జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.
బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్‌గామ్‌లోని బుద్గామ్‌కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.
ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్‌లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment