ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో జరిగిన బాంబుదాడిలో మంత్రి తృటిలో తప్పించుకున్నారు. గృహ మంత్రి అక్రం కాన్ దురానీ టార్గెట్ గా గురువారం సాయంత్రం నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లో జరిగిన ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
తన స్వగ్రామానికి వెళుతుండగా మంత్రి కాన్వాయ్ మార్గంలో బాంబులుపేల్చడం ద్వారా మంత్రిని హతమార్చాలని పథకం వేశారు. ఈ క్రమంలో వారు అమర్చిన బాంబులు ఒక్కసారిగా పేలాయి. కానీ, అదృష్టవశాత్తూ అక్రం బతికి బయటపడ్డారు. అయితే స్తానికంగా బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
దాదాపు 7 కిలోల పరిమాణంలో పేలుడు పదార్థాలను రోడ్డు పక్కన అమర్చి రిమోట్తో పేల్చి వేసినట్టు భద్రతా వర్గాలు ప్రకటించాయి. ఈ దాడికి బాధ్యత తమది అని ఏ గ్రూపు ప్రకటించలేదని తెలిపాయి. పాకిస్తాన్ అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
మంత్రి కాన్వాయ్ పై బాంబు దాడి
Published Thu, Nov 26 2015 8:36 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement
Advertisement