మూడు దేశాల పర్యటన నేపథ్యంలో మోదీ
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ‘బ్రసెల్స్‌లో భయంకరమైన బాంబు దాడి నుంచి కోలుకున్న బెల్జియం ప్రజల స్ఫూర్తికి వందనం. వారి మనోధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. భారత్ వారికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. మూడు దేశాల పర్యటన నిమిత్తం మోదీ మంగళవారం రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. బ్రసెల్స్‌లో జరిగే 13వ భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్‌కు వెళ్తారు.
ఈనెల 31, ఏప్రిల్ 1న అక్కడ జరిగే ‘అణు భద్రతా సదస్సు’లో పాల్గొంటారు. అనంతరం సౌదీ అరేబియాకు వెళ్తారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో పర్యటన సాగుతుంది. రెండేళ్ల వ్యవధిలోనే మూడోసారి అమెరికా వస్తున్న మోదీ పర్యటన ఆహ్వానించతగ్గ పరిణామమని భారత రాయబారి అరుణ్ కె సింగ్ అన్నారు. మూడు దశాబ్దాల కిందట ఇలాంటి పరిణామం కనీసం ఊహించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విడి అణు పదార్థాల భద్రతకే అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని వైట్‌హౌస్ ప్రకటించింది.
బెల్జియం ప్రజల స్ఫూర్తికి వందనం
Published Wed, Mar 30 2016 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement
Advertisement