ఆమ్‌స్టర్‌డ్యామ్ : పాకిస్తాన్‌లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొన్ని వారాల కిందట గృహనిర్భంధం నుంచి విడుదలైన జమాతే ఉద్ దవా చీఫ్ హపీజ్ సయీద్, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కలిసి ఎన్నికలకు వెళితే ప్రమాదకర ఫలితాలు వస్తాయని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లమెసీ హెడ్ పాల్ స్కాట్ అంచనా వేశారు.
‘హపీజ్ సయీద్ : ఏ సీరియస్ ఆఫ్ క్యూరియస్ డెవలప్‌మెంట్స్’ పేరుతో పాల్ స్కాట్ ఒక ఆర్టికల్ ప్రచురించారు. అందులో ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై ఆధారాలు లేవని పాకిస్తాన్ కోర్టులు ప్రకటించడంపై ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ విడుదలపై భారత్‌తో పాటు అమెరికా సైతం.. పాకిస్తాన్‌ను తీవ్రంగా ఆక్షేపించింది.
ఇదిలా ఉండగా హఫీజ్ సయీద్ తాజాగా రాజకీయాల్లోకి రావడంతో.. పాకిస్తాన్ విదేశాంగ విధానంలోనూ భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ మాజీ సైనిక పాలకుడు ముషరాఫ్ బహిరంగంగానే హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం, లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో అమెరికా స్నేహ, దౌత్య సంబంధాలు తెంచుకోవడం మంచిదని ఆయన సూచించారు. హఫీజ్ సయీద్, ముషారఫ్ ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధిస్తే.. అది భారత్‌తో పాటు ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగించేదని స్కాట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment