parvez musharraf
-
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మరణశయ్యపై ‘ముషారఫ్’.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు ముషారఫ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులు కూడా ఆయన కోలుకోవడం సాధ్యం కాదని తెలిపినట్టు వెల్లడించారు. ముషారఫ్.. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటిష్ పాలనా కాలంలో (11 ఆగష్టు 1943) ముషారఫ్ ఢిల్లీలో జన్మించగా.. అనంతరం కరాచీ, ఇస్తాంబుల్‌లో పెరిగారు. 2001 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా కొనసాగారు. కాగా, ముషారఫ్ 1961లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో చేరి.. 1964లో ఆఫ్ఘన్ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. 1990వ దశకంలో, ముషారఫ్ మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 1998లో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేత ఫోర్-స్టార్ జనరల్‌గా పదోన్నతి పొందడంతో ముషారఫ్ జాతీయ స్థాయికి ఎదిగారు. 1999లో భారత్, పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యానికి ముషారఫ్ నాయకత్వం వహించారు. 2007లో పదవీ విరమణ చేసే వరకు ముషారఫ్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగాడు. 2007లో ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసినందుకు గానూ పాక్ సుప్రీంకోర్టు 2013లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధించింది. కాగా, ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ముషారఫ్ 2016లో పాకిస్తాన్ నుండి దుబాయ్‌కు వెళ్లిపోయారు. Prayers and Thoughts 🙏 He's on Ventilator... Allah pak bless with good health ame...#pervezmusharraf pic.twitter.com/3rt3EB7Flq — Fabiha Ejaz Hussain (@Fabiha1810) June 10, 2022 ఇది కూడా చదవండి: రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్? వాళ్లను నిండా ముంచడమే లక్ష్యంగా..! -
పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) బాలీవుడ్ గాయకుడు మికా సింగ్‌పై నిషేధం విధించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చినందుకుగాను మికా సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ మికా సింగ్ పాల్గొన్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. మికా సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తడం వంటి విషయాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాలోని అన్ని ప్రొడక్షన్ హౌజ్‌లు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్లైన్ మ్యూజిక్ ప్రొవైడర్స్ ఇక నుంచి మికా సింగ్‌తో పని చేయకూడదని ఏఐసీడబ్ల్యూఏ ఆదేశించింది. ఒకవేళ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మికా సింగ్‌తో కలిసి పనిచేస్తే.. వారిపై కూడా కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. ఓవైపు కశ్మీర్ విషయంలో భారత నిర్ణయాన్ని పాకిస్తాన్ తప్పు పడుతున్నవేళ.. దేశ ప్రయోజనాల కంటే మికా సింగ్ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడని.. అందుకే అతనిపై నిషేధం విధించామని ఏఐసీడబ్ల్యూఏ తెలిపింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది. -
ఆ.. కలయిక ప్రపంచానికే ప్రమాదం!
ఆమ్స్టర్డ్యామ్ : పాకిస్తాన్లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొన్ని వారాల కిందట గృహనిర్భంధం నుంచి విడుదలైన జమాతే ఉద్ దవా చీఫ్ హపీజ్ సయీద్, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కలిసి ఎన్నికలకు వెళితే ప్రమాదకర ఫలితాలు వస్తాయని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లమెసీ హెడ్ పాల్ స్కాట్ అంచనా వేశారు. ‘హపీజ్ సయీద్ : ఏ సీరియస్ ఆఫ్ క్యూరియస్ డెవలప్మెంట్స్’ పేరుతో పాల్ స్కాట్ ఒక ఆర్టికల్ ప్రచురించారు. అందులో ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై ఆధారాలు లేవని పాకిస్తాన్ కోర్టులు ప్రకటించడంపై ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ విడుదలపై భారత్‌తో పాటు అమెరికా సైతం.. పాకిస్తాన్‌ను తీవ్రంగా ఆక్షేపించింది. ఇదిలా ఉండగా హఫీజ్ సయీద్ తాజాగా రాజకీయాల్లోకి రావడంతో.. పాకిస్తాన్ విదేశాంగ విధానంలోనూ భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ మాజీ సైనిక పాలకుడు ముషరాఫ్ బహిరంగంగానే హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం, లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో అమెరికా స్నేహ, దౌత్య సంబంధాలు తెంచుకోవడం మంచిదని ఆయన సూచించారు. హఫీజ్ సయీద్, ముషారఫ్ ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధిస్తే.. అది భారత్‌తో పాటు ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగించేదని స్కాట్ తెలిపారు. -
