కాబుల్: ఆప్ఘనిస్తాన్‌లోని కందాహార్ పట్టణంలో శనివారం ఆత్మహుతి దళ సభ్యడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 6 గురు మృతిచెందగా, 20మంది వరకూ తీవ్ర గాయాలపాలైనట్టు అక్కడి ఉన్నాతాధికారులు వెల్లడించారు. శనివారం ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. షాహిదన్ స్క్వేర్ సమీపాన కాబుల్ బ్యాంక్ వద్ద ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి యత్నించాడు.
ఆత్మాహుతి దళ సభ్యుడు బాంబు జాకెట్ సహాయంతో తనను తాను పేల్చివేసుకున్నాడు. బాంబు పెద్దశబ్ధంతో విస్పోటనం చెందడంతో ఒక పోలీసు సహా 5మంది మరణించారు. మరో 20మంది వరకు గాయపడినట్టు ఓ ప్రభుత్వ ఉన్నతాధికరి ఒకరు పేర్కొన్నారు. బాంబు పేలడు ప్రభావంతో ఘటన జరిగిన ప్రదేశానికి సమీపాన ఉన్న కొన్ని భవనాలు, కార్లు దెబ్బతిన్నట్టు సమాచారం.
ఆత్మాహుతి దాడిలో 6గురు మృతి, 20మందికి గాయాలు
Published Sat, Aug 31 2013 5:42 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement
Advertisement