పోలీసుల అదుపులో నిందితుడు
భువనేశ్వర్/బాలాసోర్ : నిందితుడిని అరెస్టు చేయబోయి పోలీసులు.. బాంబు దాడిని ఎదుర్కొన్నారు. అదృష్టవశాతు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లా రెముణా, సహదేవ్‌కుంఠొ ఠాణాల పోలీసులకు శ్యామరాయిపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పలు నేరారోపణల కింద నిందితుడు ఈశ్వర్ మహాలిక్‌ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇంటిలో నుంచి నిందితుడు పోలీసుల పైకి ఇటుకలు, 3 బాంబులు రువ్వాడు. అయితే అంతా సురక్షితంగా ఉండడం అదృష్టకరం. 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ పోలీసుల పైకి మరిగిన నూనె విసిరి, పరుగులు తీయించాడు. ( మరో జాతి వారింట్లో విందు భోజనం చేశారని..)
5 గంటలకు పైగా..
ఈశ్వర మహాలిక్‌ని అరెస్టు చేసేందుకు రెండు ఠాణాల పోలీసులు దాదాపు 5 గంటలపాటు నిర్వరామంగా శ్రమించారు. ఎట్టకేలకు ప్రాణాలను పణంగా పెట్టి, అరెస్టు చేయగలిగారు. పోలీసులు రాక గుర్తించిన నిందితుడు.. తొలుత ఇంట్లో నుంచి రాళ్లు, సీసాలను రువ్వి బెదిరించాడు. బెదిరింపులకు లెక్క చేయకుండా పోలీసులు ఇంటిని చుట్టు ముట్టడంతో బాంబులు రువ్వి హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. 3 బాంబుల్లో ఒకటి మాత్రమే పేలింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పోలీసులు.. సురక్షితంగా నిలిచి నిందితుడిని అరెస్టు చేశారు. ( నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో)
Comments
Please login to add a commentAdd a comment