ముషర్రఫ్‌కు ఊహించని ఝలక్
-
ఒక్క ప్రకటన... ‘మాస్టర్’ ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్
ఇస్లామాబాద్ : ఎలాగైనా తిరిగి అధికారంలోకి వద్దామని భారీ వ్యూహరచన చేసిన మాజీ సర్వసైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు ఊహించని ఝలక్. ఆయన కొత్తగా ప్రకటించిన అవామీ ఇత్తెహాద్ కూటమిలో చేరేందుకు పలు కీలక పార్టీలు విముఖత వ్యక్తంచేశాయి. షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్‌ను ఎదుర్కునేందుకు ముషారఫ్ శనివారం ‘పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్’ మహా కూటమిని ఏర్పాటు చేశారు. పీఐఏకు 74 ఏళ్ల ముషర్రఫ్ సారథ్యం వహిస్తుండగా.. ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పార్టీలకు విజ్ఞప్తి చేశారు కూడా. పాకిస్థాన్ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ) , ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్పీ), మజ్లిస్ వహెదత్-ఈ-ముస్లిమీన్(ఎండబ్ల్యూఎం), సున్ని ఇత్తెహద్ కౌన్సిల్(ఎస్ఐసీ) ఇలా 23 పార్టీలను తమతో చేతులు కలపాల్సిందిగా ముషర్రఫ్ కోరారు. అయితే ఆయా పార్టీలు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షమైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ ఈ విషయంలో ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, పంజాబ్ బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే త్వరగతిన ఎన్నికలు జరగాలని... ఆ పోరాటంలో స్వచ్ఛరాజకీయాలకే తాము ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా వెనకంజ వేశాయన్నది స్పష్టమౌతోంది. ఏది ఏమైతేనేం ముషర్రఫ్ మహాకూటమి ఘోరంగా విఫలమైందని రెండో రోజే రాజకీయ విశ్లేషకులు నిర్ధారించారు. -
పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసు:నలుగురి ఉరితీత
ఇస్లామాబాద్:పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసులో నలుగురి నిందితుల్ని ఆదివారం ఉరితీశారు. ఉరిశిక్ష అమలులో భాగంగా ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ శిక్ష అనుభవిస్తున్నఆ నిందితుల్ని శనివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఉబర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి మరియ రష్యా వాసి అక్విలేక్యూ అహ్మద్ ల నిందితులుగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిందితులను ఉరితీసే క్రమంలో కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం జిల్లా జైలు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని ఉరితీసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోట్ లాక్ పేట్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దర్ని ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఇద్దరి నిందితుల్ని మరో ఒకటి రెండు రోజుల్లో ఉరితీసే అవకాశం ఉంది. -
ముషారఫ్‌పై బాంబు దాడి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై బాంబుదాడి జరిగింది. ఈ హత్యాయత్నం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్ శివార్లలో ఆయన ఉంటున్న సైనిక ఆస్పత్రి నుంచి కోర్టుకు వచ్చే మార్గంలో బాంబు పెట్టారు. ఆయన వచ్చే మార్గంలో ఓ వంతెన కింద ఉన్న పైపులైనులో నాలుగు కిలోల పేలుడు పదార్థాలను అమర్చారని, సరిగ్గా మరో 20 నిమిషాల్లో ముషారఫ్ అటువైపుగా వెళ్లాల్సి ఉందనగా బాంబు పేలిందని పోలీసులు తెలిపారు. రాజద్రోహం కేసులో ముషారఫ్‌ను ఓ పాకిస్థానీ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేరానికి గరిష్ఠంగా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ముషారఫ్ ప్రాణాలకు ముప్పు ఉండటం, ఆయనపై పదే పదే దాడులు జరుగుతుండటంతో అసలు విచారణ జరుగుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. అనారోగ్యం, భద్రతాపరమైన ముప్పుతో ముషారఫ్ చాలాసార్లు విచారణకు హాజరు కాలేదు. దాదాపు రెండువేల మంది భద్రతా సిబ్బంది వెంటరాగా, భారీ కాన్వాయ్‌తో సోమవారం నాడు ముషారఫ్ కోర్టుకు వచ్చారు. 1999లో అధికారాన్ని చేజిక్కించుకుని, 2008లో పదవీచ్యుతుడైన ముషారఫ్.. తాను ఎలాంటి తప్పు చేయలేదనే ఇప్పటికీ అంటున్నారు.