వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధాని హఫీజ్ సయీద్‌ను గృహనిర్భంధం నుంచి పాకిస్తాన్ విడుదల చేయడంపై అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. ఉగ్రవాదిగా గుర్తించిన హఫీజ్ సయీద్‌ను పాక్ విడుదల చేయడం అంటేనే.. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆ దేశం కోరుకోవడం లేనట్టు స్పష్టమవుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ విడుదల పాకిస్తాన్ - భారత్ మధ్య దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ విడుదలతోనే పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం అన్న విషయం మరోసారి స్పష్టమైందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. హఫీజ్ సయీద్‌ను అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది.. అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హఫీజ్ సయాద్ గురించిన మరో ఆలోచన లేదని.. అతడు అంతర్జాతీయ ఉగ్రవాదేని అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది.
పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, గ్రూపులపై ఎటువంటి చర్య తీసుకోవాలనేది ఆ దేశ నిర్ణయమేనని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి.. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. హఫీజ్ సయాద్‌ను తిరిగి అరెస్ట్ చేయాలని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్‌ను ఆదేశించింది. హఫీజ్ సయీద్ వ్యవహారం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై పెను ప్రబావం చూపే అవకాశముందని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్‌ను హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment