Aero Space companies
-
రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు.రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
హైదరాబాద్‌లో యూఏవీల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీకి హైదరాబాద్ కేంద్రం అయింది. విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్... తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్ దిగ్గజం ఎల్బిట్ సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా శంషాబాద్ సమీపంలో 20 ఎకరాల్లో అదానీ ఎల్బిట్ యూఏవీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ హెర్మెస్ 900 యూఏవీలను రూపొందిస్తారు. వీటిని భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని ఎల్బిట్ కస్టమర్లకు విక్రయిస్తారు. భారత్‌లో ప్రైవేటు రంగంలో అన్–మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) తయారీకి ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇది. అలాగే ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ వెలుపల ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రం కూడా ఇదే. అదానీ ఏరోస్పేస్ పార్క్ సైతం ఇక్కడ కొలువుదీరింది. అదానీ, ఎల్బిట్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఈ రెండు కేంద్రాలను తెలంగాణ హోం శాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ప్రపంచంలో 15 దేశాల్లో.. అత్యాధునిక హెర్మెస్ 900 యూఏవీలను ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని సైన్యం నిఘా, ఇంటెలిజెన్స్ కోసం విజయవంతంగా వినియోగిస్తోంది. 150 యూఏవీల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఆఫర్ చేసిన టెండర్లలో అదానీ ఎల్బిట్ల జాయింట్ వెంచర్ పోటీపడుతోంది. ఇక హైదరాబాద్ సెంటర్లో తొలి ఉత్పాదన మార్చికల్లా సిద్ధం కానుంది. తొలుత ఏటా నాలుగు వాహనాలను తయారు చేస్తారు. 2020 చివరికల్లా ప్లాంటు సామర్థ్యం ఏడాదికి 18 వెహికిల్స్ స్థాయికి చేరనుందని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ హెడ్ ఆశిష్ రాజవంశీ మీడియాకు వెల్లడించారు. కాంప్లెక్సులో 110 మంది ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. ట్రైనింగ్, ఆర్అండ్డీ సెంటర్ స్థాపిస్తున్నామని, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని వివరించారు. 2019 సెప్టెంబరు నుంచి హెలికాప్టర్ల గేర్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ తయారు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంటర్‌కు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్టు ఎల్బిట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ బెజలెల్ మెషిలిస్ వెల్లడించారు. -
ఐదేళ్లలో నాలుగింతల వృద్ధి!
మహేశ్వరంలో పెరిగిన స్థిరాస్తి ధరలు సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల్లో గజం రూ.2 వేలుండేది. కానీ, ఇప్పుడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది. ఏరో స్పేస్ కంపెనీలు, ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులే ఇందుకు కారణమంటున్నారు మెట్రో సిటీ డెవలపర్స్ చైర్మన్ కే మనోహర్‌రెడ్డి. మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల అభివృద్ధి గురించి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ► గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు ఇక్కడి మొబైల్ హబ్‌లో పలు మొబైల్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి కూడా. ► మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు 14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు. ► ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, ఏరో స్పేస్ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా మరో 30 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల, మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుంది. ► ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కలంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు. ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. దీంతో మంగల్‌పల్లి, కొంగర, రావిరాల, ఇంజాపూర్, గుర్రంగూడ వంటి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఊపందుకుంది. ► ఇప్పటి వరకు ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌజ్, విల్లాల నిర్మాణానికే పరిమితమైన మెట్రోసిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 50 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్‌ఫ్రాటెక్‌ను ప్రారంభించాం. ధర గజానికి రూ.5,500. ► ఆదిభట్లలో 10 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను వేశాం. ఇక్కడ ధర గజానికి రూ.9 వేలుగా నిర్ణయించాం. ఫార్మాసిటీకి దగ్గర్లో దాసర్లపల్లిలో మరో వెంచర్‌ను వేయనున్నాం. ఇందులో ధర గజానికి రూ.2 వేలుగా నిర్ణయించాం.