తమిళనాట మళ్లీ బాంబు పేలుడు | Another explosion rocks Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాట మళ్లీ బాంబు పేలుడు

Published Sat, May 3 2014 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

Another explosion rocks Tamil Nadu

బెంగుళూరు-గువహటి ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలుడు జరిగి రెండు మూడు రోజులు కాకుండానే తమిళనాట మళ్లీ బాంబు పేలింది. చిదంబరం పట్టణంలోని ఒక మెడికల్ షాపు పైనున్న గదిలో శనివారం బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందులో అరుళ్ అనే యువకుడికి కంటి చూపు కూడా పోయింది. అరుళ్ ఒక యూనివర్సిటీ ఉద్యోగి. 
 
చెన్నై సెంట్రలో జరిగిన బాంబు పేలుడు లో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు, ఈ ఘటన ప్రణాళిక రూపకల్పనలో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. చిదంబరం సంఘటనలో మెడికల్ షాపు భవనం పైనున్న గదిలో బాంబులు తయారు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement