
లంజిపల్లి బాంబు దాడి సంఘటనలో అరెస్ట్ అయిన నిందితులు
బరంపురం : లంజిపల్లిలో రెండు రోజుల క్రితం జరి గిన బాంబుల దాడి సంఘటనలో 6గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రా తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్‌పీ పినాకి మిశ్రా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ 8వతేదీ రాత్రి 10 గంటల సమయంలో బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి లంజిపల్లి డిప్పవీధిలో నివాసముంటున్న ప్రశాంత్ భిశాయి, ఆయన అనుచరులు వస్తున్న కారుపై బాంబులతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి 6గురు దుండగులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అరెస్ట్ చేసిన వారిని రాధాకృష్ణ సాహు, దీపక్ నాయక్, ప్రతీక్ దోళాయి, శివకుమార్ గొంతాయత్, గోవింద నాయక్, రామకృష్ణ జెనాలుగా గుర్తించినట్లు ఎస్‌పీ చెప్పారు. ఈ బాంబు దాడులకు పాతకక్షలే కారమణమని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి బాంబుల దాడికి ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ దాడుల వెనుక ఎవరున్నది దర్యాప్తు పూర్తయిన వెంటనే తెలియవలసి ఉందని ఎస్‌పీ పినాకి మిశ్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment