
చిరునవ్వులు చిందే చిన్నారి మోము..
బాగ్దాద్ : ఉగ్రపంజా దెబ్బకు రక్తంచిందిన విషాద ఘటనకు సజీవ సాక్ష్యమీ చిత్రం. ఫొటోలోని అమ్మాయి పేరు అషాల్ అహ్మద్. వయసు నాలుగేళ్లు. జూలై 3న బాగ్దాద్‌లో దుకాణసముదాయంపై ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 200మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అషాల్‌కు, ఆమె తల్లికి కాలిన గాయాలయ్యాయి. కాస్తంత కోలుకున్న అషాల్ ఆదివారం అదే ప్రాంతానికి తండ్రితో కలసి వచ్చినపుడు తీసిన ఫొటో ఇది.