తీరం వెంట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. అతిపెద్ద దాడి ఇదేనని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ ప్రకటించింది. 23వ ఎయిర్ ఢిపెన్స్ బ్రిగేడ్ బేస్‌పై జరిగిన దాడిగా ఇది తెలుస్తోంది. JUST IN: 🇮🇱 Israel continues to conduct airstrikes in Syria. pic.twitter.com/06nQDxz3Fw— BRICS News (@BRICSinfo) December 15, 2024 ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది భూకంపం కంటే రెండు రేట్ల వేగంతో ప్రయాణించిందట. అలా.. 800 కిలోమీటర్ల దూరంలోని టర్కీ నగరం ఇస్నిక్లోని భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించడం గమనార్హం.Thank you, @CeciliaSykala . The #explosion of the ammunition depot at #Tartus , Syria was detected at Iznik, Türkiye magnetometer station 820 km away. Signal took 12 minutes to travel in the lower ionosphere. That's about twice as fast as earthquake signals travel. https://t.co/rs2nH1wtwL pic.twitter.com/3u4KYbD57f— Richard Cordaro (@rrichcord) December 16, 2024ఇక.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చాలాకాలంగానే కొనసాగుతున్నాయి. హెజ్బొల్లాకు అత్యాధునిక ఆయుధాలు చేరకుండా ఉండేందుకే వైమానిక దాడులతో నాశనం చేస్తున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. సిరియాతో యుద్ధం మా అభిమతం కాదు. కానీ, మా దేశ భద్రతకు ముప్పు వాటిల్లో అంశంపై.. మరీ ముఖ్యంగా ఉత్తర సరిహద్దుపైనే మా దృష్టి ఉంది అని బెంజిమన్ నెతన్యాహూ చెబుతున్నారు. మరోవైపు.. సిరియాకు ఆయుధ సహకారం అందించిన రష్యా.. తాజా పరిణామాలతో తన స్థావరాలను ఖాళీ చేస్తోంది. తాజాగా దాడి జరిగిన స్థావరం కూడా రష్యాకు చెందినదే అనే ప్రచారం నడుస్తోంది. -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
5 రోజుల్లో 125 విమానాలకు బాంబు బెదిరింపులు
-
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
ఉక్రెయిన్ ప్రతీకారం.. రష్యా ఆక్రమిత ప్రాంతాలపై బాంబుల దాడి
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం మాస్కో దళాలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యాలను ధీటుగా ఎదుర్కొంటూనే సమయం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి దేశంపై బాంబుల దాడికి దిగుతోంది ఉక్రెయిన్.. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాలపై ఉక్రెయిన్ తన ప్రతాపం చూపించింది.రష్యా ఆధీనంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంలో డ్రాగన్ డ్రోన్లతో థర్మైట్ బాంబులను ఉక్రెయిన్ జారవిడిచింది. కొన్ని రష్యన్ సైనిక స్థావారాలను లక్ష్యంగా చేసుకొని నిప్పుల వర్షం కురిపించింది. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. . రష్యా మిలటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ఖోర్న్ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఈవీడియోలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ద్వారా చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్ డ్రోన్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.The Ukrainian military began using the Dragon drone, which burns the area underneath with thermite 🥰🥰🥰 Thermite is a mixture of burning granules of iron oxide and aluminum. About 500 grams of thermite mixture can be placed under a standard FPV drone. The chemical reaction is… pic.twitter.com/3XIzc3LLHN— Anastasia (@Nastushichek) September 5, 2024అత్యంత ప్రమాదకరమైన థర్మైట్ బాంబులు..థర్మైట్ బాంబులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా పరిగణిస్తారు. అల్యూమినియం పొడి, ఐరన్ ఆక్సైడ్ కలిసిన ఈ థర్మైట్ బాంబులు అత్యధికంగా 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇవి చెట్లు, కోటలే కాకుండా ఇనుప లోహాలను, సైతం ఇవి క్షణాల్లో కరిగించగలవు. 2023లో రష్యా కూడా ఉక్రెయిన్ పట్టణం వుహ్లెదర్పై ఈ థర్మైట్ బాంబులను ఉపయోగించింది. అయితే వీటిని జనాలు, సైన్యం నివసించే ప్రాంతాల్లో వీటిని జారవిడిస్తే పెనువిపత్తు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో దాడులు..
కీవ్: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్స్క్లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్‌లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా, లుహాన్స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు వివరించింది. -
#IranAttack: ఇరాన్ దాడులు.. అమెరికా వ్యూహం ఫలించిందా?
Live Updates.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ తాజా వార్నింగ్.. ►ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్‌పై శనివారం రాత్రి డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిపించిన ఇరాన్, ఆ దేశానికి ఆదివారం( ఏప్రిల్ 14) మళ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్‌ను హెచ్చరించారు. తాము చేసిన డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రతి దాడులకు దిగినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ►ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘ఇరాన్ భీకర దాడులను ఇరాన్ ఎదుర్కోని వారిపై విజయం సాధించింది. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించింది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్ణు ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉంది. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని కామెంట్స్ చేశారు. 300 డ్రోన్స్ ప్రయోగించిన ఇరాన్.. ►ఇరాన్ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ డ్రోన్లను కూల్చిన అమెరికా.. ►అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్ మొత్తం 100కుపైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. ►ఇరాన్ ఆపరేషన్ సక్సెస్.. BREAKING: IRAN CHIEF OF STAFF OF ARMED FORCES “We regard this operation as completely successful and we do not intend to continue the operation, but if Israel responds, our next operation will be much bigger.” pic.twitter.com/ys9nR93bUp — Nabeel Shah (@nabeel_AMU) April 14, 2024 ఇరాన్ పార్లమెంట్లో సంబురాలు.. 🇮🇷🇮🇱 The Iranian Parliament celebrates the Iranian attack on Israel - ISZ reports pic.twitter.com/EBKWjeWHL3 — Zlatti71 (@Zlatti_71) April 14, 2024 ►ఇజ్రాయెల్, ఇరాన్ బలాబలాలు ఇలా.. Iran 🇮🇷 vs Israel 🇮🇱 Total Population: Iran 🇮🇷: 87.6M Israel 🇮🇱: 9.04M Available Manpower: Iran 🇮🇷: 49.05M Israel 🇮🇱: 3.80M Fit-for-Service: Iran 🇮🇷: 41.17M Israel 🇮🇱: 3.16M Military Personnel: Active Personnel: Iran 🇮🇷: 610K Israel 🇮🇱: 170K Reserve Personnel: Iran 🇮🇷: 350K… — World of Statistics (@stats_feed) April 14, 2024 ►ఇరాన్, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన భారత్.. ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంపై ఆందోళన వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా 'తక్షణమే ఇరు పక్షాలు వెనక్కు తగ్గాలని, సంయమనం పాటించాలని, హింస నుంచి వెనుదిరిగి, దౌత్య మార్గానికి తిరిగిన రావాలని పిలుపునిస్తున్నాం. మేము పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో మా రాయాబార కార్యాలయాలు టచ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఉండేలా చూడటం చాలా ముఖ్యం' అని భారత్ విదేశాంగ శాఖ పేర్కొంది. 🚨🇮🇱🇮🇷 Iran cruise missiles over Jerusalem War is the greatest failure of human civilisation. We Hope India 🇮🇳 Pray for peace 🕊️ everywhere. Hope everyone safe. #Iran #Israel #WWIII #TheVoice #IranAttack #Iranians #savas #IranAttackIsrael US Air force | Terrorist pic.twitter.com/R0xOq4YHRC — Parmanand (@Parmana75684584) April 14, 2024 ►అప్రమత్తమైన యూకే.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో యూకే అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్‌ఫోర్స్ జెట్లు, ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కోద్దీ రాకెట్లను ప్రయోగించింది. 🇮🇷🇮🇱 IRAN is CELEBRATING after the successful attack on ISRAEL!#Iran #Iranians #Iranian pic.twitter.com/lIPj62U6Q8 — Areeba🇵🇸 (@Areeba_sys) April 14, 2024 ► ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ►ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. Live over Tel Aviv#savas #amici23 #Iran #TheVoice #ENGFAxMajorSongkranFestival #Israel #IranAttack #Coachella #Iranians #LANACHELLA pic.twitter.com/jsTqnbW9qy — Dr.Qayyum (@Qayyum654475038) April 14, 2024 WE STAND WITH IRAN #Palestinians #IranAttackIsrael #Iranians #Iranian pic.twitter.com/AfICHslK7V — Hitler😎 (@happy601_hitler) April 14, 2024 #WorldWar3 1 . Russia, China, Iran,yamen, North Korea 2. Nato , USA, Israel and UK India stand neutral 😐 #Iran#Isreal #IranAttack #Indian pic.twitter.com/v4fXu2Cb5q — Vikas Singh (@VikasKu74248695) April 14, 2024 WW3 HAS OFFICIALLY STARTED ?#IranAttackIsrael #Israel #WorldWar3 pic.twitter.com/lqLLEJToP4 — Amit Jha (@amit_code) April 14, 2024 Palestinians celebrating Iran ballistic missiles#IranAttack #IranAttackIsrael #Iranian #Iranians #StandWithIran #WorldWar3 #WorldWarIII #Iran #Israel #IsraelIranWar #الحرب_العالمية_الثالثة #LALISA pic.twitter.com/1ooFUCCvbX — Abid Ullah (@abidullahmsd03) April 14, 2024 ►ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇక, ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ►కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి రాగానే సైరన్ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్లో డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం. #WATCH | Tel Aviv: Iranian drones intercepted by Israel's Iron Dome, as Iran launches a drone attack against Israel by sending thousands of drones into its airspace. (Source: Reuters) pic.twitter.com/GyqSRpUPF1 — ANI (@ANI) April 14, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది. Israelis’ reality in the last hours: pic.twitter.com/VXeHM8WqJi — Israel Defense Forces (@IDF) April 14, 2024 Outstanding video of Iran targeting Israeli Air defense systems! Iranian missiles with decoy bomblets are first deployed, then several ballistic missiles hit their intended target. What a fantastic video. pic.twitter.com/ff5ftepSj1 — Saeed (@Haman_Ten) April 14, 2024 ISRAELIS in FULL PANIC as IRANIAN missiles land in ISRAEL#Iran #Israel #WorldWar3 #WorldWarIII #Oil #TelAvivTed #IranAttack #iranisraelwar pic.twitter.com/EESNcSV1uc — Time ⭐ (@Sunil__Ahir) April 14, 2024 ఇజ్రాయెల్ నౌకలో భారతీయులు.. మరోవైపు.. 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. BREAKING: IRAN BANS ALL SHIPS LINKED TO ISRAEL “Starting today, all vessels linked to the Zionist regime are banned from operating in the Oman Sea and the Persian Gulf. Any such vessels found in these waters will be confiscated.” pic.twitter.com/9z5VAjPzZX — Sulaiman Ahmed (@ShaykhSulaiman) April 14, 2024 ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. What a beautiful view i have ever seen... i stand with iran💪✌️#Iran #Israel #IranAttack#IranAttackIsrael pic.twitter.com/WOI5xldTC3 — Malik Ehtisham (@MalikEhtisham_1) April 14, 2024 -
ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!
బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నాం
సాక్షి ప్రతినిధి కరీంనగర్/మోర్తాడ్/ఆర్మూర్: ఇజ్రాయెల్‌లో ఉన్న తెలంగాణ వలస కార్మికుల కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలస్తీనా సరిహద్దుకు సమీప ప్రాంతంలో నివసిస్తున్నవారు ఇబ్బందులు పడుతుండగా, టెల్ అవీవ్ వంటి నగరాల్లో ఉన్నవారు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి ఏపీ నుంచి ఐదువేల మంది వరకు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. వీరిలో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది ఉన్నారు. విజిట్ వీసాలపై ఇజ్రాయెల్ వెళ్లిన చాలామంది అక్కడ ఇళ్లలో కార్మికులుగా పనులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని రమద్‌గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో చాలామంది తెలంగాణవారు ఉన్నారు. ఈ పట్టణం పాలస్తీనా సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం సాయంత్రం నుంచి బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోందని తెలంగాణవాసులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ప్రభుత్వం బాంబుల దాడి సమయంలో సైరన్ మోగించడంతో వెంటనే ప్రతి అపార్ట్మెంట్లో ఉండే బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నామని చెప్పారు. తెలంగాణవాసులు కార్మికులుగా పనిచేసే ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన బాంబుదాడిలో ఓ భవనం ఆరో అంతస్తు శిథిలమైందని, ఇప్పటివరకు అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన జలపతిరెడ్డి, గుండ సత్తయ్య, అనంతరెడ్డి, హబ్సీపూర్‌కు చెందిన ఏలేటి మల్లారెడ్డి, గుగ్గిల్ల లక్ష్మీనారాయణ, వరికోల నర్సయ్య, ఆదివారం రాత్రి అక్కడి పరిస్థితులను ‘సాక్షి’కి వివరించారు. టెల్అవీవ్లో సురక్షితం తెలంగాణకు చెందిన 600 మంది వలస కార్మికులు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. హమాస్ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని వారికే ఎక్కువ ముప్పు ఉందని, ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నిజామాబాద్ జిల్లానుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన కార్మికులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. దాడులు మొదలైనప్పుడు కొంత ఆందోళనకు గురయ్యామని, మిలిటెంట్ల ఆగడాలను అరికట్టడానికి ఇజ్రాయెల్ రక్షణ విభాగం రంగంలోకి దిగి సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. రక్షణ చర్యలు చేపట్టారు ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం వల్ల తెలంగాణవారు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి, తెలంగాణ ఇజ్రాయెల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉపాధిపై ప్రభావం ఉంటుంది కుటుంబాలను పోషించుకోవడానికి కోసం ఇక్కడకు వలస వచ్చాం. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందిపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – ఓంకార్, ఇజ్రాయెల్‌లో ఉన్న ఆర్మూర్ మండలం పిప్రివాసి -
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్‌లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
Japan PM: జపాన్ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh — BNO News Live (@BNODesk) April 15, 2023 పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం హాట్ స్ప్రింగ్ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
సొంత పౌరులపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 100 మంది మృతి
మయన్మార్‌లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. కాగా సగయింగ్ ప్రాంతంలోని పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్‌తో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించగా.. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు, స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ప్రతక్ష్య సాక్షి ఒకరు స్థానిక మీడియాతో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం వివరాలను బయటకు పొక్కనీయకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. చదవండి: Bathinda: మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇక ఈ దాడి తామే చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ మిలిటరీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అమాయక పౌరులపై సాయుధ దళాల దాడిని ఉగ్రవాద సైన్యం జరిపిన హేయమైన చర్యగా ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి సైన్యం దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం. -
Ukraine Russia War: అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం, తేడా వస్తే!
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. డాన్బాస్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలు భీకర దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై బాంబుల వర్షం కురిసింది. అయితే ఈ చర్యపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడిలో షెల్స్ హై వోల్టేజ్ పవర్ లైన్‌పై పడినట్లు తెలుస్తోంది. దీని వల్ల రేడియేషన్ లీక్ కానప్పటికీ ఆపరేటర్లు ఓ రియాక్టర్‌ను డిస్ కనెక్ట్ చేశారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో మార్చిలోనే ఈ ప్లాంట్‌ను రష్యా తన అధీనంలోకి తీసుకుంది. అయితే అక్కడ పనిచేసేది మాత్రం ఉక్రెయిన్ టెక్నీషియన్లే. ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్ డాగ్ ఈ ప్లాంట్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని రష్యా యుద్ధంలో రక్షక కవచంలా ఉపయోగించుకుంటోందని అమెరికా ఇటీవలే ఆరోపించింది. అదృష్టం బాగుంది అణువిద్యుత్ కేంద్రంపై భయానక దాడికి పాల్పడినందుకు రష్యాపై అణు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయినే ఈ ప్లాంట్‌పై షెల్స్ దాడి చేసిందని, అదృష్టం కొద్ది రేడియో ధార్మిక శక్తి లీక్ కాలేదని వ్యాఖ్యానించింది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొంది. సమీప నగరంలోని ప్రజలు విద్యుత్, నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ పోర్టు నుంచి మూడు ధాన్యం ఓడలు శుక్రవారం బయలుదేరాయి. రష్యా దండయాత్ర మొదలైన 5 నెలల్లో ఉక్రెయిన్ ఓడ బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి. చదవండి: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల -
ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి.. లైవ్ వీడియో
కన్నూర్: కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. #WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1 — ANI_HindiNews (@AHindinews) July 12, 2022 బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దాడి వెనుక సీపీఎం: బీజేపీ బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్‌దాసన్ పేర్కొన్నారు. ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
చైనీయులే లక్ష్యంగా మహిళ ఆత్మాహుతి దాడి.. బస్సు దగ్గరకు రాగానే..
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం కరాచీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కరాచీ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్కు సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ నిర్వహించారని అధికారులు తెలిపారు. చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానికులకు చైనా భాషను నేర్పుతుంటారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బుర్ఖా ధరించి ఇన్స్టిట్యూట్ గేట్ వద్ద నిల్చున్న ఓ మహిళ.. వ్యాన్ దగ్గరకు రాగానే తనను తాను బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 -
బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై బాంబు దాడి
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మంగళవారం బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే.. వేదికకు పదిహేను నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పాట్నా భక్తియార్‌పూర్‌లో ఈ మధ్యే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మానసిక స్థితి సరిగా లేని స్థానిక నివాసిగా భావిస్తున్న దుండగుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. -
రష్యాపై దాడి మొదలుపెట్టిన ఉక్రెయిన్.. చమురు డిపో ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శుక్రవారంతో 37వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్, మారియుపోల్ వంటి కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు జరుపుతోంది. ఈ యుద్ధంలో రెండు దేశాల సైన్యంతో పాటు వేలాది పౌరులు అన్యాయంగా బలైపోతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయితే రష్యా కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా దురాక్రమణనుంచి తన దేశాన్నిన రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఆయన తెలిపారు. రష్యా దాడులకు ప్రతిస్పందనగా, ఉక్రెయిన్ సైన్యం తొలిసారి రష్యాపై దాడికి దిగింది. రష్యా భూభాగంలోని పశ్చిమ బెల్గోరోడ్ నగరంలోని చమురు డిపోపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు వైమానిక దాడి చేశాయని రష్యన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గోరోడ్లో శుక్రవారం ఉదయం ఈ బాంబు దాడి ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వైమానిక దాడితో భారీగా మంటలు వ్యాపించాయని, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు. 170 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. సిబ్బందిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. చదవండి: Pakistan PM: ఓ పవర్ఫుల్ దేశం భారత్‌కు అండగా ఉంది.. Video of the two Ukrainian Mi-24 helicopters striking the oil storage facility in Belgorod with rockets. https://t.co/4Lt5l1Xc3S pic.twitter.com/d5zj4GWjou — Rob Lee (@RALee85) April 1, 2022 అయితే ఈ ఘటన రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలకు ఆటంకం కలిగించవచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. చమురు డిపోపై దాడి.. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశమయ్యారు. చదవండి: Putin: మొండి పుతిన్‌కు పెరిగిన మద్దతు.. ఆదరణ! -
ఉక్రెయిన్‌కు ఊహించని షాక్.. కోలుకోలేని దెబ్బకొట్టిన పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. 25 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పుతిన్ సేనల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల కారణంగా పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రేనీయులు నిరాశ్రయులయ్యారు. తాజాగా భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లోని అజోవ్స్తాల్లో ఉన్న అతిపెద్ద ఐరన్, స్టీల్ ప్లాంట్ ధ్వంసమైంది. ఇది యూరప్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్. ఈ ఘటనలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆ దేశ ఎంపీ లీసియా వ్యాసిలెన్కో ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్టీల్ ప్లాంట్ ధ్వంసమైన కారణంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మెటిన్‌వెస్ట్ గ్రూప్‌కు చెందిన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్, ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్ అఖ్మెటోవ్ ఆధీనంలో ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి స్పందిస్తూ.. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. అయితే దాడుల వల్ల ఉక్కు పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లిందో వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పుడే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. #Mariupol #Azovstal One of the biggest metallurgic plants in #Europe destroyed. The economic losses for #Ukraine are huge. The environment is devastated #StopRussiaNOW pic.twitter.com/4GMbkYb0es — Lesia Vasylenko (@lesiavasylenko) March 19, 2022 మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్, మరియుపోల్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు మరింత విరుచుకుపడుతున్నాయి. కాగా, మరియుపోల్‌లోని ఆర్ట్ స్కూల్‌పై రష్యా దళాలు బాంబు దాడి చేశాయని, అక్కడ దాదాపు 400 మంది నివాసితులు ఆశ్రయం పొందారని సిటీ కౌన్సిల్ ఆదివారం తెలిపింది. ఈ దాడుల్లో భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద బాధితులు ఉన్నారని కౌన్సిల్ పేర్కొన్నప్పటికీ, శనివారం జరిగిన దాడిలో ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా 18 నగరాలపై రష్యా సైనం దాడులు జరుపవచ్చనే సమాచారంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. -
యుద్ధకాంక్షలో దిగజారిపోతున్న రష్యా.. పిల్లలనే కనికరం లేకుండా!
Mariupol theatre sheltering children bombed: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నానాటికీ మరింత వికృతంగా మారిపోతుంది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నిరవధిక దాడిలో ఉక్రెయిన్‌ని నేలమట్టం చేసే దిశగా రష్యా ఘోరంగా దాడి చేస్తోంది. అందులో భాగంగా ఆసుపత్రులు, నిరాశ్రయులై మానవతా కారిడార్ సాయంతో ఆశ్రయం పొందుతన్న స్థావరాలను సైతం విడిచిపెట్టకుండా భయంకరమైన దాడులకు దిగుతోంది అంతేకాదు చిన్నారుల ఆశ్రయం పొందుతున్న మారియుపోల్ థియేటర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ డ్రామా థియేటర్లో సుమారు వెయ్యి మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని మారియుపోల్ స్థానిక కౌన్సిల్ పేర్కొంది. అభంశుభం తెలియని చిన్నారులని కనికరం లేకుండా అత్యంత క్రూరమైన దాడులకు దిగుతున్న రష్యాని తాము ఎప్పటికి క్షమించమని స్థానిక కౌన్సిల్ ఆవేదనగా వెల్లడించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్‌లోని థియేటర్‌పై రష్యా దళాలు శక్తివంతమైన బాంబులతో దాడి చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఆ భవనం శిథిలాల కింద దాదాపు వెయ్యి మంది వరకు చిక్కుకుని ఉండవచ్చునని తెలిపింది. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదంటూ ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించింది. దీంతో మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్లో రష్యా దళాలచే బాంబు దాడికి ముందు డ్రామా థియేటర్ లోపల దృశ్యాలను చూపుతున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భవనంలో చాలా మంది పిల్లలు కూర్చుని ఉన్నారు. మారియుపోల్‌లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా పౌరులు మరణించినట్లు వెల్లడించింది. అదీగాక నగరంలో 13 రోజులుగా విద్యుత్, గ్యాస్ లేదా తాగు నీరు లేవు దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయని తెలిపింది. అంతేగాక రష్యా ఎందుకు మారియుపోల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందంటే మారియుపోల్ అజోవ్ సముద్రంలోని అతి ముఖ్యమైన ఉక్రెనియన్ ఓడరేవు మాత్రమే గాక ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే గనుక రష్యా చాలా కాలంగా కలలు కంటున్న క్రిమియాకు ల్యాండ్ కారిడార్ లభిస్తుందని మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్ పేర్కొంది. ‼️This is all that remains of the Drama Theater in #Mariupol According to local media, up to 1,000 people could have been inside the building. All of them are now under the rubble of the building. The exact number of casualties is still unknown. pic.twitter.com/4L3D8lt39E — NEXTA (@nexta_tv) March 16, 2022 (చదవండి: మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన) -
Uganda: ఆత్మాహుతి బాంబు దాడులు.. ముగ్గురు మృతి
కంపాలా: ఉగాండలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. రాజధాని నగరం కంపాలాలో ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, మరో 33 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. -
కాబుల్‌లో బాంబు దాడి, 19 మంది మృతి
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతం మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదలు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. చదవండి: Guinness World Records: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం -
ఎదురొడ్డి గెలిచింది.. అఫ్గాన్ టాప్‌గన్ నీలోఫర్
అది కాబుల్ 1990... రహ్మానీని ప్రసవించేందుకు ఆమె తల్లి ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో వారి పక్కింటిపై బాంబు దాడి జరిగింది. దీంతో ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుపడకపోవడంతో నీలోఫర్ రహ్మానీ ఇంట్లోనే పుట్టింది. ఆ తరువాత కొన్నిరోజులకు రహ్మానీ కుటుంబం పాకిస్తాన్‌కు వలస వెళ్లింది. అక్కడ పెరిగిన రహ్మానీకి.. తన తండ్రి తమ మాతృదేశం అఫ్గాన్ అని, 70 దశకంలో దేశంలో చోటుచేసుకున్న అనేక విషయాల గురించి చెబుతుండేవారు. ‘‘అప్పట్లో మహిళలకు చాలా స్వేచ్ఛ ఉండేది. వీధుల్లో ఎటువంటి భయం లేకుండా తిరిగేవారు. అఫ్గాన్ ఆకాశంలో రష్యన్ జెట్లు ఎగురుతుండేవి. వాటిని చూస్తూ పెరిగిన నేను ఎలాగైనా పైలట్ కావాలనుకునేవాడిని. కానీ అప్పట్లో పైలట్ అవ్వడానికి డబ్బులు లేకపోవడంతో సివిల్ ఇంజినీర్ అయ్యాను. నేను పైలట్ కాకపోయినప్పటికి నా పిల్లల్ని పైలట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాను’’ అని చెప్పారు నాన్న. ఆ విషయం రహ్మానీ మనసులో బలంగా నాటుకుపోయింది. నా మాతృదేశం కాదు... రహ్మానీ కుటుంబం పాకిస్తాన్ నుంచి తిరిగి కాబుల్‌కు 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సమయంలో తన తండ్రి చెప్పిన అప్పటి విషయాలు ఏవీ అఫ్గాన్‌లో కనిపించలేదు. మహిళలు ఎవరూ రోడ్డు మీద తిరగడంలేదు. ఒకరోజు తన చెల్లికి ఆరోగ్యం బాగోక పోవడంతో రహ్మానీ తల్లి, చెల్లెల్ని తీసుకుని హడావుడిగా ఆసుపత్రికి వెళ్లింది. ఈ కంగారులో ఆమె తన కాళ్లకు సాక్సులు వేసుకోవడం మర్చిపోయింది. దీంతో తాలిబన్ పోలీసు అధికారి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె రక్తం కారుతున్న కాళ్లతో ఇంటికి వచ్చింది. అది చూసి చలించిపోయిన రహ్మానీ ఇది నా మాతృదేశం కాదనుకుంది. తొలి మహిళా పైలట్‌గా.. రహ్మానీకి తొమిదేళ్లప్పుడు అమెరికా దళాలు అఫ్గాన్‌లో మోహరించాయి. దీంతో తరచూ జెట్ ఫ్లైట్లు తిరిగే శబ్దాలు వినపడేవి. వాటిని విని విమానం నడపాలన్న కోరిక కలిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రహ్మానీ కాబుల్‌లోని ఆఫీసర్ ట్రైనింగ్ స్కూల్లో పైలట్ కోర్సుకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు చేసినప్పటికీ అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ డాక్టర్లు పలుమార్లు ఫిజికల్లీ అన్‌ఫిట్‌గా పరిగణించి తిరస్కరించారు. అనేక ప్రయత్నాల తరువాత ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఒప్పుకోవడంతో.. పైలట్ ట్రైనింగ్‌లో చేరింది. పట్టుదలతో కష్టపడి శిక్షణ తీసుకుని 2013లో పైలట్ అయ్యింది. అఫ్గాన్ తొలి మహిళా పైలట్‌గా వార్తల్లో నిలిచి ఒక్కసారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది.. పైలట్ అయిన ఆనందం ఎక్కువకాలం నిల్వలేదు. రహ్మానీ గురించి బయటప్రపంచానికి తెలిసినప్పటినుంచే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు రావడం మొదలయ్యాయి. బెదిరింపులకు భయపడి నెలకు మూడు ఇళ్లు మారుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేవారు. అయినప్పటికీ వాళ్లకు ఫోన్‌కాల్ బెదిరింపులు, ‘మీరు ఎక్కడ నివసిస్తున్నారో మాకు తెలుసు’ అని తాలిబన్ స్టాంపు ఉన్న ఉత్తరాలు వచ్చేవి. అయినా ధైర్యంగా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తోన్న రహ్మానీని 2015లో మిచెల్ ఒబామా ‘ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో సత్కరించింది. ఇదే ఏడాది అమెరికాలో ఏడాది పాటు మిలటరీ పైలట్ శిక్షణ తీసుకుని సి–130 సర్టిఫికెట్‌ను పొందింది. దీని ద్వారా వివిధ రకాల మిలటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడిపే వీలుకలిగింది. అయితే ఈ సర్టిఫికెట్ తీసుకున్నరోజే రహ్మానీ తండ్రి ఫోన్ చేసి ఇక ఇక్కడ మేము జీవించలేమని చెప్పారు. రహ్మానీకి ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక అమెరికాలో ఆశ్రయం కల్పించమని యూఎస్‌ను ఆశ్రయించింది. జన్మ ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల అమెరికా చాలారోజులపాటు అనుమతి ఇవ్వలేదు. చివరికి ప్రముఖ వ్యక్తిగా గుర్తించి దాదాపు ఏడాది తరువాత ఆశ్రయం ఇవ్వడంతో 2018 నుంచి అమెరికాలోని టంపాలో రహ్మానీ నివసిస్తోంది. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులను ఎవరైనా అమెరికాకు తీసుకు రాకపోతారా అని ఎదురుచూస్తోంది. -
ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పన్నాగం పన్నారని విమానాశ్రయ అధికారులకు మెయిల్ వచ్చింది. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, పూర్తిగా తనిఖీలు చేశారు. అధికారులు బాంబు బెదిరింపులు అవాస్తమని తేల్చారు. పొలీసులు విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
సిరియా ఆస్పత్రిపై రాకెట్ దాడులు.. 13 మంది మృతి
బీరూట్: సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో ఉన్న అల్–షైఫా ఆస్పత్రిపై రాకెట్ బాంబులతో దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందినట్లు ఆ దేశం వెల్లడించింది. దీనిపై హతాయ్ ప్రావిన్స్ గవర్నర్ స్పందిస్తూ ఆస్పత్రిపై శనివారం రెండు రాకెట్ బాంబులతో దాడి జరిగిందని, అందులో 13 మంది మరణించడంతోపాటు 27 మంది గాయపడ్డారని ధృవీకరించారు. సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ మాత్రం మొత్తం 18 మంది మరణించినట్లు పేర్కొంది. మరణించినవారిలో ఇద్దరు మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నట్లు పేర్కొంది. దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జరీ, ప్రసూతి విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆస్పత్రిని మూసేసినట్లు తెలిపింది. కుర్దులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని 2018లో టర్కీ–సిరియా బలగాలు కలసి అదుపులోకి తీసుకున్నాయి. దీంతో కుర్దిష్‌లు అక్కడ మైనారిటీలుగా మారడంతో పాటు మిలిటెన్సీ వైపు అడుగులు వేయడంతో ప్రభుత్వానికి, కుర్దిష్‌లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుర్దులే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపిస్తుంది. కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ నేత మజ్లోమ్ అబాది ఈ ఘటనను ఖండించారు. తాము ఈ ఘటనకు పాల్పడలేదని తెలిపారు. -
బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడికి యత్నం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్పూర్‌లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జ్ ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సురేంద్ర మిథాని.. తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. (చదవండి:కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి) -
వైఎస్సార్సీపీ నేత కుటుంబంపై టీడీపీ వర్గీయుల బాంబు దాడి
కలికిరి (చిత్తూరు జిల్లా): వైఎస్సార్సీపీ నేత కుటుంబాన్ని అంతమొందించడానికి టీడీపీ వర్గీయులు నాటు బాంబులతో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఆదివారం జరిగింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రికుంటపల్లి గ్రామం వీర్లపల్లివాండ్లపల్లిలో నివసించే బీసీ వర్గానికి చెందిన మద్దిరాళ్ల మల్లికార్జున తొలి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. గత రెండు పర్యాయాలు సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. 2011లో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు అప్పట్లో మల్లికార్జున, భార్య నాగవేణి, పిల్లలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం టీడీపీ గ్రామ నాయకులు ఏకంగా బాంబుదాడికి దిగారు. ఆదివారం ఉదయం పశువులను తీసుకుని మల్లికార్జున, నాగవేణి పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో.. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వాసునూరి శ్రీదేవి, ఆమె భర్త వాసునూరి రెడ్డెయ్య, చిన్నరెడ్డెయ్య, నాగరాజు, రాచయ్య, గుండ్లపల్లి ఈశ్వరయ్య, నాగభూషణయ్య, మణికుమార్, సుమలత, శారదమ్మ తదితరులు వారిపై నాటు బాంబులతో దాడి చేశారు. ఓ బాంబు పేలి నాగవేణికి తీవ్రగాయాలవ్వడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. త్రుటిలో తప్పించుకున్న మల్లికార్జున గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దాడికి వచ్చిన వారు పరారయ్యారు. నాగవేణిని తొలుత కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లకు బలమైన దెబ్బలు తాకడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపారు. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓ నాటు బాంబును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గత నెల 13న కూడా టీడీపీ నాయకులు తమ కుటుంబంపై దాడి చేశారని, ఈ విషయమై కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశామని మల్లికార్జున చెప్పాడు. -
ఎంపీ ఇంటిపై బాంబు దాడి..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ కుటుంబీకులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ నివాసం కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఉంది. ప్రతిరోజూ వేకువ జామున ఆయన ఇంటి నుంచి కారులో బయటకు వచ్చి, సమీపంలోని క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి వ్యూహ రచన చేశారు. (కీచక ఇన్స్పెక్టర్.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..) మంగళవారం ఉదయాన్నే ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు పేల లేదు. ఇంటివద్దకు వచ్చిన కారు డ్రైవర్ బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్ బృందం రంగంలోకి దిగింది. ఎంపీ ఇంట్లో ఉన్నట్టుగా ఆగుర్తుతెలియని వ్యక్తులు భావించినట్టున్నారు. సోమవారం ఎంపీ తన కారును ఇంటి వద్దే వదలి ఢిల్లీకి బయలు దేరి వెళ్లడంతో ఈ గండం నుంచి బయటపడ్డారు. ఒక వేళ ఆ బాంబు పేలి ఉన్న పక్షంలో కారు, ఆ పరిసరాలు కొన్ని మీటర్ల దూరం మేరకు దెబ్బతిని ఉండేది. ఆ బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. (చెన్నైకు‘నివర్’ ముప్పు!) -
ఆత్మాహుతి దాడి: 13మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో కారు బాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మరణించగా, 120 మంది గాయపడిన దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పశ్చిమ అఫ్గాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రావిన్సియల్ పోలీస్ చీఫ్ ఆఫీసర్ భవనం వద్ద ఈ ఘటన జరిగింది. తాలిబాన్లకు, అఫ్గాన్ ప్రభుత్వానికి మధ్య ఖతార్‌లో మొట్టమొదటి భేటీ జరిగిన సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. (తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!) -
రౌడీ అటాక్.. హెడ్ కానిస్టేబుల్ హత్య
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఆ రౌడీ నాటుబాంబుల్ని విసరడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సాత్తాన్‌కులం లాకప్‌లో తండ్రి జయరాజ్, తనయుడు ఫిలిప్స్‌లో మరణంతో తూత్తుకుడి జిల్లా పోలీసులు తలెత్తలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసు సీఐ విచారణలో ఉంది. ఈసమయంలో తూత్తుకుడి పోలీసులు తలెత్తుకునే రీతిలో, పోలీసులపై సానుభూతి పెరిగే ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రౌడీని పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురి కావడాన్ని తూత్తుకుడి వాసులు తీవ్రంగా పరిగణించారు. నాటుబాంబు దాడి.. తూత్తుకుడి జిల్లా వెలనాడుకు చెందిన దురైముత్తుపై శ్రీవైకుంఠం, మెరప్పనాడు పోలీసు స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఇటీవల జరిగిన జంటహత్య కేసులోనూ దురైముత్తు నిందితుడు కావడంతో అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే వేటసాగిస్తూ వచ్చారు. ఎస్ఐ మురుగపెరుమాల్కు అందిన సమాచారంతో వెలనాడు అటవీ గ్రామంలో దురైముత్తు కోసం వేట మొదలెట్టారు. పోలీసుల్ని చూసిన దురైముత్తు, అతడి అనుచరులు ఉడాయించారు. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ సాహసం ప్రదర్శించాడు. అతడ్ని పట్టుకునేందుకు సినీ తరహాలో దూసుకెళ్లాడు. వెంటాడి మరీ పట్టుకునే సమయానికి దురైముత్తు ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న నాటుబాంబును సుబ్రమణ్యన్‌పై వేయడంతో అది పేలింది. తీవ్రంగా హెడ్ కానిస్టేబుల్ గాయపడడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తీవ్రంగా పరిగణన.. తీవ్రంగా గాయపడ్డ సుబ్రమణ్యన్‌ను ఆస్పత్రికి తరలించగా మరణించాడు. దీంతో ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ జయకుమార్ రంగంలోకి దిగారు. దురైముత్తును పట్టుకునేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన గురించి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐకు అందిన సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ నేతృత్వంలో నలుగురు పోలీసులు రౌడీ ముఠాను పట్టుకునేందుకు వెళ్లారని, ఈ క్రమంలో నాటుబాంబుతో ఆ రౌడీ దాడిచేసి తప్పించుకున్నాడని, కేసును తీవ్రంగా పరిగణించామన్నారు. ఆ రౌడీని పట్టుకుని తీరుతామని, కేసు విచారణలో ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి స్పందిస్తూ, ఓ రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ బలయ్యారని, ఘటన గురించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఎస్పీ జయకుమార్, కలెక్టర్ సందీప్ నండూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన శ్రీవైకుంఠం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.50 లక్షలు ప్రకటిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. -
బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్పీకి బెదిరింపు
లక్నో: ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్‌ను బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిజ్నోర్ జిల్లాకు చెందిన గఫర్‌గా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. గఫర్ కువైట్‌లో ఉండగా సాక్షి మహారాజ్‌కు ఫోన్ చేసి బాంబు పెట్టి ఆయనను చంపేస్తానని బెదిరించాడు. ఎమ్పీ పిర్యాదుతో గఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మీద సెక్షన్ 504 (శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 507 (క్రిమినల్ బెదిరింపు), ఐపీసీసెక్షన్ 66, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గఫర్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, సివిల్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
తీవ్ర ఉత్కంఠ, ప్రాణాలకు తెగించి మరీ.!
భువనేశ్వర్/బాలాసోర్ : నిందితుడిని అరెస్టు చేయబోయి పోలీసులు.. బాంబు దాడిని ఎదుర్కొన్నారు. అదృష్టవశాతు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లా రెముణా, సహదేవ్‌కుంఠొ ఠాణాల పోలీసులకు శ్యామరాయిపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పలు నేరారోపణల కింద నిందితుడు ఈశ్వర్ మహాలిక్‌ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇంటిలో నుంచి నిందితుడు పోలీసుల పైకి ఇటుకలు, 3 బాంబులు రువ్వాడు. అయితే అంతా సురక్షితంగా ఉండడం అదృష్టకరం. 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ పోలీసుల పైకి మరిగిన నూనె విసిరి, పరుగులు తీయించాడు. ( మరో జాతి వారింట్లో విందు భోజనం చేశారని..) 5 గంటలకు పైగా.. ఈశ్వర మహాలిక్‌ని అరెస్టు చేసేందుకు రెండు ఠాణాల పోలీసులు దాదాపు 5 గంటలపాటు నిర్వరామంగా శ్రమించారు. ఎట్టకేలకు ప్రాణాలను పణంగా పెట్టి, అరెస్టు చేయగలిగారు. పోలీసులు రాక గుర్తించిన నిందితుడు.. తొలుత ఇంట్లో నుంచి రాళ్లు, సీసాలను రువ్వి బెదిరించాడు. బెదిరింపులకు లెక్క చేయకుండా పోలీసులు ఇంటిని చుట్టు ముట్టడంతో బాంబులు రువ్వి హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. 3 బాంబుల్లో ఒకటి మాత్రమే పేలింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పోలీసులు.. సురక్షితంగా నిలిచి నిందితుడిని అరెస్టు చేశారు. ( నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో) -
లండన్ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే
లండన్: లండన్‌లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు. -
భారత్ మళ్లీ దాడి చేయాలని చూస్తోంది
ఇస్లామాబాద్: ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీల మధ్య పాక్‌పై దాడి చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందంటూ నిఘా వర్గాల సమాచారం అందిందని పాక్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్ జరిపిన బాంబు దాడిపై అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాక్ మంత్రి ప్రకటనను భారత్ ఖండించింది. ఈ ప్రాంతంలో యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘పాక్ మంత్రి చేసిన బాధ్యతారహిత, అవమానకర ప్రకటన. యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశం. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలంటూ అక్కడి ఉగ్ర సంస్థలకు పిలుపునిచ్చేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తోంది’ అని భారత్ ప్రకటించింది. -
టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి సీసీటీవీ ఫుటేజ్
-
బాంబు దాడి కేసులో..నిందితుల అరెస్ట్
బరంపురం : లంజిపల్లిలో రెండు రోజుల క్రితం జరి గిన బాంబుల దాడి సంఘటనలో 6గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్పీ పినాకి మిశ్రా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ 8వతేదీ రాత్రి 10 గంటల సమయంలో బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి లంజిపల్లి డిప్పవీధిలో నివాసముంటున్న ప్రశాంత్ భిశాయి, ఆయన అనుచరులు వస్తున్న కారుపై బాంబులతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి 6గురు దుండగులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని రాధాకృష్ణ సాహు, దీపక్ నాయక్, ప్రతీక్ దోళాయి, శివకుమార్ గొంతాయత్, గోవింద నాయక్, రామకృష్ణ జెనాలుగా గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ బాంబు దాడులకు పాతకక్షలే కారమణమని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి బాంబుల దాడికి ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ దాడుల వెనుక ఎవరున్నది దర్యాప్తు పూర్తయిన వెంటనే తెలియవలసి ఉందని ఎస్పీ పినాకి మిశ్రా చెప్పారు. -
జింబాబ్వే అధ్యక్షుడిపై హత్యాయత్నం
బులవాయో: జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) బాంబు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం బులవాయోలో జరిగిన అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్)పార్టీ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దేశ ఉపాధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలు, ప్రజలు గాయపడ్డారు. ప్రసంగం ముగిసిన అనంతరం అధ్యక్షుడు మునగాగ్వా వేదిక దిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు కెమో మొహాది, జాను–పీఎఫ్ ఉపాధ్యక్షురాలు, క్యాబినెట్ మంత్రి ఒప్పా ముచింగురి–కషిరి, పార్టీ కార్యదర్శి ఎంగెల్బర్ట్ రుగెజె గాయపడ్డారని అధికార మీడియా తెలిపింది. అధ్యక్షుడు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందనీ, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి ఒబెర్ట్ ముఫొఫు తెలిపారు. ఘటన అనంతరం అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. జూలై 30వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు గాను అధ్యక్షుడు శనివారం బులవాయోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఇథియోపియా ప్రధానిపై కూడా.. అడిస్‌అబాబా: ఇథియోపియా ప్రధాని శనివారం గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు. సంస్కరణల వాదిగా పేరున్న ప్రధాని అబియ్ అహ్మద్(42) శనివారం రాజధాని అడిస్అబాబాలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆయన్ను వెంటనే భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 83మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. ప్రజలను విడదీయటానికి జరిగే ప్రయత్నం విజయవంతం కాబోదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో అధికార పగ్గాలు చేపట్టిన అహ్మద్.. జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కంపెనీల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరిచారు. -
భారత రెస్టారెంట్‌పై బాంబుదాడి
టొరంటో: కెనడాలోని ఓ భారతీయ రెస్టారెంట్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బాంబుదాడికి పాల్పడ్డారు. ఒంటారియో ప్రావిన్సులోని మిస్సిస్వాగాలో ‘బాంబే భేల్’ రెస్టారెంట్లో శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు భారత సంతతి కెనడియన్లుసహా 15 మందికి గాయాలయ్యాయి. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు పెయింట్ క్యాన్ లేదా బకెట్ పరిమాణంలో ఉన్న ఐఈడీ బాంబుతో రెస్టారెంట్లోకి వచ్చారు. అనంతరం దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. వీరువెళ్లిన కొద్దిసేపటికే శక్తిమంతమైన పేలుడు సంభవించింది. దుండగుల కోసం పోలీసులు భారీస్థాయిలో గాలింపు చేపట్టారు. ఇది ఉగ్రదాడా? లేక విద్వేషపూరిత దాడా? అన్నది ఇప్పుడే ఏం చెప్పలేమని పోలీసులు అన్నారు. కెనడాలో ఆరో అతిపెద్ద నగరమైన మిస్సిస్వాగాలో 7 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో భారత్ నుంచి వలసవెళ్లినవారి సంఖ్య గణనీయంగా ఉంది. టొరంటోలోని భారత కాన్సుల్‌తో పాటు కెనడాలోని భారత హైకమిషనర్ నుంచి ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. అధికారులు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారన్నారు. -
సిరియాలో బాంబు దాడి: 37 మంది సజీవ దహనం
-
సిరియాలో నరమేధం: 37 మంది సజీవ దహనం
తూర్ఫు ఘౌటా, సిరియా : సిరియా ప్రభుత్వ బలగాలు, రష్యన్ దళాలు తూర్పు ఘౌటాలో నరమేధానికి తెర తీశాయి. ఉగ్రవాద శక్తుల అణచివేతకు యత్నిస్తున్నామంటూ సిరియా బలగాలు తూర్పు ఘౌటాలో చేసిన బాంబు దాడిలో బంకర్ పేలి 37 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాంబు దాడి అనంతరం ఘటన స్థలిలో ప్రాణాలు కోల్పోయిన వారి దేహాలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. సిరియా పౌర రక్షణ దళం( కొందరు సాధారణ పౌరులు కలసి ఏర్పరచుకున్నారు) హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేసింది. (బాంబుల వర్షం కురిపిస్తున్న సిరియా వాయుసేన ఫొటోలో) ఘటనకు సంబంధించిన ఫొటోలను సిరియా పౌర రక్షణ దళం మీడియాకు విడుదల చేసింది. పూర్తిగా తగలబడిపోయిన శరీరాలతో కనిపిస్తున్న ఫొటోలు సిరియాలో వాస్తవాలను ప్రపంచానికి మరోసారి చూపిస్తున్నాయి. ఈ దాడిలో గాయపడిన వారికి తీవ్రగాయాలు అయినట్లు సిరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అంతర్జాతీయంగా నిషేధించిన వైట్ ఫాస్పరస్ బాంబును ఈ దాడిలో సిరియా వాయుసేన వినియోగించిందని రిపోర్టులు చెబుతున్నాయి. కాగా, తమ దన్నుతో ఈ దాడి జరగలేదని తూర్పు ఘౌటా ఘటనపై రష్యా వివరణ ఇచ్చుకుంది. 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ 3,50,000 మంది మరణించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య అధికారిక లెక్కల్లో తప్పుగా ఉందని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు మరణించారని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. బాంబుల దాడిలో గాయపడిన సిరియా పౌరులు -
కోయంబత్తూర్‌లో బీజేపీ ఆఫీసుపై బాంబు దాడి
-
నటుడు, డీఎంకే నేత ఇంటిపై బాంబుదాడి
సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, డీఎంకే నేత రాధా రవి ఇంటిపై సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ (55) గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన తమిళనాడు డీఎంకే నేతలలో కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కంచీపురంలోని డీఎంకే నేత రవి ఇంటిపై దాడికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్‌పై రవి ఇంటికి రాగా, మూడో నిందితుడు ఇంటి చుట్టుపక్కల వారి కదలికలను గమనించాడు. స్కూటర్ దిగిన ఇద్దరు వ్యక్తులు రాధా రవి ఇంటి ఆవరణలోకి చొరబడి క్రూడ్ బాంబులను విసిరారు. ఓ బాంబును ఇంటి ముందు విసిరిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల బాంబు దాడిలో నటుడు రవి సోదరుడు కుమార్ (55) గాయపడగా, చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
సోమశిల ఘటనకు 24ఏళ్లు..
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి రాష్ట్రంలోనే పెనుసంచలనం సృష్టించిన సోమశిల మందుపాతర దాడి ఘటనకు నేటితో 24ఏళ్లు పూర్తవుతున్నాయి. అప్పట్లో నల్లమల పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలో 14 నవంబర్ 1993న మావోయిస్టులు (అప్పటి పీపుల్స్‌వార్) కొల్లాపూర్ మండలం సోమశిలలో ఓ అతిథి గృహానికి నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఓ ప్రైవేట్ బస్సులో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశీనాయుడుతో పాటు ఎస్సైలు శివప్రసాద్, టి.కిషోర్, ఏఆర్ హెచ్‌సీ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు వై.వీ.ఎన్ ప్రసాద్, జయరాములు, షేక్ హైదర్, ఎస్.సుభాన్, జోహెబ్ ఎక్బాల్ సోమశిలకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్న క్రమంలో కొల్లాపూర్–సోమశిల మధ్య ఘాట్ రోడ్డులో బస్సును పేల్చారు. ఈ ఘటనలో కొందరు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు కాళ్లు తెగిపోయి తీవ్రంగా గాయపడినప్పటికీ ఎస్పీ పరదేశీనాయుడు, ఇతర సిబ్బంది విరోచితంగా కాల్పులు జరిపి మావోయిస్టులను ఎదుర్కొన్నారు. దీంతో బస్సులో భారీ స్థాయిలో పోలీసు శాఖకు సంబంధించిన ఆయుధాలను వారికి చిక్కకుండా కాపాడారు. అయితే, ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత ఎస్పీ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆయనతో పాటు 9మంది వీరమరణం పొందారు. అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి మృతి చెందడం అదే తొలిసారి. నేడు వర్ధంతి సభ మావోయిస్టుల కాల్పులలో వీరమరణం పొంది న పరదేశినాయుడు వర్ధంతిని మంగళవారం నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ బి.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు పట్టణంలోని వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశినాయుడు విగ్రహం వద్ద సాయుధ బలగాలు నివాళులర్పించే కార్యక్ర మం ఉంటుందని పేర్కొన్నారు. -
రాజ్యసభ ఎంపీపై బాంబుదాడి
భగల్పూర్: బిహార్‌కు చెందిన మహిళా ఎంపీ కహకషాన్ పర్వీన్‌పై బాంబుదాడి జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషయమై కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై దుండగులు బాంబు వేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో పర్వీన్ తృటిలో తప్పించుకోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని భగల్పూర్ ఎస్ఎస్పీ మనోజ్ కుమార్ చెప్పారు. జేడీ(యూ) పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తోన్న కహకషాన్ పర్వీన్ భగల్పూర్లోని తన నివాసంలో మాట్లాడుతుండగా, రాత్రి 7:30 గంటలకు కరెంట్ పోయింది. ఇదే అదనుగా భావించి దుండగులు ఆమెపైకి బాంబులు విసిరారు. అయితే అవికాస్తా కొద్దిగా దూరంలో పడటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ఆరుగురిలో ఎంపీ పర్వీన్ తండ్రి కూడా ఉన్నారు. భూతగాదాల కారణంగానే బాంబుదాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
మిజో గుండెపై బాంబుల వర్షం
మిజోరాం దేశ రాష్ట్రాల్లో ఒకటిగా అందరికీ తెలుసు. కానీ, మిజోరాం సొంత రాష్ట్రంగా ఏర్పడటానికి చేసిన ప్రయత్నాల గురించి.. తిన్న ఎదురుదెబ్బల గురించి మాత్రం కొందరికే తెలుసు. సొంత ప్రభుత్వంతో తన గుండెలపై బాంబుల వర్షం కురిపించుకున్న తొలి రాష్ట్రం మిజోరాం. అవును. మిజోరాంపై భారత ప్రభుత్వం బాంబుల వర్షం కురిపించింది. ఆ విషయాన్ని బయటకు రానికుండా ఎన్నో గొంతులు నులిమేసింది. అయినా నిజం ఎన్నటికీ చావదు. అందుకే ఆనాటి ప్రభుత్వ చర్య భవిష్యత్తు తరాలకు తెలియాలని కొందరు తమ పుస్తకాల్లో రాశారు. 1961లో అసోం నుంచి మిజోరాంను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మిజో నేషనల్ ఫ్రంట్ అక్టోబర్ 28, 1961న ఏర్పడింది. తొలుత రాజకీయ అవసరాలను నేరవేర్చుకునేందుకు ఉద్యమం ప్రశాంతంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర బలగాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ చేసిన ప్రయత్నాలు మిజో ప్రజలను విచక్షణ కోల్పోయేలా చేశాయి. దాంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆయుధాలను చేత పట్టింది. బలగాలను మిజోరాం నుంచి పంపేయాలనే ఉద్దేశంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆపరేషన్ జెరికోను ప్రారంభించింది. ఐజ్వాల్, లుంగ్లేయ్ల్లోని అస్సాం రైఫిల్స్‌కు చెందిన స్ధావరాలపై వరుస దాడులు నిర్వహించింది. ఆ మరుసటి రోజు మిజో నేషనల్ ఫ్రంట్ భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడినట్లు ప్రకటించుకుంది. ఆపరేషన్ జెరికోతో భారత ప్రభుత్వం, భద్రతా దళాలు షాక్‌కు గురయ్యాయి. మిజో నేషనల్ ఫ్రంట్ దెబ్బకు భద్రతా దళాలు ఐజ్వాల్, లుంగ్లేయ్లలో పూర్తిగా పట్టుకోల్పోయాయి. ఆయుధ కర్మాగారాలు, ఐజ్వాల్ కోశాగారం మిజోల చేతిలోకి వెళ్లిపోయాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఐజ్వాల్‌పై బాంబు దాడి చేయాలని ఆదేశించింది. క్షణాల్లో ఐజ్వాల్‌కు చేరువలో ఉన్న ఎయిర్‌బేస్‌ల నుంచి నాలుగు యుద్ధవిమానాలు ఐజ్వాల్‌పై దాడి చేశాయి. తొలుత బుల్లెట్ల వర్షం కురిపించిన విమానాలు.. కొద్ది క్షణాల తర్వాత బాంబుల వర్షం కురిపించాయి. దాంతో ఐజ్వాల్‌లో పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భయభ్రాంతులకు గురైన మిజో ప్రజలు పట్టణం నుంచి కొండ ప్రాంతాలకు పారిపోయారు. మార్చి 13వ తేదీ వరకూ ఎయిర్‌ఫోర్స్ ఐజ్వాల్‌పై దాడులు నిర్వహించింది. రెబెల్స్‌లో కొందరు తలదాచుకోవడానికి మయన్మార్ అడవులకు, మరికొందరు అప్పటి తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)కు పారిపోయారు. ఎయిర్‌ఫోర్స్ దాడులను గుర్తు చేసుకున్న ఓ మిజో నేషనల్ ఫ్రంట్ వెటరన్.. ప్రభుత్వం బాంబు దాడులకు దిగుతుందని తాము కలలో కూడా ఊహించలేదని చెప్పారు. నలువైపుల నుంచి వచ్చిన జెట్లు తమపై బాంబుల వర్షం కురిపించాయని.. అదృష్టవశాత్తు ఆ ఘటనలో 13మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రభుత్వం మిజోరాం గుండెపై దెబ్బకొట్టినా.. మిజో వాసుల ఆశయాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయిందని గద్గద స్వరంతో తెలిపారు. ఐజ్వాల్ దాని దగ్గరి జిల్లాలపై ప్రభుత్వం బాంబు దాడులు జరిపి ఈ నెల 5వ తేదీతో 50 ఏళ్లు పూర్తయ్యాయి. -
బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి
కోల్‌కతా: ఓ బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇల్లు బీజేపీ నేత కృష్ణ భట్టాచార్యది చెబుతున్నారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కోల్‌కతాలోని ఉత్తర్‌పురా ప్రాంతంలోగల భట్టాచార్య ఇంటిపై బాంబు దాడి జరిగిందని, అంతకుముందు జరిగిన పరిణామాల కారణంగానే టీఎంసీ నేతలు ప్రతిగా ఈ దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తున్నారు. ఓ చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి మరో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం తొలుత ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి కూడా చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చర్యను సీఎం మమతా బెనర్జీ కూడా ఖండించారు. పెద్దనోట్ల రద్దును తాను, తమ పార్టీ నేతలు బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. మొన్నటి వరకు నోట్లను బంధించిన మోదీ ఇప్పుడు తమ పార్టీని బంధించాలని అనుకుంటున్నారని అది మాత్రం ఆయనకు సాధ్యం కాదని మండిపడ్డారు. -
ఎంపీ పార్లమెంట్‌కు వెళ్తుండగా బాంబు దాడి
కాబూల్: ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం శక్తివంతమైన బాంబుపేలుడు సంభవించింది. పార్లమెంట్‌కు వెళ్తున్న ఓ ఎంపీని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. బమియన్ ఎంపీ ఫకురి బహిస్తిని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగినట్లు టోటో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఎంపీ కాన్వాయ్కి సమీపంలో బాంబు పేలుడు జరగడంతో బాడీగార్డు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించడానికి నిరాకరించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి.. బాంబు దాడిలో కొంత నష్టం జరిగిందని మాత్రం తెలిపారు. గతవారం సైతం ఓ పార్లమెంట్ మెంబర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. -
డీఎండీకే నేత ఇంటిపై బాంబు దాడి
టీనగర్(చెన్నై): పెరంబుదూరు సమీపంలో డీఎండీకే నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బాంబు దాడికి పాల్పడిన ముఠా కోసం గాలిస్తున్నారు. పెరంబుదూరు సమీపంలోని తండలంలో డీఎండీకే నేత శశికుమార్ నివసిస్తున్నారు. ఇతడు తండలం పంచాయతీ ఉపాధ్యక్షునిగా, డీఎండీకే యూనియన్ నిర్వాహకునిగా ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శశికుమార్ ఇంటిపై నాటు బాంబులు విసిరి పరారయ్యారు. అదృష్టవశాత్తు బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. కాగా శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇష్టంలేని వర్గం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబులు విసిరిన ముఠా కోసం గాలిస్తున్నారు. -
కిర్గిస్థాన్‌లో బాంబు పేలుడు
-
చిరునవ్వులు చిందే చిన్నారి మోము..
బాగ్దాద్ : ఉగ్రపంజా దెబ్బకు రక్తంచిందిన విషాద ఘటనకు సజీవ సాక్ష్యమీ చిత్రం. ఫొటోలోని అమ్మాయి పేరు అషాల్ అహ్మద్. వయసు నాలుగేళ్లు. జూలై 3న బాగ్దాద్‌లో దుకాణసముదాయంపై ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 200మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అషాల్కు, ఆమె తల్లికి కాలిన గాయాలయ్యాయి. కాస్తంత కోలుకున్న అషాల్ ఆదివారం అదే ప్రాంతానికి తండ్రితో కలసి వచ్చినపుడు తీసిన ఫొటో ఇది. -
విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై బాంబులతో దాడి
తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు బుచ్చియ్యపేట: విశాఖ డెయిరీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నాటు బాంబులతో దాడి చేశారు. విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆదివారం నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంటికొర్లాం పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలు సమయంలో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు వేసి అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆయనను స్థానికులు రావికమతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దాడి విషయం తెలుసుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలే కారణమా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు. -
బాంబు దాడుల్లో 36 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దద్ మంగళవారం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడుల్లో 36 మంది మృతి చెందగా మరో 100 మంది గాయపడ్డారు. మొదట షాబ్ జిల్లాలోని రద్దీగా ఉన్న ఓ మార్కెట్ వద్ద పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో క్షతగాత్రలకు సహాయం చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని మరోసారి దాడులకు పాల్పడటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. సహాయక సిబ్బందికి సమీపంలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాగ్దాద్ ఆపరేషన్ కమాండ్(బీఓసీ) వెల్లడించింది. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఆత్మాహుతి దాడికి పాల్పడింది మహిళ కాదని ఐఎస్ తన ప్రకటనలో తెలిపింది. దక్షిణ ఇరాక్‌లో ఆదివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో దాదాపు 33 మంది దుర్మరణం చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
బెల్జియం ప్రజల స్ఫూర్తికి వందనం
మూడు దేశాల పర్యటన నేపథ్యంలో మోదీ న్యూఢిల్లీ/వాషింగ్టన్: ‘బ్రసెల్స్‌లో భయంకరమైన బాంబు దాడి నుంచి కోలుకున్న బెల్జియం ప్రజల స్ఫూర్తికి వందనం. వారి మనోధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. భారత్ వారికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. మూడు దేశాల పర్యటన నిమిత్తం మోదీ మంగళవారం రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. బ్రసెల్స్‌లో జరిగే 13వ భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్కు వెళ్తారు. ఈనెల 31, ఏప్రిల్ 1న అక్కడ జరిగే ‘అణు భద్రతా సదస్సు’లో పాల్గొంటారు. అనంతరం సౌదీ అరేబియాకు వెళ్తారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో పర్యటన సాగుతుంది. రెండేళ్ల వ్యవధిలోనే మూడోసారి అమెరికా వస్తున్న మోదీ పర్యటన ఆహ్వానించతగ్గ పరిణామమని భారత రాయబారి అరుణ్ కె సింగ్ అన్నారు. మూడు దశాబ్దాల కిందట ఇలాంటి పరిణామం కనీసం ఊహించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విడి అణు పదార్థాల భద్రతకే అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని వైట్‌హౌస్ ప్రకటించింది. -
లిబియాలో బాంబు దాడి; 50 మంది మృతి
ట్రిపోలి: సంక్షుభిత లిబియాలో మారణహోమం కొనసాగుతూనే వుంది. పశ్చిమ లిబియాలోని జ్లిటెన్ నగరంలో జరిగిన బాంబు దాడిలో కనీసం 50 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అల్- జహఫాల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ట్రక్కులో నింపిన బాంబులతో ఈ దాడికి పాల్పడ్డారు. పేలుడు శబ్ధం దాదాపు 60 కిలోమీటర్ల వరకు వినబడిందని వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి జరిగిందని లిబియాలోని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మార్టిన్ కొబ్లర్ తెలిపారు. గాయపడిన వారిని ట్రిపోలి, మిశ్రతా ఆస్పత్రులకు తరలించినట్టు లిబియా ప్రసారమాధ్యమాలు తెలిపాయి. గడాఫీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అల్- జహఫాల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ మిలటరీ బేస్ గా కొనసాగింది. -
మంత్రి కాన్వాయ్ పై బాంబు దాడి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో జరిగిన బాంబుదాడిలో మంత్రి తృటిలో తప్పించుకున్నారు. గృహ మంత్రి అక్రం కాన్ దురానీ టార్గెట్ గా గురువారం సాయంత్రం నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లో జరిగిన ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. తన స్వగ్రామానికి వెళుతుండగా మంత్రి కాన్వాయ్ మార్గంలో బాంబులుపేల్చడం ద్వారా మంత్రిని హతమార్చాలని పథకం వేశారు. ఈ క్రమంలో వారు అమర్చిన బాంబులు ఒక్కసారిగా పేలాయి. కానీ, అదృష్టవశాత్తూ అక్రం బతికి బయటపడ్డారు. అయితే స్తానికంగా బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 7 కిలోల పరిమాణంలో పేలుడు పదార్థాలను రోడ్డు పక్కన అమర్చి రిమోట్‌తో పేల్చి వేసినట్టు భద్రతా వర్గాలు ప్రకటించాయి. ఈ దాడికి బాధ్యత తమది అని ఏ గ్రూపు ప్రకటించలేదని తెలిపాయి. పాకిస్తాన్ అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
పోలీస్‌వాహనంలో బాంబు పేలుడు : ఇద్దరికి గాయాలు
కైరో : ఈజిప్టు రాజధాని కైరో నగరంలోని పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో పోలీసు కూడా ఉన్నాడని చెప్పారు. నగరంలోని అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం అజబాకియా పోలీస్ స్టేషన్ ఒకటి. అయితే గత రాత్రి స్టేషన్లో పోలీస్ వాహనాలు నిలిపి ఉంచే ప్రాంతంలో ఓ వాహనానికి తీవ్రవాదులు బాంబు అమర్చారని ఉన్నతాధికారి తెలిపారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో తీవ్రవాదులు మరిన్ని బాంబులు అమర్చి ఉంటారని... వాటి కోసం శోధిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 2011 నాటి నుంచి ఈజిప్ట్‌లో చోటు చేసుకున్న విధ్వంసం కారణంగా 600 మంది భద్రత సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. -
బాంబు దాడిలో 12 మంది పోలీసుల మృతి
అంకారా: ఓ మినిబస్సుపై జరిగిన బాంబు దాడిలో సుమారు 12 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు టర్కీలో చోటుచేసుకుంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ వర్గం వారే ఇందుకు బాధ్యులని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇగ్డిర్ ప్రాంతంలో దిలుకు సరిహద్దు గేటు వద్ద మినిబస్సుపై బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 12 మంది పోలీసులు మృతిచెందారు. దీని నుంచి తేరుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంపై టర్కీ వాయుసేన బలగం ఎదురుదాడికి దిగి సుమారు 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు ఓ అధికారి తెలిపారు. కుర్దిష్ ఆధిక్యం ఉన్న తూర్పు టర్కీ ప్రాంతంలో మిలిటెంట్లు గత వారం జరిపిన దాడులలో 16 మంది సైనికులు అమరులైన విషయం విదితమే. -
ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ ఉత్తర ప్రావిన్స్ ఫర్యాబ్‌లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మరణించారని... మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. అల్మర్ జిల్లాలో మార్కెట్ వద్ద ఈ రోజు ఉదయం ఈ దాడి చోటు చేసుకుందని వివరించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారని పేర్కొంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని మీడియా పేర్కొంది. -
కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భద్రత దళాలు వెల్లడించాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని... దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రత దళాలు పేర్కొన్నాయి. ఈ బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. బాంబు పేలుడుతో ఖాన్ బని సాద్ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిందని చెప్పారు. రంజాన్ పండగ సమీపించడంతో మార్కెట్ ప్రాంతమంతా జనాలతో నిండి ఉందని తెలిపారు. మార్కెట్లోని ట్రక్‌లో బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పారు. -
పోలీసులపై మావోయిస్టుల బాంబు దాడి
దుమ్ముగూడెం(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని కుంట బ్లాక్ పరిధి ధర్మపేట బేస్‌క్యాంపు వద్ద మావోయిస్టులు శుక్రవారం పోలీసులపై దాడి చేసే యత్నంలో ప్రెషర్ బాంబును పేల్చడంతో పాటు, కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఓ జవాన్ అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు దండకారణ్యంలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం ధర్మపేట బేస్‌క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ బేస్‌క్యాంపు సమీపంలో ఉన్న వాగు వద్ద నెలరోజులుగా పోలీసులు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణాన్ని మావోయిస్టులు వ్యతిరేకించడంతో పాటు పనులను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రెషర్ బాంబులు, మందుపాతరలు, భూమి టాప్స్ అమర్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వాగువద్ద మాటు వేసిన మావోయిస్టులు అటుగా వస్తున్న పోలీసులను గమనించి ప్రెషర్ బాంబు పేల్చారు. పోలీసులు తేరుకునే లోపే మావోయిస్టులు వారిపై కాల్పులు కూడా జరపడంతో అజయ్‌కాక(35) అనే ఆర్మ్డ్ కానిస్టేబుల్ చనిపోయాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని హెలీకాఫ్టర్లో జగ్దల్పూర్ తరలించారు. ఈ ఘటనతో బేస్‌క్యాంపు దగ్గరగా ఉన్న జిల్లాలోని దుమ్ముగూడెం మండలం వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు. కూంబింగ్ చేపట్టారు. -
న్యాయమంత్రిత్వశాఖ లక్ష్యంగా బాంబుదాడి
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఏకంగా ప్రభుత్వానికి చెందిన ఉన్నత వ్యక్తుల కార్యాలయాలే లక్ష్యంగా బాంబుదాడి జరిపారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మంగళవారం కాబూల్‌లోని న్యాయమంత్రిత్వశాఖకు చెందిన పార్కింగ్ ప్రాంతాన్ని ఎంచుకొని ఉగ్రవాదులు బాంబులు అమర్చి వాటిని పేల్చివేశారు. దీంతో విధులకు హాజరైన పలువురు ప్రభుత్వాధికారులు గాయాలతో రక్తసిక్తమవ్వగా.. ఐదుగురు మృతిచెందారు. గతవారం రోజుల్లో ఇది రెండో అతిపెద్ద సంఘటన. ఈ ఘటన మరోసారి భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ దేశంలో న్యాయవ్యవస్థలో పనిచేసే ముఖ్య అధికారులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్ ఉగ్రవాదులు ఈ చర్యకుపాల్పడ్డారని చెప్పారు. -
ఉలిక్కిపడ్డ మీడియా
రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్‌పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో కొన్ని హిందూ సంఘాలు తమ ఉనికిని చాటుకునే పనిలో పడ్డాయి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ కొన్ని సంఘాలు పనిచేస్తుంటే, మరికొన్ని సంఘాలు వివాదాలతో ముందుకు సాగే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మహిళా దినోత్స వం సందర్భంగా పుదియ తలమురై న్యూస్ చానల్ ‘పసుపు తాడు..తాళి బొట్టు’ విలువను ఎత్తి చూపుతూ ప్రత్యేక కథనానికి నిర్ణయించింది. ఆ చానల్ ప్రసారం చేస్తున్న ప్రొమో, కర్టన్ రైజర్‌ను చూసిన కొన్ని హిందూ సంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్రసారం నిలుపుదల చేయడానికి ఆ చానల్ నిర్ణయించింది. అయితే, ఎక్కడ ఆ కథనం ప్రసారం అవుతుందోనన్న ఆగ్రహంతో గిండిలోని ఆ చానల్ కార్యాలయంపై దాడి జరిగింది. మహిళా దినోత్సవం రోజున మహిళా జర్నలిస్టుపై, ఓ కెమెరా మెన్‌పై ఆ మూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసులు సైతం మెతక వైఖరి అనుసరించారన్న విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మరువక ముందే, అదే చానల్ కార్యాలయంలో గురువారం వేకువ జామును టిఫిన్ బాక్సులలో అమర్చిన బాంబులతో దాడి జరగడం రాష్ర్టంలోని మీడియా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వేకువ జామున మూడు గంటల సమయంలో రెండు మోటార్ బైక్‌ల మీద వచ్చిన నలుగురు వ్యక్తులు కాసేపు ఆ మీడియా చానల్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో చక్కర్లు కొట్టారు. వెళ్తూ...వెళ్తూ ఆ చానల్ కార్యాలయం సమీపంలోని ఓ చెట్టు కింద ఆగి అక్కడి నుంచి టిఫిన్ బాక్స్ బాంబుల్సి విసిరి ఉడాయించారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఒక్క సారిగా పెద్ద శబ్ధంతో రెండు బాంబులు పేలడంతో అక్కడి సిబ్బందితో పాటుగా,ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. బాంబులు పేలిన శబ్దం రావడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. అయితే, ఈ పేలుళ్లలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాడి సమాచారంతో గిండి పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ టీవీ చానల్ పరిసరాల్లోని నిఘా కెమెరాలతో పాటుగా ఆ మార్గంలో ఉన్న మరికొన్ని సంస్థలకు చెందిన నిఘా కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఆ చానల్ కార్యాలయం పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. టిఫిన్ బాక్సు రూపంలో బాంబులు రెండింటిని పేల్చడంతో మీడియా వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇలాంటి దాడి జరగడంతో, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఈ దాడి తన సేనలతో తానే చేయించానంటూ హిందూ యువజన సేన నాయకుడు జయం పాండియన్ మదురై కోర్టులో లొంగిపోయాడు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, టీఎంసీ అధ్యక్షుడు జికే వాసన్, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణిలతో పాటుగా పలు ప్రజా సంఘాల నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మీడియా సంఘాల నేతృత్వంలో నిరసలనకు నిర్ణయించారు. అలాగే, సీపీఎం, సీపీఐల నేతృత్వంలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. -
బంగ్లా ప్రధానిపై బాంబు దాడి: తృటిలో తప్పిన ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై శనివారం బాంబు దాడి జరిగింది. ఆ బాంబు దాడి నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఢాకాలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ ద్వారా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాత అక్కడ బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971 లో చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని పురస్కరించుకుని అధికార పార్టీ అవామీ లీగ్ ఏర్పాటు చేసిన ర్యాలీకి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. గత జనవరి 5 వ తేదీన ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ, దాని మిత్రపక్షాలు నిరసన బాటపట్టిన సంగతి తెలిసిందే.అప్పట్నుంచి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. గత రెండు నెలల నుంచి బంగ్లాలో జరిగిన బాంబు దాడుల్లో 100 వరకూ అసువులు బాసారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై బాంబుదాడి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ నాయకులపై తెలుగుదేశం నేతలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నారుు. మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన లింగారెడ్డి వెంకటరామిరెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పాపాయపాలెం గ్రామానికి చెందిన 14 మంది సత్తెనపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనంపై టీడీపీ గ్రామ నేతలు, కార్యకర్తలు బాంబుల వర్షం కురిపించారు. దీంతో వారు వాహనాన్ని అతివేగంగా గ్రామంలోకి తీసుకెళ్లారు. ప్రత్యర్థులు బాంబులు విసురుతూ వెంబడించారు. గ్రామంలో ప్రజలు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఈ దాడిలో వాహనంపై ఐదు బాంబులు, రోడ్డుపై ఒక బాంబు పడ్డాయి. వాహనం అద్దాలు పగిలి గుచ్చుకోవడంతో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మర్రి అచ్చిరెడ్డి, వాహనాన్ని నడుపుతున్న రఫీ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లునాయక్, పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, బెల్లంకొండ ఎస్ఐ మురళి, మాచవరం ఎస్ఐ హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్లో పార్టీ అధినేత జగన్ పరామర్శ విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పాపాయపాలెంలో బాంబుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికివస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజాసంక్షేమం మరచి ఇలాంటి దుశ్చర్యలకు దిగడం సరికాదన్నారు. తమ సమస్యల్ని బాధితులు, గ్రామస్తులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చేత బాధితులతో ఫోన్లో మాట్లాడించారు. ఎంపీటీసీ సభ్యుడు వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ మర్రి ప్రసాదరెడ్డి తమ సమస్యలను జగన్మోహన్రెడ్డికి వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడి అక్రమ అరెస్టు వైఎస్సార్ సీపీ నేతలు, ఎమ్మెల్యేల నిరసన పిడుగురాళ్ల: అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌కు అడ్డుతగులుతున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీకి చెందిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డిపై అక్రమ కేసులు బనారుుంచి అరెస్టు చేరుుంచిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి తదితరులు గురువారం పిడుగురాళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్లోను, జైలువద్ద ధర్నా చేశారు. బాంబుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాలో బాంబుల విష సంస్కృతిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాపాయపాళెం గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ వారు బాంబుదాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బాంబు దాడి
-
పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసు:నలుగురి ఉరితీత
ఇస్లామాబాద్:పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసులో నలుగురి నిందితుల్ని ఆదివారం ఉరితీశారు. ఉరిశిక్ష అమలులో భాగంగా ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ శిక్ష అనుభవిస్తున్నఆ నిందితుల్ని శనివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఉబర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి మరియ రష్యా వాసి అక్విలేక్యూ అహ్మద్ ల నిందితులుగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిందితులను ఉరితీసే క్రమంలో కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం జిల్లా జైలు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని ఉరితీసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోట్ లాక్ పేట్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దర్ని ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఇద్దరి నిందితుల్ని మరో ఒకటి రెండు రోజుల్లో ఉరితీసే అవకాశం ఉంది. -
బాంబు పేలుడు: అయిదుగురు మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. మధ్య బాగ్దాద్‌లోని కర్దా జిల్లాలో నిత్యం జనసమర్థంగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మృతల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో కారు బాంబు పేలుళ్లు నిత్యకృత్యమైనాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5576 మంది మరణించారు. 11666 మందికిపైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. -
కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద తాలిబన్ తీవ్రవాది మంగళవారం ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. ఆ ఘటనలో నలుగురు విదేశీయులతోపాటు15 మంది సైనికులు మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఏడాది కాబుల్ విమానాశ్రయమే లక్ష్యంగా తాలిబాన్ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని పోలీసులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఇటీవల కాలంలో తీవ్రవాదులు దాడి చేసి ఘటనల్లో ఇది అత్యంత హేయమనదని వారు అభివర్ణించారు. మంగళవారం విమానాశ్రయంపై దాడి తమ పనేనంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిత్ ప్రకటించారు. అయితే ఆత్మాహుతి దాడిలో విమానాశ్రయం వద్ద ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. -
తమిళనాట మళ్లీ బాంబు పేలుడు
బెంగుళూరు-గువహటి ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలుడు జరిగి రెండు మూడు రోజులు కాకుండానే తమిళనాట మళ్లీ బాంబు పేలింది. చిదంబరం పట్టణంలోని ఒక మెడికల్ షాపు పైనున్న గదిలో శనివారం బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందులో అరుళ్ అనే యువకుడికి కంటి చూపు కూడా పోయింది. అరుళ్ ఒక యూనివర్సిటీ ఉద్యోగి. చెన్నై సెంట్రలో జరిగిన బాంబు పేలుడు లో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు, ఈ ఘటన ప్రణాళిక రూపకల్పనలో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. చిదంబరం సంఘటనలో మెడికల్ షాపు భవనం పైనున్న గదిలో బాంబులు తయారు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముషారఫ్‌పై బాంబు దాడి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై బాంబుదాడి జరిగింది. ఈ హత్యాయత్నం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్ శివార్లలో ఆయన ఉంటున్న సైనిక ఆస్పత్రి నుంచి కోర్టుకు వచ్చే మార్గంలో బాంబు పెట్టారు. ఆయన వచ్చే మార్గంలో ఓ వంతెన కింద ఉన్న పైపులైనులో నాలుగు కిలోల పేలుడు పదార్థాలను అమర్చారని, సరిగ్గా మరో 20 నిమిషాల్లో ముషారఫ్ అటువైపుగా వెళ్లాల్సి ఉందనగా బాంబు పేలిందని పోలీసులు తెలిపారు. రాజద్రోహం కేసులో ముషారఫ్‌ను ఓ పాకిస్థానీ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేరానికి గరిష్ఠంగా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ముషారఫ్ ప్రాణాలకు ముప్పు ఉండటం, ఆయనపై పదే పదే దాడులు జరుగుతుండటంతో అసలు విచారణ జరుగుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. అనారోగ్యం, భద్రతాపరమైన ముప్పుతో ముషారఫ్ చాలాసార్లు విచారణకు హాజరు కాలేదు. దాదాపు రెండువేల మంది భద్రతా సిబ్బంది వెంటరాగా, భారీ కాన్వాయ్‌తో సోమవారం నాడు ముషారఫ్ కోర్టుకు వచ్చారు. 1999లో అధికారాన్ని చేజిక్కించుకుని, 2008లో పదవీచ్యుతుడైన ముషారఫ్.. తాను ఎలాంటి తప్పు చేయలేదనే ఇప్పటికీ అంటున్నారు. -
బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రో బాంబు దాడి
ప్యారిస్, న్యూస్‌లైన్: కోవై వడవెల్లి సమీపంలో కస్తూరినాయకన్ పాళయంలో బీజేపీ నాయకుడి ఇంటిపై బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పెట్రో బాంబులతో దాడి చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. కస్తూరి పాళయంలో నివాసముంటున్న పురోహితుడు రామనాథన్ (40) వేలాండి పాళయం మండల బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఇటీవల హిందూ సంస్థకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కారణంగా పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. బుధవారం రాత్రి ఆయన భద్రతకోసం నియమితులైన పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి నిద్రించేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. హుటాహుటిన బయటికి వచ్చి చూడగా పెట్రో బాంబు దాడి జరిగి ఉండడం గుర్తించారు. రామనాథన్, పోలీసులతో కలిసి రావడాన్ని చూసిన దుండగులు నలుగురు కారులో పారిపోయారు. రామనాథన్ ఫిర్యాదు మేరకు వడవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జిల్లా ఎస్పీ సుధాకరన్, డీఎస్పీ తంగదురై అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పాతకక్షలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వారు ఎవరూ అనే కోణంలో పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
ఆత్మాహుతి దాడిలో 6గురు మృతి, 20మందికి గాయాలు
కాబుల్: ఆప్ఘనిస్తాన్‌లోని కందాహార్ పట్టణంలో శనివారం ఆత్మహుతి దళ సభ్యడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 6 గురు మృతిచెందగా, 20మంది వరకూ తీవ్ర గాయాలపాలైనట్టు అక్కడి ఉన్నాతాధికారులు వెల్లడించారు. శనివారం ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. షాహిదన్ స్క్వేర్ సమీపాన కాబుల్ బ్యాంక్ వద్ద ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి యత్నించాడు. ఆత్మాహుతి దళ సభ్యుడు బాంబు జాకెట్ సహాయంతో తనను తాను పేల్చివేసుకున్నాడు. బాంబు పెద్దశబ్ధంతో విస్పోటనం చెందడంతో ఒక పోలీసు సహా 5మంది మరణించారు. మరో 20మంది వరకు గాయపడినట్టు ఓ ప్రభుత్వ ఉన్నతాధికరి ఒకరు పేర్కొన్నారు. బాంబు పేలడు ప్రభావంతో ఘటన జరిగిన ప్రదేశానికి సమీపాన ఉన్న కొన్ని భవనాలు, కార్లు దెబ్బతిన్నట్టు సమాచారం. -
అఫ్ఘాన్‌లో భారత ఎంబసీపై ఆత్మాహుతి దాడి
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పెంచిపోషిస్తున్న హక్కానీ నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం మేరకు.. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని ముగ్గురు ఉగ్రవాదులు.. జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వైపు ఒక కారులో దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు ప్రారంభించారు. భారీగా పేలుడు పదార్థాలను ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కారు దిగి రాయబార కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కాల్చేశారు. దాంతో మరో ఉగ్రవాది కారులో ఉన్న బాంబులను పేల్చేశాడు. అదే సమయంలో సమీపంలోని మసీదుకు వెళుతున్న చిన్నారులతోపాటు, వీసాల కోసం వచ్చినవారు మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యిపడింది. అయితే.. భారత అధికారులకు, రాయబార కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ఢిల్లీలోని భారత అధికారవర్గాలు వెల్లడించాయి. రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడుల వంటి ఘటనలతో భారత్ భయపడబోదని, అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం తాము అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.