విజయకుమార్, పేలని బాంబు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ కుటుంబీకులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ నివాసం కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఉంది. ప్రతిరోజూ వేకువ జామున ఆయన ఇంటి నుంచి కారులో బయటకు వచ్చి, సమీపంలోని క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి వ్యూహ రచన చేశారు. (కీచక ఇన్‌స్పెక్టర్.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..)
మంగళవారం ఉదయాన్నే ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు పేల లేదు. ఇంటివద్దకు వచ్చిన కారు డ్రైవర్ బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్ బృందం రంగంలోకి దిగింది. ఎంపీ ఇంట్లో ఉన్నట్టుగా ఆగుర్తుతెలియని వ్యక్తులు భావించినట్టున్నారు. సోమవారం ఎంపీ తన కారును ఇంటి వద్దే వదలి ఢిల్లీకి బయలు దేరి వెళ్లడంతో ఈ గండం నుంచి బయటపడ్డారు. ఒక వేళ ఆ బాంబు పేలి ఉన్న పక్షంలో కారు, ఆ పరిసరాలు కొన్ని మీటర్ల దూరం మేరకు దెబ్బతిని ఉండేది. ఆ బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. (చెన్నైకు‘నివర్’ ముప్పు!)
Comments
Please login to add a commentAdd a comment