
ఎంపీ పార్లమెంట్‌కు వెళ్తుండగా బాంబు దాడి
కాబూల్: ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం శక్తివంతమైన బాంబుపేలుడు సంభవించింది. పార్లమెంట్‌కు వెళ్తున్న ఓ ఎంపీని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు.
బమియన్ ఎంపీ ఫకురి బహిస్తిని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగినట్లు టోటో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఎంపీ కాన్వాయ్‌కి సమీపంలో బాంబు పేలుడు జరగడంతో బాడీగార్డు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించడానికి నిరాకరించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి.. బాంబు దాడిలో కొంత నష్టం జరిగిందని మాత్రం తెలిపారు. గతవారం సైతం ఓ పార్లమెంట్ మెంబర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.