అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు.
Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.
Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.
Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.
Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024
రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment