ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి | 10 killed in Afghanistan bomb attack | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి

Published Wed, Jul 22 2015 2:58 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

10 killed in Afghanistan bomb attack

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ ఉత్తర ప్రావిన్స్ ఫర్యాబ్లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మరణించారని... మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. అల్మర్ జిల్లాలో మార్కెట్ వద్ద ఈ రోజు ఉదయం ఈ దాడి చోటు చేసుకుందని వివరించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారని పేర్కొంది.

క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని మీడియా పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement