అది భూకంపం కాదు.. బాంబు దాడే! | Not Earthquake Its Israel Attack On Syria Video Viral | Sakshi
Sakshi News home page

Video: అది భూకంపం కాదు.. బాంబు దాడే!

Published Mon, Dec 16 2024 12:17 PM | Last Updated on Mon, Dec 16 2024 1:29 PM

Not Earthquake Its Israel Attack On Syria Video Viral

నియంత పాలకుడి పీడ విరగడైందన్న సిరియా ప్రజల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓపక్క ప్రభుత్వ ఏర్పాటునకు తిరుగుబాటు దళాలు కొర్రీలు పెడుతున్న వేళ.. మరోవైపు మిలిటరీ స్థావరాలు, ఆయుధ కారాగార ధ్వంసం పేరిట ఇజ్రాయెల్‌ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు  ఆ దేశ ప్రజలు. తాజాగా..

తాజాగా.. టార్టస్‌ రీజియన్‌లో భూమి కంపించినంత పనైంది. రిక్టర్‌ స్కేల్‌పై 3 తీవ్రత నమోదైంది. అది భూకంపం అని భావించినవారందరికీ.. సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్స్‌ రైట్స్‌ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌ జరిపిన బాంబు దాడి అని ప్రకటించింది.

వైమానిక దాడుల్లో భాగంగా.. స్థావరాలపై బాంబులు ప్రయోగించాయి ఇజ్రాయెల్‌ బలగాలు. ఆ ప్రభావంతో.. అగ్ని గోళం తరహాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భూమి కంపించినంత పనైంది. 2012 నుంచి ఇప్పటిదాకా సిరియా తీరం వెంట ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో.. అతిపెద్ద దాడి ఇదేనని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్స్‌ రైట్స్‌ ప్రకటించింది. 23వ ఎయిర్‌ ఢిపెన్స్‌ బ్రిగేడ్‌ బేస్‌పై జరిగిన దాడిగా ఇది తెలుస్తోంది. 

 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది భూకంపం కంటే రెండు రేట్ల వేగంతో ప్రయాణించిందట. అలా.. 800 కిలోమీటర్ల దూరంలోని టర్కీ నగరం ఇస్నిక్‌లోని భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించడం గమనార్హం.

ఇక.. సిరియాపై ఇజ్రాయెల్‌  దాడులు చాలాకాలంగానే కొనసాగుతున్నాయి. హెజ్‌బొల్లాకు అత్యాధునిక ఆయుధాలు చేరకుండా ఉండేందుకే వైమానిక దాడులతో నాశనం చేస్తున్నామని ఇజ్రాయెల్‌ సమర్థించుకుంటోంది. సిరియాతో యుద్ధం మా అభిమతం కాదు. కానీ, మా దేశ భద్రతకు ముప్పు వాటిల్లో అంశంపై.. మరీ ముఖ్యంగా ఉత్తర సరిహద్దుపైనే మా దృష్టి ఉంది అని బెంజిమన్‌ నెతన్యాహూ చెబుతున్నారు. మరోవైపు.. సిరియాకు ఆయుధ సహకారం అందించిన రష్యా.. తాజా పరిణామాలతో తన స్థావరాలను ఖాళీ చేస్తోంది. తాజాగా దాడి జరిగిన స్థావరం కూడా రష్యాకు చెందినదే అనే ప్రచారం నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement