
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై సోమవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బాంబు దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్పూర్‌లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు.
దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సురేంద్ర మిథాని.. తన వ్యక్తిగత సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.
(చదవండి:కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment