పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసు:నలుగురి ఉరితీత | Four terror convicts executed in Pakistan | Sakshi
Sakshi News home page

పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసు:నలుగురి ఉరితీత

Published Sun, Dec 21 2014 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

Four terror convicts executed in Pakistan

ఇస్లామాబాద్:పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసులో నలుగురి నిందితుల్ని ఆదివారం ఉరితీశారు. ఉరిశిక్ష అమలులో భాగంగా  ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ శిక్ష అనుభవిస్తున్నఆ నిందితుల్ని శనివారం రాత్రి  జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఉబర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి మరియ రష్యా వాసి అక్విలేక్యూ అహ్మద్ ల నిందితులుగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.  ఆ నిందితులను ఉరితీసే క్రమంలో కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం జిల్లా జైలు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని ఉరితీసినట్లు జైలు అధికారులు తెలిపారు.

 

ఈ కేసుకు సంబంధించి కోట్ లాక్ పేట్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దర్ని ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఇద్దరి నిందితుల్ని మరో ఒకటి రెండు రోజుల్లో ఉరితీసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement